మూడు చేపల కథ..🐟🐋🐳

ఈ కథ భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించిన కథ మహాభారతానికి సంబంధించిన మూడుచేపల కథ.

అనగనగా ఒక చెరువు ఉండేది అందులో దీర్గదర్శి ,దీర్ఘసుత్రుడు,ప్రాప్తకాలజ్ఞుడు అనే మూడు చేపలు ఉండేవి.ఆ చెరువు ఎల్లప్పుడూ నీటిని కలిగి ఉండేది కావున ఆ చేపలు సంతోషంగా ఉండేవి.ఎల్లప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవు కదా! ఆ చెరువులోకి నీళ్లు రావడం తగ్గిపోయాయి,దాంతో కంగారు పడిన దీర్ఘదర్శి మిగిలిన రెండు చేపలతో చూడండి మిత్రులారా ఈ చెరువు కొన్ని రోజులలో ఎండిపోతుంది.మనం ఇక్కడ నుండి బయటపడి వేరే దారి చూసుకోవాలి అన్నది.అది విన్న దీర్ఘసుత్రుడు, ప్రాప్తకాలజ్ఞుడు ఎప్పుడో ఎండిపోయే చెరువు గురించి ఇప్పటి నుండి ఎందుకు కంగారు పడడం ఎండిపోయినపుడు మనం ఎటైనా వెళ్లిపోదాం అన్నాయి.దీర్గదర్శి వీళ్లకు చెప్పడం వృధా అని మెల్లిగా పిల్లకాలువలోకి వెళ్ళింది ఆ తర్వాత పెద్ద చెరువులోకి దూకింది.సంతోషంగా జీవించసాగింది.
     కొంతకాలానికి దీర్గదర్శి చెప్పినట్టే చెరువు ఎండిపోయింది అది చిన్న మడుగు లాగా కనిపించింది ఎండిపోయిన చెరువులో చేపలు ఎక్కువగా ఉంటాయి అని జాలరులు వల వేశారు. ప్రాప్తకాలజ్ఞుడు మొత్తం బురద అంటించుకుంది చనిపోయినట్టు నటించింది.వలలో దీర్ఘసుత్రుడు చిక్కిపోయాడు.ఈ చేపలకు బురద ఉందని పక్కన ఉన్న చెరువులో కడిగారు వెంటనే అది ఆ నీటిలో పారిపోయింది.దీర్ఘసుత్రుడు మాత్రం వలకు చిక్కి ఆహారం ఐపోయాడు.దీర్గదర్శి ముందుచూపుతో  ప్రమాదాన్ని పసిగట్టి తప్పించుకుంది.ప్రాప్తకాలజ్ఞుడు పీకల మీదకు వచ్చినపుడు ఉపాయం ఆలోచించి తప్పించుకున్నాడు,దీర్ఘసూత్రుడు ఏ ఆలోచన చేయకుండా కాలాన్ని వృధా చేసాడు ఆహారంగా ఐపోయాడు.మనలో చాలా మంది ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసుత్రుడు వలే ఉంటాము తప్పితే దీర్గదర్శి మాదిరి ముందుగానే ఆలోచన చేయము .దాని వల్ల ప్రమాదాలు జరుగుతాయి.కానీ దీర్గదర్శి లాగా ఆలోచన చేస్తే జీవితంలో ఎదుగుదల ఉంటుంది.






Comments

Popular posts from this blog

రామచిలుక కథ

చిన్న చేప కథ

అంతా మన మంచికే...