పులి-బాటసారి కథ
పంచతంత్ర కథలు చాలా గొప్ప నీతిని కలిగి ఉంటాయి, వీటిని విష్ణుశర్మ గారు రచించారు.అందులో ఒకటి పులి -బాటసారి కథ.
అనగనగా ఒక ఊరు, ఆ ఊరికి అవతల చెరువు ఒడ్డుకు ఒక పులి నివాసం ఉంది అది చాలా ముసలి పులి.అయితే దాని దగ్గర ఒక బంగారు కంకణం ఉంది .ఒకరోజు అటుగా వెళుతున్న బాటసారిని చూసి దగ్గరగా వెళ్లి ఓ బ్రహ్మణోత్తమా!నువు చూడడానికి చాలా పుణ్యాత్ముడి లాగా కనిపిస్తున్నావు.నా దగ్గర ఒక బంగారు కంకణం ఉంది దీనిని నేను ఎవరైనా పుణ్యాత్ముడికి దానం చేయాలని ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నా.నువ్వు కనిపించావు ఇదిగో ఒకసారి ఆ చెరువులో స్నానం చేసి వచ్చి ఈ కంకణం తీసుకో అన్నది పులి .
సరే కానీ నువ్వు క్రూర జంతువువు నేను నిన్ను ఎలా నమ్మాలి అని భయంతో కూడిన ధైర్యంతో ప్రశ్నించాడు. దానికి ఆ ముసలి పులి చూడు నాయనా నన్ను చూస్తే కనబడుత లేదా నేను ఎంత ముసలి దానినో, నా గోర్లు అన్ని మొద్దుబారినవి ,పళ్ళు మొత్తం ఉడిపోయినవి చేతులు కాళ్లు లేవడం లేదు ఎన్నో రోజుల నుండి చాలా మంది ప్రాణాలు తీసిన తప్పుకు పరిహారంగా ఈ దానం చేద్దాం అనుకుంటున్నా అన్నది పులి.పులి చాలా నమ్మకంగా చెప్పే సరికి అతను స్నానం చేయడానికి చెరువులోకి దిగాడు అది చేరువులగా కనిపిస్తున్న మట్టి ఊబి దానిలో దిగగానే అతను అందులో చిక్కుకొని పోయాడు పులి ఒక్క ఉదుటున దూకి ఆ బాటసారిని తినేసింది.ఈ కథ విన్నాక నాకు కూడా ఎవరిని నమ్మవద్దు అని బలంగా అనిపించింది.ఒక పక్క పాపం నిజంగా ఆది ముసలి పులి ఎం చేస్తుందిలే అని ధైర్యం ,ఇంకోపక్క ఉచితంగా వస్తుంది అన్న ఆశ రెండు కలిసి అతని ప్రాణాలు తీశాయి.ఎవరైనా ఎడిన ఉచితంగా ఇస్తున్నారు అంటే దాని వెనక ఏదో మతలబు ఉంటుంది జాగ్రత్తగా ఉండండి.
Super💐 👌
ReplyDelete