మౌన వ్రతం
రాఘవ పురం అనే గ్రామం ఉండేది.ఆ గ్రామంలో ప్రజలు అంతా సుఖ శాంతులతో జీవించసాగారు.అలాంటి గ్రామం లోకి ఒక వదరుబోతు వచ్చాడు అతను గ్రామంలోని ప్రజలు ఇంత సుఖంగా ఉండడం చూడలేక పోయాడు. అతను అక్కడి వారందరితో స్నేహం చేసాడు, అలా కొంత కాలం మంచిపేరు ,నమ్మకం సంపాదించాడు.
తర్వాత ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పడం మొదలు పెట్టాడు మొదట్లో ఎవరూ నమ్మకపోయేవారు తర్వాత తర్వాత నమ్మడం మొదలు పెట్టారు దీని వలన ఆ గ్రామం లోని ప్రజలు నిత్యం ఏదో ఒక సంఘర్షణ పడుతుండేవారు, దానితో విసుగు చెందిన గ్రామ పెద్దలు ఒక సాధువు దగ్గరకు వెళ్ళి వాళ్ళ గోడు చెప్పారు .ఉన్నట్టుండి మా గ్రామంలో అంతః కలహాల వల్ల గ్రామాభివృద్ధి జరగడం లేదు అని చెప్పారు.
ఆ సాధువు మీరు ఒక నెలంతా మౌనవ్రతం పాటించండి అని చెప్పాడు .గ్రామపెద్దలకు ఏమి బోధ పడలేదు అయిన సాధువు చెప్పడం వల్ల ప్రజలంతా మౌనవ్రతం పాటించాలని చాటింపు వేసారు.గ్రామంలో ప్రజలు మౌనంగా ఎవరి పనులు వారు చేసుకుంటూ జీవించారు.ఊరు ఊరు అంతా ప్రశాంత వాతావరణం ఏర్పడింది గ్రామ పెద్దలు సంతోషించి సాధువు దగ్గరకు వెళ్లారు అయ్యా మీరు చెప్పిన్నట్టే నెల నుండి మేము వ్రతం చేస్తున్నాం అందరూ సంతోషంగా వున్నారు అని చెప్పారు అది ఎలా సాధ్యం అని ఆ సాధువు ను అడిగారు పెద్దలు.
దానికి సాధువు నవ్వుతూ "మౌనం అనేది ఒక అంతర్గత సంభాషణ అది ఎదుటి వారిని నొప్పించకుండా ఉంటుంది మౌనం వలన సృజనాత్మక పెరుగుతుంది శరీరం పైన గాయం చేస్తే నయం అవుతుంది కానీ మాటల వల్ల మనసు బాధ పడితే దానిని నయం చేయలేము మాటలు ఎల్లప్పుడూ అవసరం ఉన్నంత వరకు మాత్రమే వినియోగించాలి."
పెద్దలు ఊరుకే అనలేదు నోరు మంచిది ఐతే ఊరు మంచిది అవుతుంది అని కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి........
Comments
Post a Comment