Skip to main content

రామచిలుక కథ

అనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యంలో ఒక వేటగాడు వున్నాడు.అతను వేటకు వెళ్లి రెండు రామచిలుకలను పట్టి తెచ్చాడు.ఆ చిలుకలను రాజభవననికి తెచ్చి రాజుకు బహుకరించాడు. ఆ రాజు ఈ చిలుకలను మంత్రికి మరియు సేనాధిపతికి ఇచ్చాడు.మంత్రికి,సేనాధిపతికి ఒక్క నిముషం కూడా పడదు . రాజు  రామచిలుకకు ఎవరైతే మాటలు నేర్పిస్తారో వారికి బహుమతులు ఇస్తాను అని చెప్పాడు .మంత్రి ఇంటికి వెళ్లి భార్యతో దీనికి మాటలు నేర్పించు మనకు అన్ని బహుమతులు రావాలి అంటాడు అది విన్న మంత్రి భార్య ఎలా అండి అని అడిగింది. రాజు గారు దీనికి మాటలు నేర్పిస్తే బహుమతి ఇస్తా అన్నారు అంటాడు.
మంత్రి గారి భార్య సరే అంటుంది. సేనాధిపతి కూడా భార్యకు విషయం చెప్పి చిలుకను ఇస్తాడు.
మంత్రి భార్య ఒక సంగీతం నేర్పించే గురువు అవడడం చేత అది అన్ని పాటలు ,పద్యాలు మంచి మాటలు నేర్చుకుంది. సేనాధిపతి భార్య పదవి ఉందని అహంకారంతో ఏ పని చేయకుండా అందరితో గొడ్డు చాకిరి చేపిస్తూ అందరిని తిడుతూ ఉంటుంది అది విన్న చిలుక ఆ మాటలు తిట్లు నేర్చికుంది.మంత్రి ఎప్పుడు రాజు క్షేమంగా ఉండాలని కోరుకుంటాడు కనుక చిలుక కూడా రాజు గారి మీద గౌరవం పెంచుకుంటుంది సేనాధిపతి రాజుకి వ్యతిరేకంగా ఇతర రాజ్యలతో రహస్య సమావేశాలు నిర్వహించి రాజు పై దాడికి ప్రయత్నిస్తాడు. ఒకరోజున రాజుగారు ఆ రెండు చిలుకలని సభకు తేవలసిందిగా ఆదేశించాడు. వారిద్దరూ చిలుకలను తీసుకుని వచ్చారు,రాజు మంత్రి గారి చిలుకను అడిగాడు.ఎలా వున్నావు? అని దానికి ఆ చిలుక పద్దతిగా నేను బాగున్నాను. రాజు గారు మీరు ఎలా ఉన్నారు ?అని అడిగింది
రాజు కు సంతోషం కలిగింది.సేనాధిపతి చిలుకని ప్రశ్నించాడు రాజు దానికి ఆ చిలుక నేను ఎలా ఉంటే నీకు ఎందుకు అయిన మా  సేనాధిపతి నీపైన దాడి చేపిస్తాడు .నువ్వు చస్తావ్ అని అంటుంది రాజు కి కోపం వచ్చి సేనాధిపతిని బంధిస్తాడు.రాజు మంత్రిని  చిలుకలు ఇలా మాట్లాడితున్నాయ్  అని అడిగాడు మంచి వాళ్ళ సావాసం ఎప్పుడూ మంచే నేర్పుతుంది అందుకే అన్నారు పెద్దలు సహవాసదోషం అని అంటారు.చెడు మాటలు చేతలు తొందరగా ఆకర్శితం అవుతాయి. కనుక మంచే నేర్చుకోవాలి.

Comments

Post a Comment

Popular posts from this blog

రైతు కథ..

ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు  డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి  తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా  ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి  దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా! ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా. కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా. మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల  లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి  ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా.     అనగనగా ఒక ఊర...

చిలుక జింక స్నేహం నీతి కథ (True Friendship Story in Telugu)

అనగనగా ఒక అందమైన అడవిలో ఓ చురుకైన చిలుక, ఒక అమాయక జింక ఉండేవి. ఆ ఇద్దరూ ఎంతో మంచి స్నేహితులు. ప్రతిరోజూ కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ, దూరంగా వెళ్లి తిండి వెతుక్కొని వచ్చేవి. ఒకరోజు చిలుకకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. “మనకు ప్రతిసారి తిండి కోసం తిరగాల్సి వస్తోంది. మనమే ఒక చిన్న తోట పెంచుకుంటే ఎలా ఉంటుంది?” అని జింకను అడిగింది. జింకకు ఆ ఆలోచన చాలా నచ్చింది. “అవును! మనమే పండ్లు పెంచుకుంటే ఎప్పుడైనా తినవచ్చు” అని ఆనందంగా చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రదేశాన్ని ఎంచుకుని గింజలు వేశారు. చిలుక ప్రతిరోజూ వచ్చి చూసేది కానీ పని మాత్రం చేయకుండా తప్పించుకునేది. జింక మాత్రం ఎంతో కష్టపడి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ, మొక్కలను జాగ్రత్తగా పెంచింది. కొన్ని రోజుల తర్వాత మొక్కలు పెద్దవై అందమైన పండ్లతో నిండిపోయాయి. అప్పుడు చిలుక వచ్చి, “ఇది మన ఇద్దరి తోట కదా! పండ్లు ఇద్దరం పంచుకుందాం” అని చెప్పింది. జింక కొంచెం కోపంగా నవ్వుతూ, “పని చేసేప్పుడు కనిపించలేదు, కానీ తినేప్పుడు మాత్రం వచ్చావు! స్నేహం అంటే మాటల్లో కాదు… పని చేసినప్పుడు కూడా కలిసి ఉండాలి” అని చెప్పింది. చిలుక తన తప్పు అర్థం చేసుకుంది. “ఇక మీదట...

ఐకమత్యమే మహాబలం.

ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ఆస్తిపరుడు. అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు, వారు అంత పిల్లపాపాలతో సుఖంగా జీవించేవారు.కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య ఆరోగ్యం చెడిపోయింది తన తర్వాత ఆస్తిని చూసుకోవడానికి తన కొడుకులకు అప్పజెప్పాలని అనుకుంటాడు. వారంతా ఎవరికి వారు నాకే దక్కాలని ప్రయత్నాలు చేసారు.ఈ ఆస్తి అంత ఒక్కదగ్గరే ఉండాలని దాన్ని ముక్కలు చేయవద్దు అని రాఘవయ్య భావించాడు.అలా కొడుకులకు చెప్పాడు అయినా వాళ్ళు వినలేదు.రాఘవయ్య కొడుకులకు బుద్ది చెప్పాలని ఒకరోజు కొడుకులకు నాలుగు కట్టెలు తెమ్మన్నాడు .అందరిని నిలబెట్టాడు, ఒక్కొక్కరిని ఆ కట్టెలు విరగగొట్టమన్నాడు.అందరూ విరిచేశారు.తర్వాత అందరి చేతుల నుండి కట్టెలు తీసుకొని ఒక కట్టలాగా కట్టాడు.దానిని విరవమన్నాడు,అందరూ ప్రయత్నించారు.ఒక్కరు కూడా విరవలేక పోయారు.అప్పుడు రాఘవయ్య చూసారా మీరు ఒక్కొక్కరుగా ఉంటే మీకు నష్టం కలుగుతుంది మిమ్మలను ఎవరు విడదీయగలుగుతారు,అదే మీరు ఉమ్మడిగా ఉంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అందుకే కలిసి ఉంటే కలదు సుఖం , ఐకమత్యమే మహాబలం .