nala damayanthi story in telugu(Mahabharatham stories)

మీకు ముందే చెప్పాను కదా , మహాభారతంలో కథలు చాలా బాగుంటాయి అవి మన నిజ జీవితానికి దగ్గరగా ఉంటాయి .ఇది ఒక  అందమైన ప్రేమకథ .చాలా ప్రేమకథలు తెలుసు కానీ ఎన్నో ట్విస్టులు వున్న కథ ఇది.
అయిపోయింది అనుకున్నప్పుడే మళ్ళీ మలుపు వుంటుంది అందుకే ఈ కథ ప్రేక్షకులు చదువుతున్నంత సేపు ఏం జరుగుతుందో అన్న ఆసక్తి  కలుగుతుంది.జీవితంలో ఎన్నో కష్టాలను ఓర్చుకొని  ప్రేమను గెలిపించుకున్న  నల దమయంతుల ప్రేమకథ.
అనగనగా నిషధ దేశాన్ని వీరసేనుడు   అనే రాజు   పాలిస్తుండేవాడు అతనికి నలుడు  , పుష్కరుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. నలుడు  ధర్మపరుడు , సత్యవంతుడు, ప్రజలకు ఎంతో ఇష్టమైనవాడు .  తండ్రి  వీరసేనుడుకు కూడా నలుడు అంటే ఇష్టం వల్ల అతన్ని రాజుగా ప్రకటించాడు నలుడు రాజు అవ్వడం పుష్కరుడికి ఇష్టం లేదు.
ఇదిలా ఉండగా విదర్భ దేశాన్ని భీముడు అనే రాజు పాలిస్తున్నాడు. అతనికి సంతానం లేదు,అతనికి ధమనుడు అనే ముని ఇచ్చిన వరం వలన దమయంతి అనే కూతురు దముడు ,ధమనుడు,దంతుడు అనే కుమారులు కలిగారు.
   దమయంతి అపూర్వ సౌందర్యం, వినయం కలిగినది . ఈ విషయం నలుడు   హంస ద్వారా తెలుసుకున్నాడు దమయంతి కూడా నలుడు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంది.ఒకరికొకరు చూసుకోకుండానే ప్రేమించుకున్నారు.
ఒక రోజు ఒక హంస నలుడి వద్దకు వచ్చి దమయంతి గుణగణాలను చెప్పింది. అదే హంస దమయంతి వద్దకు వెళ్లి నలుడి గొప్పతనాన్ని వివరించింది.వారి ప్రేమ మరింత పెరిగింది ఎలాగైనా దమయంతిని చేసుకోవాలి అని నలుడు ,నలుడే భర్తగా రావాలని దమయంతి మనసులో అనుకున్నారు. ఆ
కొన్ని రోజుల తర్వాత దమయంతి స్వయంవరం ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న    ఇంద్రుడు, దిక్పాలకులు  కూడా ఆమెను పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డారు. వారు నలుడిని తమ దూతగా పంపి, “దమయంతికి మా గురించి చెప్పు” అని అన్నారు. నలుడు నిజాయితీగా దమయంతికి దేవతల సందేశం చెప్పాడు. దమయంతి నిన్ను తప్ప మరొకరిని వివాహం చేసుకొను అని చెప్పింది.అదే విషయాన్ని వెళ్ళి దేవతలకు చెప్పాడు నలుడు . వారికి కోపం వచ్చింది.స్వయంవరానికి కలి కూడా బయలుదేరాడు ,  కానీ ఇంద్రుడు దమయంతికి పెళ్ళి అయిపోయింది అని చెప్పగానేకోపం వచ్చింది.
స్వయంవర సమయంలో  ఇంద్రుడు,దిక్పాలకులు  నలుడి రూపంలోనే వచ్చారు . ఒక్కరు కాదు ఇద్దరు కాదు అయిదుగురు నలులను చూసి అయోమయంలో పడినా, తన భక్తి, తెలివితో నిజమైన నలుడిని గుర్తించింది—ఎందుకంటే దేవతలకు చెమట ఉండదు, కళ్లను మూయరు, పూలమాలలు ఎండిపోవు. ఈ లక్షణాల ద్వారా ఆమె నిజమైన నలుడిని గుర్తించి అతనిని పెళ్లి చేసుకుంది.దేవతలు అంతా వారికి శుభాకాంక్షలు చెప్పి ఘనంగా వివాహం జరిపించారు.దమయంతి నలుడిని వివాహం చేసుకోవడం కలికి ఇష్టం లేదు ఎలాగైనా వారిని విడగొట్టాలి ,నేను దమయంతిని చేసుకోవాలి అనుకున్నాడు .
వారి జీవితం సంతోషంగా సాగుతుండగా, కలి అనే దుష్టశక్తి నలుడిపై కోపంతో ఎక్కడ దొరుకుతుందా అని వేచి చూస్తున్నాడు.నలుడు ధర్మ ప్రవర్తన కలిగి ఉంటాడు  కానీ ఒకరోజు మూత్ర విసర్జన చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వచ్చాడు దీనిని ఆసరాగా తీసుకొని కలి  అతనిలోకి ప్రవేశం చేశాడు.   పుష్కరుడు అదను చూసి జూదంలో ఓడించి రాజ్యాన్ని గెలవాలని అనుకున్నాడు , అలాగే చెడు ప్రభావం చేత పుష్కరుడు ఆహ్వానించిన జూదానికి  నలుడు ఒప్పుకున్నాడు. పాచికల ఆటలో అతడు సంపద,రాజ్యం పోగొట్టుకున్నాడు.కట్టుబట్టలతో రాజ్యాన్ని విడిచి వెళ్ళాడు. పిల్లలను దమయంతి వాళ్ళ తల్లిగారింటికి పంపింది. 
దమయంతితో కలిసి
అడవిలో ఎన్నో కష్టాలు ఎదుర్కున్నారు. ఒకసారి నలుడు బాధతో దమయంతిని విడిచి వెళ్లిపోయాడు. నలుడు వెళ్తుండగా "నల రక్షించు" అనే మాటలు వినపడినవి  , అటుగా వెళ్ళి చూస్తే ఒక పాము అగ్నిలో దహనం అవుతుంది వెంటనే నలుడు ఆ పామును కాపాడాడు .ఆ పాము తనను కర్కోటకుడు అనే నాగుల రాజుగా పరిచయం చేసుకున్నాడు . కర్కోటకుడు నలుడిని కాటువేశాడు అతడు అందవికారంగా మారిపోయాడు.కర్కోటకుడు నీకు ఇప్పుడు ఈ రూపం నిన్ను దాచిపెట్టడానికి ఉపయోగపడుతుంది. నేను నీకొక మాయా వస్త్రం ఇస్తాను ఇది ధరించినంతనే నీ నిజ రూపం నీకు వస్తుంది అంటాడు.
నలుడు అనేక కష్టాలు అనుభవించి, బాహుకుడు అనే పేరుతో అయోధ్య రాజు ఋతుపర్ణుడి దగ్గర  రథసారథిగా,వంటవాడిగా పని చేశాడు. అక్కడ అతను కళలు, జ్ఞానం మరింత నేర్చుకున్నాడు. 
ఇంకా దమయంతి  నలుడిని వెతికింది తనను వదిలి వెళ్ళాడని బాధ పడింది.అలా అడవినుండి వెతుకుతూ వెతుకుతూ తన తండ్రి రాజ్యాన్ని చేరింది.  నలుడిని   ఎవరైనా వెతికి తెస్తే బహుమతి ఇస్తా అని ప్రకటించింది. వార్తహరుల ద్వారా అయోధ్య రాజు ఋతుపర్ణుడి దగ్గర బహుకుడుగా ఉన్నాడని తెలుసుకున్నారు. దమయంతి తెలివిగా తనకు రెండవ సారి స్వయంవరం జరుగుతుందని చాటింపు వేయించింది.విషయం తెలుసుకున్న నలుడు వచ్చి ఆమెను కలుసుకున్నాడు . నలుడు తన తప్పును గ్రహించి, మళ్లీ ధైర్యంగా ఋతుపర్ణుడి సహాయంతో  నిలబడి జూదంలో పుష్కరుడిని ఓడించి రాజ్యాన్ని తిరిగి గెలుచుకున్నాడు.
ఇద్దరూ మళ్లీ కలసి సుఖశాంతులతో జీవించారు.
ధైర్యం, నిజాయితీ, ప్రేమ ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా చివరికి విజయం సాధించవచ్చు.

Comments

  1. pure love and efforts never miss definitely achive theire love

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

రామచిలుక కథ

ఐకమత్యమే మహాబలం.

అంతా మన మంచికే...