Skip to main content

సజ్జన సాంగత్యం

అది వర్షాకాలం గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కురు దేశంలో వున్నాడు .వర్షాల కారణంగా ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్లడం కష్టం కాబట్టి ఆ నాలుగు నెలలు అక్కడే వున్నారు.ఒకరోజు ఆనందుడు బిక్షాటనకు బయలుదేరాడు .అతను అనుకోకుండా అవంతిక అనే వేశ్య ఇంటికి బిక్షకు వెళ్ళాడు.ఆమె అతనికి భిక్ష వేసి వర్షాల కారణంగా మీరు ఇబ్బంది పడుతున్నారని విన్నాను మీకు అభ్యంతరం లేకపోతే మీరు నా ఇంట్లో ఉండొచ్చు అంది . దానికి ఆనందుడు బిక్షువులు ఎక్కడ ఉండాలో తధగతుడు నిర్ణయిస్తాడు అని వారిని అడిగి చెబుతానన్నాడు.అది విన్న బుద్దుడు ఆమెనే ఆహ్వానించినపుడు నువ్వు ఆ ఇంట్లో విడది  చేయడంలో తప్పులేదు నువ్వు అక్కడికి మకాం మార్చుకో అన్నాడు.
  అలా ఆనందుడు వేశ్య ఇంటికి వెళ్ళాడు.అవంతిక చక్కటి అతిధి మర్యాదలతో స్వాగతం పలికి ఆహ్వానించింది.అతనికి చినిగిపోయిన బట్టలు చూసి కొత్తవి కుట్టించింది.ఆనందుడికి చలి నుండి రక్షణ కలిగింది.అవంతిక వేళకు అతనికి వేడి వేడి భోజనం అందిస్తూ ఆనందుడు చెప్పే హితోక్తులు శ్రద్ధగా వినేది. ఆ మాటల ప్రభావం చేత అవంతిక కొద్దిరోజుల్లోనే అతడి శిష్యురాలు అయింది .అయితే ఒక బిక్షువు వేశ్య ఇంట్లో ఉండడం తోటివారికి నచ్చలేదు.ఈ విషయం గురించి బుద్ధుడిని అడిగారు శిష్యులు , అతను మూడు రోజుల తర్వాత సమాధానం చెప్తా అన్నాడు.నాలుగోరోజు  ఉదయాన ఆనందుడు కాషాయ వస్త్రాలు ధరించిన ఒక యువతితో ఆశ్రమానికి వచ్చాడు ఆమె మరెవరో కాదు అవంతిక అనే వేశ్య .రాగానే బుద్ధుని పాదాలను నమస్కరించింది .ఆ దృశ్యం చూసిన శిష్యులకు నోట మాట రాలేదు.. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము అని కాకుండా మన మనస్సును ఎల్లవేళలా  నిర్మలమైన ఆలోచనలు కలిగి ఉండాలి .మంచి మనుషుల సాంగత్యం మనుషులను మంచి వైపే ప్రేరేపిస్తుంది.అనుమానం లేకుండా ఆనందుడు వెళ్ళాడు,ఆమె వేరే చేడు ఆలోచన చేయకుండా అన్ని నేర్చుకుంది .నిజమైన భక్తికి విశ్వాసానికి అవంతిక ఒక ఉదాహరణ.




 

Comments

Popular posts from this blog

రైతు కథ..

ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు  డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి  తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా  ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి  దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా! ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా. కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా. మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల  లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి  ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా.     అనగనగా ఒక ఊర...

చిలుక జింక స్నేహం నీతి కథ (True Friendship Story in Telugu)

అనగనగా ఒక అందమైన అడవిలో ఓ చురుకైన చిలుక, ఒక అమాయక జింక ఉండేవి. ఆ ఇద్దరూ ఎంతో మంచి స్నేహితులు. ప్రతిరోజూ కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ, దూరంగా వెళ్లి తిండి వెతుక్కొని వచ్చేవి. ఒకరోజు చిలుకకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. “మనకు ప్రతిసారి తిండి కోసం తిరగాల్సి వస్తోంది. మనమే ఒక చిన్న తోట పెంచుకుంటే ఎలా ఉంటుంది?” అని జింకను అడిగింది. జింకకు ఆ ఆలోచన చాలా నచ్చింది. “అవును! మనమే పండ్లు పెంచుకుంటే ఎప్పుడైనా తినవచ్చు” అని ఆనందంగా చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రదేశాన్ని ఎంచుకుని గింజలు వేశారు. చిలుక ప్రతిరోజూ వచ్చి చూసేది కానీ పని మాత్రం చేయకుండా తప్పించుకునేది. జింక మాత్రం ఎంతో కష్టపడి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ, మొక్కలను జాగ్రత్తగా పెంచింది. కొన్ని రోజుల తర్వాత మొక్కలు పెద్దవై అందమైన పండ్లతో నిండిపోయాయి. అప్పుడు చిలుక వచ్చి, “ఇది మన ఇద్దరి తోట కదా! పండ్లు ఇద్దరం పంచుకుందాం” అని చెప్పింది. జింక కొంచెం కోపంగా నవ్వుతూ, “పని చేసేప్పుడు కనిపించలేదు, కానీ తినేప్పుడు మాత్రం వచ్చావు! స్నేహం అంటే మాటల్లో కాదు… పని చేసినప్పుడు కూడా కలిసి ఉండాలి” అని చెప్పింది. చిలుక తన తప్పు అర్థం చేసుకుంది. “ఇక మీదట...

ఐకమత్యమే మహాబలం.

ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ఆస్తిపరుడు. అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు, వారు అంత పిల్లపాపాలతో సుఖంగా జీవించేవారు.కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య ఆరోగ్యం చెడిపోయింది తన తర్వాత ఆస్తిని చూసుకోవడానికి తన కొడుకులకు అప్పజెప్పాలని అనుకుంటాడు. వారంతా ఎవరికి వారు నాకే దక్కాలని ప్రయత్నాలు చేసారు.ఈ ఆస్తి అంత ఒక్కదగ్గరే ఉండాలని దాన్ని ముక్కలు చేయవద్దు అని రాఘవయ్య భావించాడు.అలా కొడుకులకు చెప్పాడు అయినా వాళ్ళు వినలేదు.రాఘవయ్య కొడుకులకు బుద్ది చెప్పాలని ఒకరోజు కొడుకులకు నాలుగు కట్టెలు తెమ్మన్నాడు .అందరిని నిలబెట్టాడు, ఒక్కొక్కరిని ఆ కట్టెలు విరగగొట్టమన్నాడు.అందరూ విరిచేశారు.తర్వాత అందరి చేతుల నుండి కట్టెలు తీసుకొని ఒక కట్టలాగా కట్టాడు.దానిని విరవమన్నాడు,అందరూ ప్రయత్నించారు.ఒక్కరు కూడా విరవలేక పోయారు.అప్పుడు రాఘవయ్య చూసారా మీరు ఒక్కొక్కరుగా ఉంటే మీకు నష్టం కలుగుతుంది మిమ్మలను ఎవరు విడదీయగలుగుతారు,అదే మీరు ఉమ్మడిగా ఉంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అందుకే కలిసి ఉంటే కలదు సుఖం , ఐకమత్యమే మహాబలం .