ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా!
ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా.కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు.అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా.
మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా.
అనగనగా ఒక ఊరిలో కృష్ణయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి 3 ఎకరాల పొలం ఉంది కృష్ణయ్య పెద్దగా చదువుకోలేదు.అతనికి ఒక సోదరుడు హనుమయ్య ఒక సోదరి రాజమ్మ వున్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు అప్పుల బాధలు పడలేక ఆత్మహత్య చేసుకుని మరణించారు.అప్పటినుండి కృష్ణయ్యనే తమ్ముడు చెల్లిని చూసుకుంటూ ఉండేవాడు.వాళ్ళు కూడా పొలం పనులు చేసుకుంటూ అన్నకు సాయంగా ఉండేవారు. కొన్ని రోజులకు కృష్ణయ్యకు పెళ్లి అయింది.కృష్ణయ్య దంపతులు కలిసి రాజమ్మకు మంచి సంబంధం చూసి పెళ్లి చేశారు .ఇంకా హనుమయ్య పెళ్లే మిగిలింది ,అతను చాలా ఆశపరుడు పెద్దగా చదువుకోకపోయినా కూడా మంచి అందమైన, చదువుకున్న అమ్మాయి కావాలని వచ్చిన సంబంధాలు అన్ని వదిలేసాడు.ఏదయినా పని చేయమంటే నేను ఎందుకు చేస్తా అన్నకు నాకు కలిపి 3 ఎకరాల పొలం ఉంది కదా అని ఏ పని చేయకపోతుండే.అలా కొద్దిరోజులు గడిచింది ఒక అమ్మాయి హనుమయ్యకు దొరికింది ,వారి కుటుంబంతో కలిసి మాట్లాడి పెళ్లికి ఒప్పించాడు కృష్ణయ్య.
హనుమయ్య దంపతులు ,కృష్ణయ్య దంపతులు కలిసి చాలా సంతోషంగా ఉన్నారు కొన్ని రోజులకు వాళ్లకు పిల్లలు కలిగారు కృష్ణయ్యకు ఇద్దరు కుమారులు ,హనుమయ్యకు ఇద్దరు కుమార్తెలు. కృష్ణయ్య పిల్లలందరిని పాఠశాలకు పంపించేవారు.పిల్లలందరూ మంచిగా చదువుకుంటూ ఉండేవారు .హనుమయ్య భార్య మాకు ఇక్కడ పల్లెటూరులో ఉండాలని లేదు ఈ వ్యవసాయం చేస్తే ఏమి మిగలదు అని పట్నానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు చెప్తుంది.చేసేది ఏమి లేక హనుమయ్యకు వచ్చేపొలం అమ్మి డబ్బులు ఇచ్చి పంపించాడు కృష్ణయ్య. కృష్ణయ్య అతని భార్య కొడుకులు కలిసి జీవించడం మొదలు పెట్టారు.వర్షాలు సరిగ్గా పండక ఆ ఏడు అనుకున్న సమయానికి పంట వేయలేకపోయాడు కృష్ణయ్యకు పోలం పని తప్ప ఏమీ రాక పోవడంతో ఎవరూ పని ఇవ్వలేదు .అతని దగ్గర పిల్లల స్కూల్లో కట్టడానికి డబ్బలు లేవు అని పిల్లల చదువుకోసం అప్పు తెచ్చాడు.అలా చిన్న చిన్న అవసరాలకు అప్పులు చేయడం మొదలు పెట్టాడు .ఈ సారి పొలంలో పంట వేసాడు కానీ పురుగు తగిలి పంట అంతా చెడిపోయి నష్టం వచ్చింది.పంటలు మార్చి వేసినా ఫలితం లేకపోయింది .అప్పులన్ని కుప్పలుగా పెరిగిపోయాయి. పిల్లలిద్దరిని చదువు మాన్పించి పనిలో పెట్టాడు భార్య కూడా పనికి వెళ్ళేది .కృష్ణయ్య కూడా స్థానికంగా ఉన్న కెమికల్ కంపెనీలో వాచమాన్ గా చేరాడు అందరూ కష్టపడి పని చేసి కొంత అవసరాలకు వాడుకొని మిగిలిన సొమ్మును అప్పులు కట్టడం మొదలు పెట్టారు.అందరూ కలిసి 45 సంవత్సరాలలో అప్పులన్ని తీర్చారు .
కృష్ణయ్య కొడుకులకు ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు రైతులది చాలా గొప్ప జీవితం అతను పండించడం ఆపేస్తే అందరికి భోజనానికి ఇబ్బంది అవుతుంది అని. ఇన్ని రోజులు మనకు అప్పులు ఉన్నాయి కాబట్టి పొలాన్ని ముట్టుకోలేదు ఇప్పుడు మళ్లి పంట వేస్తా అన్నాడు సరే అన్నారు కొడుకులు.
ఈ సారి పొలానికి నీతో పాటు మేము కూడా వస్తాం అన్నారు .కొడుకులిద్దరు చాలా తెలివినవాళ్ళు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతకాలి అని నిర్ణయించారు. పొలాన్ని నాలుగు భాగాలు చేసి, ముందుగా బోరు వేయించారు .ఒక భాగంలో ఆకుకూరలు వేశారు, రెండవ భాగంలో కూరగాయలు వేశారు .మూడవ దానిలో పూల మొక్కలు నాటారు.నాలుగవ భాగంలో వరి వేశారు.ఆకుకూరలు తొందరగా పంట చేతికి వచ్చింది అవి తీసుకెళ్లి మార్కెట్ లో అమ్మి డబ్బులు సంపాదించేవారు.కొన్ని రోజులకు కూరగాయలు, పూలు కూడా రావడం మొదలు అయింది వారి పంట రావడానికి చాలా రోజుల సమయం పడుతుంది కాబట్టి ఈ లోపు ఆకుకూరలు, కూరగాయలు, పూలు అమ్మడంతో వారికి డబ్బులు మిగిలేవి అలా వ్యవసాయం చేస్తూనే ఇంకా పక్క వారి పొలాన్ని కౌలుకు తీసుకొని పెద్దగా చేశారు అలా మెల్లిగా ఒకదాని తర్వాత ఒకటి పంటలు మార్చుకుంటూ అధిక దిగుబడిని సాధించారు.ప్రభుత్వం నుండి కృష్ణయ్య ఉత్తమ రైతు అవార్డు అందుకున్నాడు.అది చూసిన హనుమయ్య మళ్ళీ తిరిగి అన్న దగ్గరకు వచ్చాడు .రాజమ్మ కూడా తన కూతురును ఇచ్చి కృష్ణయ్య కొడుకుతో వివాహం జరిపించింది.నిజమైన రైతు ఎంత కష్టం వచ్చినా పొలాన్ని అమ్మడు, పొలంలోనే కష్టపడి తన కష్టాలన్నీ తీర్చుకుంటాడు.భూమిని నమ్ముకున్నవాళ్ళు ఎప్పుడూ బాధపడరు. కృష్ణయ్య అతని కొడుకులు సమయానికి తగు నిర్ణయం తీసుకున్నారు దానివల్ల రకరకాల పంటలు వేసి బాగుపడ్డారు.
Comments
Post a Comment