Posts

Showing posts with the label చిన్న కథలు

💙 Happy Father's Day💙

Image
అందరికీ Happy Father's Day — తండ్రులందరికీ, అలాగే త్వరలో తండ్రులు కాబోయే వారికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరి జీవితంలో తండ్రి పాత్ర ఎంతో గొప్పది. చిన్నప్పుడు నాన్న దగ్గరకు వెళ్లాలంటే కూడా భయపడేదాన్ని. కానీ కాలం మారే కొద్దీ నాన్న కూడా ఒక మంచి స్నేహితుడిలా మారిపోయాడు. మనతో ఉన్నప్పుడు వారి విలువ పూర్తిగా అర్థం కాదు. కానీ వారిని కోల్పోయిన తర్వాతే వారి ప్రేమ, త్యాగం, ఆప్యాయత ఎంత గొప్పవో తెలుస్తుంది తండ్రి ప్రేమ – ఒక చిన్న కథ అనగనగా ఒక ఊరిలో సాంబశివరావు, పార్వతమ్మ అనే దంపతులు ఉండేవారు. వారికి ప్రసాద్ అనే ఒకే ఒక్క కుమారుడు. ఒక్కడే కొడుకు కావడంతో ఎంతో ప్రేమగా పెంచారు. అతన్ని ఉన్నత విద్యావంతుడిని చేయాలని అహర్నిశలు కష్టపడ్డారు. వారి కష్టానికి ఫలితంగా ప్రసాద్ చదువులో ఎప్పుడూ ముందుండేవాడు. ఉపాధ్యాయుల సూచనతో అతన్ని పట్టణానికి తీసుకెళ్లి చదివించారు. తల్లిదండ్రులు చిన్న చిన్న పనులు చేస్తూ కష్టాలు పడినా, కొడుకు భవిష్యత్తు కోసం ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. కాలం గడిచింది. ప్రసాద్ చదువు పూర్తి చేసి ఒక పెద్ద సంస్థలో ఉద్యోగం సంపాదించాడు. అక్కడే ఉమ అనే అమ్మాయిని ప్రేమించి, తల్లిదం...