పీత-కొంగ కథ .🦀🦢.

ఈ రోజు పంచతంత్రం కథలలో పీత-కొంగ  కథ తెలుసుకుందాం. అనగనగా ఒక కొలను ఆ కొలనులో ఒక పీత నివాసం ఉంటుంది. ఒకసారి ఆ కొలను దగ్గరకు ఒక కొంగ వచ్చింది.అది ఆ కొలనులో దిగి ఒంటి కాలు మీద తపస్సు చేస్తున్నట్టు నటించుతుంది రోజు ! అది రోజూ పీత, కొలనులో చేపలు చూస్తున్నాయి.అయితే ఆ చేపలు కానీ పీత కానీ కొంగది దొంగ జపం అని గుర్తించ లేకపోయినాయి.ఒకరోజు పీత కొంగ దగ్గరకు వచ్చి మహాత్మా! ఇక్కడ ఇన్ని చేపలు మీ కళ్ళ ముందు తిరుగుతున్న కూడా మీరు వాటిని పట్టి తినకుండా ఇలా జపం చేసుకుంటున్నారు దీనికి కారణం ఏమిటి అన్నది.
అప్పుడు ఆ కొంగ మరింత ధ్యానంలో ఉన్నట్టు నటించింది.కొంగగారు మిమ్మల్ని నేను అడుగుతున్న అయిన సమాధానం చెప్పడం లేదు కారణం ఏమైనా ఉందా అని అడిగింది మళ్లి పీత.
కొంగ మెల్లిగా కళ్ళు తెరిచి మీరు భక్తి శ్రద్ధలతో అడిగారు కాబట్టి చెబుతున్న విను,నువ్వు చెప్పినట్టు ఆ మధ్యదాక  నేను కూడా చేపలనే కాదు భగవంతుడు మాకు ఇచ్చిన నేను తినదగిన అన్ని జంతువులను తినేవాడిని.ఆ మధ్య కాలంలో నేను నివసించే చెట్టు కిందకు ఒక యోగి వచ్చాడు.ఆయనతో చాలా మంది శిష్యులు కూడా ఉన్నారు.ఆ శిష్యులకు ఉపదేశం చేసేటపుడు నేను ఆ చెట్టు పైన వున్నాను ,ఆయన ఇలా చెప్పాడు  భక్తులారా! మన బ్రతుకులు నీటి బుడగ లాంటివి అవి ఏ ఘడియలో అయినా చివరికి పోవచ్చు అందువలన మనం బ్రతికుండగానే చేయవలసిన పుణ్య కార్యాలు, దాన ధర్మాలు  చేయాలి.దైవ ప్రార్థనలు చేసి ముక్తి పొందాలి.అహింసయే పరమో ధర్మహా . మన  ఆకలిని అంతం చేసుకోవడానికి హింస చేయరాదు. అని చెప్పాడు.
అది విన్న నేను ఆ నిముషం నుండి బార్యాబిడ్డలను వదిలి పెట్టాను. బంధుమిత్రులను గురుంచి పట్టించుకోలేదు . ఇంకొక విషయం నేను వుండే ఇంటిని కూడా వదిలేశాను. స్నానం ధ్యానం చేయడానికి ఇక్కడ వీలు ఉంటుందని తలచి ఇక్కడికి వచ్చాను.మళ్ళీ ఒంటి కాలు మీద నిలబడి  తపస్సు ప్రారంభించింది.కొంగ చెప్పిన మాటలు పీతతో పాటు చేపలు విన్నాయి, వినడం మాత్రమే కాదు రోజు అవి బయటకు వచ్చి కొంగను మెచ్చుకుంటూ అవి కూడా ధ్యానం చేయడం మొదలు పెట్టాయి.కొంగ చెప్పే వేదాంత ఉపన్యాసాలు వింటున్నాయి ప్రతిరోజూ.
నాలుగు రోజులు పోయాక ఎప్పటిలాగే చేపలు, పీతలు  కొంగ దగ్గరకు వచ్చాయి.అవి రావడం దూరం నుండే గమనించిన కొంగ ఏడుస్తుంది, కన్నీళ్లు ధారగా పడుతున్నాయి.ఏమైంది? కొంగ గారు  ఏడుస్తున్నారా? ఎందుకు అని ఆడిగాయి.
 ఈ కొలనులో స్నానం చేసి ఒడ్డుకు వచ్చి తపస్సు చేస్తున్నాను , అప్పుడే  అక్కడికి వచ్చిన బెస్తవాళ్లు ఇలా అంటున్నారు.ఈ వేసవి కాలంలో ఇక్కడ కొలను ఎండిపోతుంది ఇక్కడ ఉన్న చేపలన్ని పట్టి తీసుకొని పోవచ్చు అని అనుకున్నారు .పొరుగు వూరు వెళ్లిన పోయిన ఖర్మం తప్పులేదని నేను అన్ని త్యజించి ఇక్కడికి వస్తే ఇక్కడ వాళ్ళ మాటలు విన్న  ,అని బాధపడింది.కొంగ నాటకం కన్నా ఎక్కువ చేపలు బాధ పడుతున్నాయి.ఆ బెస్తవాళ్లు మమ్మల్ని పట్టి తీసుకొని పోతారేమో అని భయపడసాగాయి.
కొంగ మన కోసం బాధ పడుతుంది అని దాని మంచితనాన్ని మెచ్చుకున్నాయి.కొంగ కుట్ర పాపం చేపలకు పీతకు తెలియదు కదా! మీరే మాకు పెద్ద దిక్కు దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దలు ఊరికే అనలేదు,ముందు జాగ్రత్త మంచిది. అన్నింటా అశ్రద్ధ పనికి రాదు మనకు మంచి స్నేహం ఉంది .నువ్వు దైవభక్తుడివి మాకు ఏదైనా ఉపాయం చెప్పి మా ప్రాణాలు రక్షించండి అని వేడుకున్నాయి ఆ చేపలు పీత.సరే ఆలోచిద్దాం అన్నది కొంగ.
  కొంతసేపటికి ఇక్కడికి కొద్ది దూరంలో నిత్య జలాశయం ఉంది అక్కడ నీరు ఇంకి పోవడం కానీ ఎండిపోవడం కానీ ఉండదు . మీ అందరినీ అక్కడికి చేరుస్తాను అక్కడ మీరు పిల్లలతో సంతోషంగా ఉండొచ్చు.మీరు ఒప్పుకుంటే అని అడిగింది కొంగ.
చేపలు అంగీకరించాయి.ప్రతిరోజూ మూడు చేపలను నోట కరుచుకుని వెల్లసాగింది. కొంగ అక్కడికి దూరాన ఉన్న పెద్ద కొండ పై భాగాన చేరి నోటా కరుచుకుని వచ్చిన చేపలను తినేసి మళ్ళీ చేపలు ఉన్న చోటుకి వచ్చేది.
మిగతా చేపలు అవన్నీ సురక్షితంగా ఉన్నాయి మేము ఎప్పుడు బయటపడుతామో అని అనుకుంటూ ఉండేవి.పాపం వాటికి తెలియదు కదా ఆ చేపలు అన్ని చచ్చిపోయాయి అని.రోజు కొని చేపలను తీసుకెళ్లడం,తినడం, తిరిగిరావడం నిరాటంకంగా జరుగుతుంది.కొన్ని రోజుల వ్యవధిలోనే కొలనులో చేపలు అన్ని ఐపోయాయి.
ఒక్క పీత మాత్రమే మిగిలింది నేనె కదా నీకు మొదటి స్నేహితుడను అందరూ వెళ్లి పోయారు నేను ఒక్కదాన్నే వున్నాను. నన్ను కూడా ఆ జలాశయంకి చేర్చు అని అన్నది.అయ్యో ఎంతమాట అన్నావు పీత, నిన్నెందుకు వదిలేస్తా ఇంకా నువ్వే మిగిలాము , పొద్దున్నే  బయలుదేరుదాము.
పొద్దున్న కొంగ పీతను ముక్కుకు కరుచుకుని బయలుదేరింది .ఆకాశ మార్గాన వెళుతుంటే అన్ని ఇల్లు గుట్టలే కనిపించాయి నీరు ఎక్కడా కనబడుటలేదు .పీతకు అనుమానం మొదలయింది ఇది ఏదో ఎత్తుగడతో చేసింది మమ్మల్ని తినడానికి దొంగజపం చేసింది .అంతేకదా నమ్మకం మీద విషం తాగించవచ్చు ,అపనమ్మకం మీద నీరు కూడా త్రాగించలేము అనుకుంది.
కొంతసేపటికి నేను నీ నోటి నుండి జారీ పోతున్నట్టు అనిపిస్తుంది అక్కడ కొండ మీద ఒక్కసారి ఆగు నేను నీ రెక్కలు పట్టుకొని  పైకి ఎక్కుతా అన్నది ,సరే లే అని ఆగింది కొండ మీద అన్ని చేపల అస్థికలు చూసి ఇక్కడ నేను అనుకున్నదే జరుగుతుంది అని వెంటనే కొంగ మెడ గట్టిగా కొరికింది దాంతో అది చనిపోయింది.పీత వెంటనే పక్కన ఉన్న కలుగులోనికి వెళ్ళింది.
ఒక్కొక్కసారి కొందరు చాలా నమ్మకంగా మనను నమ్మిస్తారు.వారు చేసే మోసం పెద్ద ఎత్తుగడతో కూడినది అయి ఉంటుంది.కాబట్టి ఎదుటి వాళ్ళు ఇది చెప్పిన అంత తేలికగా నమ్మవద్దు .ఒకటికి పదిసార్లు ఆలోచించి మన స్వంత నిర్ణయాలు తీసుకోవాలి.








Comments

Popular posts from this blog

రామచిలుక కథ

చిన్న చేప కథ

అంతా మన మంచికే...