Skip to main content

శ్రీనివాస కళ్యాణం

కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర  స్వామిని దర్శించడానికి భక్తులు దూర ప్రాంతాలనుండి ఎన్నో వ్యయ ప్రయాసలను ఓర్చుకొని వస్తారు. ఆనందనిలయంలో ఉన్న ఆ శ్రీనివాసుడి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించినంతనే ఎంతో ఆనందం కలుగుతుందని  అంటారు.ఇది నిజంగా  అనుభూతి చెందిన వారికే అనిపిస్తుంది.
ఈ రోజు మన కథ శ్రీ వెంకటేశ్వర స్వామి కథ ,ఎన్నో కథలు గాథలు ఉన్నాయి కానీ అందులో ఒకటి మీకోసం .
ఒకనాడు మహర్షులు అందరూ కలసి లోకకళ్యాణం కొరకు యజ్ఞం చేయాలని భావించారు ఆ యజ్ఞానికి ముఖ్య అతిథిగా త్రిమూర్తులలో ఒకరిని పిలవాలని అనుకున్నారు . ఎవరు గొప్ప అయితే వారిని పిలవాలని అనుకున్నారు.ఈ ఎవరు గొప్ప అని నిర్ణయం చేయవలసిందిగా బృగు మహర్షిని పంపారు.మొదట బృగు మహర్షి సత్య లోకానికి వెళ్ళారు అక్కడ బ్రహ్మ దేవుడు సరస్వతి మాత వీణ వాయిస్తుండగా అతను లీనమై పోయాడు. ఆశ్చర్యం అసలు బ్రహ్మ బృగు మహర్షి రాకను గమనించలేదు దానికి ఆ మహర్షి కోపంతో నీకు భూలోకంలో ఆలయాలు ఉండవని శపించాడు. బ్రహ్మ దేవుడు బాధ పడ్డాడు అందుకే బ్రహ్మ దేవుడికి గుడులు చాలా తక్కువ ఉంటాయి.
  కైలాసానికి బయలుదేరాడు ఈ సారి ఏం జరుగుతుందో చూద్దాం .కైలాసంలో శివపార్వతులు ఇద్దరూ నాట్యం చేస్తున్నారు వారితో పాటు గణపతి ,కుమారస్వామి ,నంది బృంగి ,రుద్ర గణాలు కూడా ఆ నాట్య ప్రదర్శనను ఆసక్తిగా చూస్తున్నారు.బృగు సహజంగానే కోపిష్టి దానికి తోడు అతనికి అరికాలులో ఒక కన్ను ఉంది అది అతనికి అదనపు శక్తి ఉంది కదా! అందుకే అహంకారంతో ఆగ్రహాన్ని ప్రదర్శించి నువ్వు లింగాకృతిలో తప్ప మానవ రూపంలో పూజలు అందుకోలేవు అని శపించాడు.
ఈ సారి విష్ణు వంతు వాళ్ళిద్దరూ అంటే ఊరుకున్నారు కానీ విష్ణువు అలా కాదు.
బృగు మహర్షి వచ్చాడు, విష్ణువు లక్ష్మీదేవి ఇద్దరూ చదరంగం ఆడుతున్నారు.క్రీడలో మునిగి ముచ్చట్లు పెట్టుకుంటున్న వారిని చూసి అప్పటికే కోపంతో వున్న భృగువు విష్ణువును కాలు ఎత్తి  వక్షస్థలంపైన తన్నాడు . వెంటనే కోపం తెచ్చుకోకుండా శ్రీహరి శాంతంగా క్షమాపణలు చెప్పి అతిధి మర్యాదలు చేస్తూ బృగు అరికాలులో వున్న కన్నును చిదిమి వేశాడు.అప్పుడు అతని అహంకారం పోయి శ్రీహరి కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరాడు మరల తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళాడు.
ఇదంతా చూసిన లక్ష్మీదేవి , నేను కొలువై ఉండే వక్షస్థలాన్ని  తన్నినా కూడా అతనిని శిక్షించకుండా  వదిలేశాడు అని బాధపడి కోపంతో వైకుంఠాన్ని వదిలి వెళ్ళిపోయింది. లక్ష్మీదేవి లేకపోవడంతో శ్రీహరి అడవుల పాలు అయ్యాడు ఆమెను వెతుకుతూ శ్రీనివాసుడిగా అవతారం ఎత్తి అడవులలో తిరుగుతూ తపస్సు చేయసాగాడు.అతని చుట్టూ పుట్టలాగా తయారు అయింది. శ్రీనివాసుడి  ఆకలి తీర్చడానికి కామధేనువు ప్రతిరోజు ఆ పుట్ట దగ్గరకు వచి పాలు ఇచ్చి వెళ్ళేది .కొందరు బాటసారులు ఆ పుట్టలో ఏమి ఉందో అనుకుని తవ్వడం మొదలుపెట్టారు ఆ గునపం శ్రీహరికి తాకింది అమ్మా అని అన డంతో అందరూ పారిపోయారు.అతడు తీవ్ర రక్తస్రావంతో నడుస్తూ వకులాదేవి  ఇంటిదగ్గర పడిపోయాడు ఆమె అతడిని ఆదరించి తన దగ్గర ఉంచుకుని కొడుకులా పెంచుకుంది. కొన్ని రోజుల తర్వాత పద్మావతి అమ్మవారు శ్రీహరిని కలలో కనుగొని అతడిని ప్రేమించసాగింది.అతడు కూడా ఆమెను నారాయణవనంలో చూసి ఇష్టపడ్డాడు.ఈ విషయాన్ని వకుళదేవికి చెప్పాడు శ్రీనివాసుడు ఆమె పద్మావతి అమ్మవారి తండ్రిగారైన ఆకాశ రాజు దగ్గరకు వెళ్ళి అడిగింది, ఆకాశరాజు నా కూతురిని ఇచ్చి పెళ్ళి చేయాలంటే ధనం కావాలి అన్నాడు .దానికోసం శ్రీహరి కుబేరుడి దగ్గర అప్పు చేసి వివాహం ఘనంగా చేసుకున్నాడు. చేసుకొని తిరుమల కొండపైన కొలువైఉన్నాడు.
అందుకే అంటారు పెద్దలు ఇంటి ఇల్లాలు లక్ష్మీదేవితో సమానం ఆమె కంట తడి పెడితే ఇంట్లో లక్ష్మీ నిలవదు సాక్షాత్తు శ్రీహరికి తప్పలేదు మనమెంత.







Comments

Popular posts from this blog

రైతు కథ..

ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు  డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి  తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా  ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి  దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా! ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా. కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా. మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల  లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి  ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా.     అనగనగా ఒక ఊర...

చిలుక జింక స్నేహం నీతి కథ (True Friendship Story in Telugu)

అనగనగా ఒక అందమైన అడవిలో ఓ చురుకైన చిలుక, ఒక అమాయక జింక ఉండేవి. ఆ ఇద్దరూ ఎంతో మంచి స్నేహితులు. ప్రతిరోజూ కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ, దూరంగా వెళ్లి తిండి వెతుక్కొని వచ్చేవి. ఒకరోజు చిలుకకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. “మనకు ప్రతిసారి తిండి కోసం తిరగాల్సి వస్తోంది. మనమే ఒక చిన్న తోట పెంచుకుంటే ఎలా ఉంటుంది?” అని జింకను అడిగింది. జింకకు ఆ ఆలోచన చాలా నచ్చింది. “అవును! మనమే పండ్లు పెంచుకుంటే ఎప్పుడైనా తినవచ్చు” అని ఆనందంగా చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రదేశాన్ని ఎంచుకుని గింజలు వేశారు. చిలుక ప్రతిరోజూ వచ్చి చూసేది కానీ పని మాత్రం చేయకుండా తప్పించుకునేది. జింక మాత్రం ఎంతో కష్టపడి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ, మొక్కలను జాగ్రత్తగా పెంచింది. కొన్ని రోజుల తర్వాత మొక్కలు పెద్దవై అందమైన పండ్లతో నిండిపోయాయి. అప్పుడు చిలుక వచ్చి, “ఇది మన ఇద్దరి తోట కదా! పండ్లు ఇద్దరం పంచుకుందాం” అని చెప్పింది. జింక కొంచెం కోపంగా నవ్వుతూ, “పని చేసేప్పుడు కనిపించలేదు, కానీ తినేప్పుడు మాత్రం వచ్చావు! స్నేహం అంటే మాటల్లో కాదు… పని చేసినప్పుడు కూడా కలిసి ఉండాలి” అని చెప్పింది. చిలుక తన తప్పు అర్థం చేసుకుంది. “ఇక మీదట...

ఐకమత్యమే మహాబలం.

ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ఆస్తిపరుడు. అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు, వారు అంత పిల్లపాపాలతో సుఖంగా జీవించేవారు.కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య ఆరోగ్యం చెడిపోయింది తన తర్వాత ఆస్తిని చూసుకోవడానికి తన కొడుకులకు అప్పజెప్పాలని అనుకుంటాడు. వారంతా ఎవరికి వారు నాకే దక్కాలని ప్రయత్నాలు చేసారు.ఈ ఆస్తి అంత ఒక్కదగ్గరే ఉండాలని దాన్ని ముక్కలు చేయవద్దు అని రాఘవయ్య భావించాడు.అలా కొడుకులకు చెప్పాడు అయినా వాళ్ళు వినలేదు.రాఘవయ్య కొడుకులకు బుద్ది చెప్పాలని ఒకరోజు కొడుకులకు నాలుగు కట్టెలు తెమ్మన్నాడు .అందరిని నిలబెట్టాడు, ఒక్కొక్కరిని ఆ కట్టెలు విరగగొట్టమన్నాడు.అందరూ విరిచేశారు.తర్వాత అందరి చేతుల నుండి కట్టెలు తీసుకొని ఒక కట్టలాగా కట్టాడు.దానిని విరవమన్నాడు,అందరూ ప్రయత్నించారు.ఒక్కరు కూడా విరవలేక పోయారు.అప్పుడు రాఘవయ్య చూసారా మీరు ఒక్కొక్కరుగా ఉంటే మీకు నష్టం కలుగుతుంది మిమ్మలను ఎవరు విడదీయగలుగుతారు,అదే మీరు ఉమ్మడిగా ఉంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అందుకే కలిసి ఉంటే కలదు సుఖం , ఐకమత్యమే మహాబలం .