Skip to main content

చిరు తొండనంబి కథ.

పరమ శివుని భక్తులు చాలా మంది ఉన్నారు అందులో అరవై మూడు మంది మహాభక్త మహాశయులచరిత్ర పెరియ పురాణము .ఈ కథ నేను చదివిన పెరియ పురాణం లోనిది చిరు తొండనంబి కథ.
కావేరినది ప్రవాహం ఒడ్డున తిరుచెంగట్టంగుడి అనే ఒక గ్రామం కలదు.ఆ గ్రామంలో మహామట్టిరార్ అను బ్రాహ్మణ వంశంలో పరంజ్యోతి (ఇతనికి చిరుతోండని పేరు) అను వాడుండెను.అతను ఆయుర్వేదం,సంస్కృతము,యుద్ధ విద్య ,అశ్వ,గజ శిక్షణలలో నిపుణుడు ఆయినప్పటికి సకల శాస్త్ర పరమార్థము శివుడే అని  అనుకోని శివుని పాద సేవకంటే ఏదీ ఎక్కువ కాదని  శివసేవకే అంకితమయ్యాడు.
  పరంజ్యోతి పల్లవ రాజు సేనాధిపతి,అతను చాలా సార్లు అనేక నగరాలపై దండయాత్ర చేసి , వాటిని నేల మట్టం చేసి అక్కడ కొల్ల గొట్టిన ధనాన్ని తెచ్చి రాజుకు ఇచ్చేవాడు. అతని బల పరాక్రమం చూసి మంత్రులు తలమీద చంద్రవంక పెట్టుకున్న శివుడిని పూజ చేయడం ద్వారా ఇతనికి చాలా పరాక్రమం ఉంది ఈయనను ఎదురించువారు ఈ లోకములో లేరు అని అన్నారు.ఆ మాటలు విన్న రాజు నేను ఒక శివ భక్తుడిని నా సేవ కోసం ఉపయోగం చేసుకుంటున్నా నా ఎంత పాపం తగులుతుంది నాకు అనుకోని నన్ను క్షమించు అని పరంజ్యోతిని వేడుకున్నాడు. నువ్వు నీ సొంత గ్రామానికి వెళ్లి శివ సేవ చేసుకో అన్నాడు రాజు ,నాకు ఏమి ఇబ్బంది లేదు నేను శివ సేవతో పాటు మీ సేవ కూడా చేస్తా అన్నాడు.వద్దు నేను కొంత డబ్బు నీకు ఇస్తా నీవు వేళ్ళు అని పంపించాడు.
  అలా అతను సొంత గ్రామానికి చేరుకున్నాడు అక్కడ అతనితో కలిసి శివారాధన చేసే మనస్తత్వం కలిగిన తిరు వెంకట్టు నంగి అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు.వారు ప్రతిరోజూ శివ భక్తులకు భోజనం పెట్టి  మాత్రమే  తినేవారు . అతను పెట్టె భోజనంలో అన్నం,బెల్లము,ఆరు రకాల వంటకాలు   నెయ్యి, పాలు , పెరుగు మొదలైన వాటితో వండిన వంటలు ఉండేవి.ఈ కారణం వల్ల వచ్చిన అతిధులు చాలా సంతోషంగా భోజనం చేసేవారు.
  కొన్ని రోజులకు వాళ్లకు ఒక కొడుకు జన్మించాడు.అతనికి సిరాలదేవుడు అని పేరు పెట్టారు గ్రామంలో ప్రజలు చాలా  సంతోషించారు.ఆ బాలుడికి చేయవలసిన పనులు అన్ని చేశారు.అతన్ని పాఠశాలకు పంపించారు.అలా గడిచిపోతుంది చిరుతోండని జీవితం.
   కైలాసనాథుడు చిరుతోండని భక్తిని లోకానికి  చాటి చెప్పాలని అనుకున్నాడు.తన వేషాన్నీ ఇలా మార్చుకున్నాడు ,గుండ్రంగా విభూతిని బొట్టు లాగా పెట్టి జుట్టును అంత వదిలి జంగముగా మారాడు.అతడు చిరుతోండని ఇంటికి వచ్చి బయటనుండే ఇలా అడిగాడు.భక్తులకు భోజనం పెట్టె చిరుతోండడు ఉన్నాడా అన్నాడు.ఈ రోజు అతిధులు ఎవరు రాలేదు వాళ్లనే వెతకడం కొరకు వెళ్ళాడు మీరు లోపలకు రండి అన్నది అతని భార్య.నేను కేవలం స్త్రీలు వుండే ఇంటికి రాను అన్నాడు.నేను గణపతి గుడిలో అత్థిచెట్టు కింద ఉంటాను చిరుతోండడు వచ్చాక నేను అతనిని కలవడానికి వచ్చాను అని చెప్పమని వెళ్ళిపోయాడు.
  ఇంతలో చిరుతోండడు ఇంటికి వచ్చాడు, తిరువెంగట్టా నంగ అతని దగ్గరకు వెళ్లి మన ఇంటికి ఒక అతిధి వచ్చాడు అతను గణపతి గుడిలో ఉంటానని చెప్పాడు అనగానే ,పొద్దున్న నుండి అతిధులను వెతుకుతూ అలసిపోయిన వాడికి ఒక్కసారిగా ఆనందంగా ఆహా!బ్రతికించాడు అని పరుగున వెళ్ళిపోయాడు.అక్కడ చెట్టుకింద కూర్చున్న జంగము దగ్గరకు వెళ్లి రండి బోజనానికి అన్నాడు.నేను రావాలంటే కొన్ని షరతులు ఉన్నాయి వాటికి ఒప్పుకుంటే నేను మీ ఇంటికి వస్తాను అన్నాడు.సరే అన్నాడు మహాత్ముల రాక వల్ల అసాధ్యాలు కూడా సుసాధ్యాలు అవుతాయి అన్నాడు.
  నేను ఆరు నెలలకు ఒకసారి భోజనం చేస్తాను అది కూడా నర మాంసము ,చిరుతోండడు వెంటనే నాకు మూడు రకాల పశువులు ఉన్నాయి చెప్పండి మీకోసం ఏమి వండాలో అన్నాడు .నాకు పశు మాంసము కాదు నర మాంసము కావాలి అది కూడా చిన్న గాయము లేనటువంటి అయిదేండ్ల బాలుడిది.వాడు కూడా వారి వంశంలో ఒక పుత్రుడై శుద్ధ బ్రహ్మచారి అయి ఉండాలి.తల్లి ఆ బాలుడిని పట్టుకొని ఉంటే తండ్రి ముక్కలు చేసి చంపాలి అన్నాడు.తల్లిదండ్రులు ఈ పనిని చాలా సంతోషంగా చేస్తే నేను ఆ ఇంట్లో భోజనం చేస్తాను అన్నాడు.సరే అన్నాడు చిరుతోండడు, నువ్వు ఒక్కడివే కాదు నీ భార్య కూడా సరే అనాలి అన్నాడు వెంటనే ఇంటికి వచ్చి ఆమెను అడిగాడు ఆమె కూడా శివ సేవకు కదా అని సరే అన్నది.
  అతడు సిరాలదేవుని పాఠశాలకు వెళ్లి అతనిని తొలుకొని వచ్చాడు.స్నానం చూపించారు చివరగా అతడిని గట్టిగా కౌగిలించుకుని బాధపడ్డారు.ఇంత చిన్న బాలుడికి ఇంత పరీక్ష నా ఎలా అనుకుని మెల్లిగా వంటశాలకు తీసుకెళ్లారు.మనసు నిగ్రహం చేసుకొని బాలుడిని ముక్కలు చేశారు తలకాయ తింటాడో లేదో జంగముడు అని అనుకోని దానిని చందన అనే పని మనిషికి ఇచ్చి దాచి పెట్టమన్నాడు.మిగిలిన బాగములతో వంట చేశారు.జంగముడిని భోజనానికి పిలిచారు ఆయన రాగానే కాళ్ళు కడిగి అతిథి మర్యాదలు చేసి ఆహ్వానించారు. బోజనాలను వడ్డన చేశారు అతడు అన్ని వండినారా!అని అడిగాడు ఒక తలకాయ తప్ప అన్ని భాగాలు వండినాము స్వామి అని చెప్పింది చిరుతోండని  భార్య , అది కూడా వండితే నేను తింటా అన్నాడు జంగముడు . దాసీకి ఇచ్చిన తలకాయను ఆమె ముందే వండి పెట్టింది తీసుకొచ్చి అతనికి వడ్డించింది.
  జంగముడు నువ్వు కూడా రా భోజనానికి అన్నాడు సరే అతిధి మర్యాద అని కూర్చున్నాడు చిరుతోండడు. నీ కుమారుడిని కూడా పిలువు అన్నాడు ఆ యోగి   భార్య భర్తలు  ఒకరి మొఖం ఒకరు చూసుకుంటూ వున్నారు .అది గమనించి జంగముడు వెళ్లి పిలవండి అని అన్నాడు.పెరడు దగ్గరకు వెళ్లి కుమారా సిరాల అన్నారు అంతే ఆ పిల్లాడు అప్పుడే పాఠశాల నుండి వచ్చాడు ,ఆశ్చర్యం పొందారువాళ్ళు .వచ్చి చూసే సరికి జంగముడు మాయమయ్యాడు.ఆ పరమశివుడే నన్ను పరీక్షించడానికి వచ్చాడా అని సంబరపడ్డాడు. తర్వాత శివుడు చిరుతోందని,అతని భార్యను,కొడుకును,దాసి చందనను శివలోకానికి తీసుకొని వెళ్ళాడు.







Comments

Post a Comment

Popular posts from this blog

రైతు కథ..

ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు  డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి  తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా  ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి  దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా! ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా. కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా. మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల  లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి  ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా.     అనగనగా ఒక ఊర...

చిలుక జింక స్నేహం నీతి కథ (True Friendship Story in Telugu)

అనగనగా ఒక అందమైన అడవిలో ఓ చురుకైన చిలుక, ఒక అమాయక జింక ఉండేవి. ఆ ఇద్దరూ ఎంతో మంచి స్నేహితులు. ప్రతిరోజూ కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ, దూరంగా వెళ్లి తిండి వెతుక్కొని వచ్చేవి. ఒకరోజు చిలుకకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. “మనకు ప్రతిసారి తిండి కోసం తిరగాల్సి వస్తోంది. మనమే ఒక చిన్న తోట పెంచుకుంటే ఎలా ఉంటుంది?” అని జింకను అడిగింది. జింకకు ఆ ఆలోచన చాలా నచ్చింది. “అవును! మనమే పండ్లు పెంచుకుంటే ఎప్పుడైనా తినవచ్చు” అని ఆనందంగా చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రదేశాన్ని ఎంచుకుని గింజలు వేశారు. చిలుక ప్రతిరోజూ వచ్చి చూసేది కానీ పని మాత్రం చేయకుండా తప్పించుకునేది. జింక మాత్రం ఎంతో కష్టపడి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ, మొక్కలను జాగ్రత్తగా పెంచింది. కొన్ని రోజుల తర్వాత మొక్కలు పెద్దవై అందమైన పండ్లతో నిండిపోయాయి. అప్పుడు చిలుక వచ్చి, “ఇది మన ఇద్దరి తోట కదా! పండ్లు ఇద్దరం పంచుకుందాం” అని చెప్పింది. జింక కొంచెం కోపంగా నవ్వుతూ, “పని చేసేప్పుడు కనిపించలేదు, కానీ తినేప్పుడు మాత్రం వచ్చావు! స్నేహం అంటే మాటల్లో కాదు… పని చేసినప్పుడు కూడా కలిసి ఉండాలి” అని చెప్పింది. చిలుక తన తప్పు అర్థం చేసుకుంది. “ఇక మీదట...

ఐకమత్యమే మహాబలం.

ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ఆస్తిపరుడు. అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు, వారు అంత పిల్లపాపాలతో సుఖంగా జీవించేవారు.కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య ఆరోగ్యం చెడిపోయింది తన తర్వాత ఆస్తిని చూసుకోవడానికి తన కొడుకులకు అప్పజెప్పాలని అనుకుంటాడు. వారంతా ఎవరికి వారు నాకే దక్కాలని ప్రయత్నాలు చేసారు.ఈ ఆస్తి అంత ఒక్కదగ్గరే ఉండాలని దాన్ని ముక్కలు చేయవద్దు అని రాఘవయ్య భావించాడు.అలా కొడుకులకు చెప్పాడు అయినా వాళ్ళు వినలేదు.రాఘవయ్య కొడుకులకు బుద్ది చెప్పాలని ఒకరోజు కొడుకులకు నాలుగు కట్టెలు తెమ్మన్నాడు .అందరిని నిలబెట్టాడు, ఒక్కొక్కరిని ఆ కట్టెలు విరగగొట్టమన్నాడు.అందరూ విరిచేశారు.తర్వాత అందరి చేతుల నుండి కట్టెలు తీసుకొని ఒక కట్టలాగా కట్టాడు.దానిని విరవమన్నాడు,అందరూ ప్రయత్నించారు.ఒక్కరు కూడా విరవలేక పోయారు.అప్పుడు రాఘవయ్య చూసారా మీరు ఒక్కొక్కరుగా ఉంటే మీకు నష్టం కలుగుతుంది మిమ్మలను ఎవరు విడదీయగలుగుతారు,అదే మీరు ఉమ్మడిగా ఉంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అందుకే కలిసి ఉంటే కలదు సుఖం , ఐకమత్యమే మహాబలం .