సోమరి కొడుకు కథ
అనగనగా ఒక ఊరిలో చెంగయ్య అనే వ్యక్తి ఉండేవాడు , అతనికి రాజు అనే కొడుకు ఉండేవాడు.అతను చాలా సోమరిపోతు ఏ పని పాట లేకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు.రాజుని తండ్రి ఎప్పుడు మందలించే వాడు.అయిన వాడు మాత్రం ఏమి చేయకుండా అలాగే తిరిగేవాడు. ఒకరోజు ఎంత చెప్పినా వినడం లేదు అని ఇంటి నుండి బయటకు పంపించేశారు.ఏదయినా పని చేసి డబ్బులు తీసుకొని ఇంటికి వస్తేనే నీకు భోజనం లభిస్తుంది అన్నాడు చెంగయ్య.రాజు పని కోసం వెళ్లాడు కానీ పని దొరకలేదు.అయితే అతను తనకు తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు దానిని తెచ్చి తండ్రికి ఇచ్చాడు.దానికి తండ్రి సంతోషించి తీసుకొని భోజనం పెట్టాడు ఆ డబ్బును ఇంట్లొ ఉన్న బావిలో వేసాడు చెంగయ్య. రాజు చూసుకుంటూ వెళ్ళాడు తప్ప ఏమీ అనలేదు.అలా వెళ్లి భోజనం తిని పడుకున్నాడు. తెల్లారి కూడా అలాగే బయటకు వెళ్లి డబ్బులు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చాడు.అలా మూడు నెలలు గడిచిపోయాయి.ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది.కొంతకాలానికి ఒకరోజు ఎంత వెతికినా ఎవరు దొరకలేదు ఖాళీగా ఇంటికి వచ్చాడు,ఇంట్లో భోజనం పెట్టలేదు.అలాగే పడుకున్నాడు.మళ్ళీ వెళ్ళాడు సగం రోజు వరకు ఎవరూ దొరకలేదు.రిక్షా తొక్కే వ్యక్తి కనిపిస్తే అతని దగ్గరికి వెళ్లి నేను ఈ రిక్షా తొక్కుతా నాకు ఈ రిక్షా ఇస్తారా అన్నాడు అతను నాకు ఏంటి లాభం అన్నాడు నువ్వు రిక్షా ఇస్తే నీకు వచ్చిన డబ్బులలో సగం ఇస్తాను ఆంటీ సరే అని రిక్షా ఇచ్చాడు.రాత్రి వరకు రిక్షా తొక్కి డబ్బు సంపాదించి సగం తీసుకొని సగం రిక్షా అతనికి ఇచ్చి ఇంటికి వెళ్లి తండ్రికి డబ్బులు ఇచ్చి భోజనానికి వెళ్ళాడు.ఆ డబ్బులు అతను బావిలో వేసాడు రాజుకి కోపం వచ్చింది ,నీకు ఇన్ని రోజులు అసలు కోపం రాలేదు ఈ రోజు ఎందుకు వస్తుంది.నిన్న మొన్న నువ్వు అసలు కోప్పడలేదు ఈ రోజు ఎందుకు అన్నాడు?ఎందుకంటే నేను చెప్పనా!రోజు నువ్వు డబ్బులు సంపాదించకుండా తెస్తున్నావు కాబట్టే నీకు కోపం రాలేదు,ఈ రోజు ఒక్కరోజు సంపాదించే సరికి కోపం వచ్చిందా? కష్టపడి పని చేయడం వల్ల నీకు డబ్బుల విలువ తెలిసింది అదే నువ్వు ప్రతిరోజూ పని చేయకపోవడం వల్ల నువ్వు అసలు బాధ పడలేదు.అందుకే కష్టపడి పనిచేసి సంపాదించిన ఒక రూపాయి అయిన గొప్పదే అన్నాడు చెంగయ్య, రాజు తండ్రిని క్షమించమని అడిగాడు ఇంకెప్పుడు ఇలా చేయను అని అన్నాడు.
Comments
Post a Comment