ఈ కథ అందరికీ తెలుసు కానీ ఇంకా తెలియని వాళ్ళ కోసం మాత్రమే. గాంధీజీ తన ఆశ్రమంలో జనులందరితో ముచ్చటిస్తూ వున్నారు.అక్కడ ఉన్నవారు తల్లిదండ్రుల సేవ ఎలా చేయాలి అని అడిగారు దానికి గాంధీజీ ఒక కథ చెప్తాను అన్నాడు ఎందుకంటే ఆ కథ అంటే గాంధీజీకి చాలా ఇష్టం.అది తల్లిదండ్రులను గౌరవించే శ్రవణకుమారుడి కథ.శ్రవనకుమారుడి తల్లిదండ్రులకు కళ్ళు లేవు ఐతే వారి బాగోగులు మొత్తం ఆయనే చూస్తూ ఉండేవాడు .వారు వయసు మీరడంతో మాకు తీర్థయాత్రలు చేయలని ఉంది అని అన్నారు దానికి శ్రవనకుమారుడు సరే అన్నాడు.వారిద్దరిని ఒక కావడి తయారు చేసి దానిలో కూర్చో బెట్టాడు.వారిని అలా తీసుకొని వెళుతుండగా దారిలో వారికి దాహం వేసింది ,నీళ్ల కోసం వారిని అక్కడే ఉంచి వెళ్ళాడు.ఇంతలో వేటకు వచ్చిన దశరథ మహారాజు జింక అనుకోని బాణం వేసాడు అది శ్రవనకుమారుడికి గుచ్చుకుంది .దశరథుడు వచ్చి చూసి అయ్యె?నేను ఎంత పాపం చేసాను అని బాణం తీయడానికి ప్రయత్నించాడు,శ్రవనకుమారుడు వద్దు మహారాజ న తల్లిదండ్రులకు దాహం తీర్చి ఈ విషయాన్ని చెప్పండి అని కన్ను ముసాడు.దశరథుడు తీవ్రమైన దుఃఖంతో వచ్చి వారి దాహం తీర్చి నా వల్ల మీ కుమారుడు మరణించాడు అని చెప్పాడు .ఆ విషయం తెలుసుకున్న వారు ఎంతగానో బాధపడి మాకు కలిగించిన ఈ పుత్రశోకం నీవు అనుభవిస్తావు అని శపించారు. వెంటనే పక్కనే ఉన్న నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.ఎప్పుడైనా ఏదయినా పని చేసేటపుడు ముందు వెనక చూసుకోవాలి లేకపోతే దాని వల్ల వారు మాత్రమే కాకుండా ఇతరులు కూడా బాధపడవలసి వస్తుంది.
ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా! ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా. కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా. మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా. అనగనగా ఒక ఊర...
Comments
Post a Comment