శ్రవణకుమారుడి కథ..
ఈ కథ అందరికీ తెలుసు కానీ ఇంకా తెలియని వాళ్ళ కోసం మాత్రమే. గాంధీజీ తన ఆశ్రమంలో జనులందరితో ముచ్చటిస్తూ వున్నారు.అక్కడ ఉన్నవారు తల్లిదండ్రుల సేవ ఎలా చేయాలి అని అడిగారు దానికి గాంధీజీ ఒక కథ చెప్తాను అన్నాడు ఎందుకంటే ఆ కథ అంటే గాంధీజీకి చాలా ఇష్టం.అది తల్లిదండ్రులను గౌరవించే శ్రవణకుమారుడి కథ.శ్రవనకుమారుడి తల్లిదండ్రులకు కళ్ళు లేవు ఐతే వారి బాగోగులు మొత్తం ఆయనే చూస్తూ ఉండేవాడు .వారు వయసు మీరడంతో మాకు తీర్థయాత్రలు చేయలని ఉంది అని అన్నారు దానికి శ్రవనకుమారుడు సరే అన్నాడు.వారిద్దరిని ఒక కావడి తయారు చేసి దానిలో కూర్చో బెట్టాడు.వారిని అలా తీసుకొని వెళుతుండగా దారిలో వారికి దాహం వేసింది ,నీళ్ల కోసం వారిని అక్కడే ఉంచి వెళ్ళాడు.ఇంతలో వేటకు వచ్చిన దశరథ మహారాజు జింక అనుకోని బాణం వేసాడు అది శ్రవనకుమారుడికి గుచ్చుకుంది .దశరథుడు వచ్చి చూసి అయ్యె?నేను ఎంత పాపం చేసాను అని బాణం తీయడానికి ప్రయత్నించాడు,శ్రవనకుమారుడు వద్దు మహారాజ న తల్లిదండ్రులకు దాహం తీర్చి ఈ విషయాన్ని చెప్పండి అని కన్ను ముసాడు.దశరథుడు తీవ్రమైన దుఃఖంతో వచ్చి వారి దాహం తీర్చి నా వల్ల మీ కుమారుడు మరణించాడు అని చెప్...