ఆదిశక్తి....
"యత్ర నార్యస్తు పూజ్యతే తత్ర రమంత దేవతా" అన్నారు పెద్దలు ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారని ప్రతీతి.గౌరీశంకరులు అది దంపతులు వారు మానవాళికి ఆదర్శ దంపతులు. స్త్రీ ,పురుషులు ఒకరి పట్ల ఒకరికి నమ్మకం ,గౌరవం, ప్రేమ ఉండాలి.నారాయణుడు లక్ష్మీదేవిని, శివుడు పార్వతిని, బ్రహ్మ సరస్వతిని గౌరవించారు అదే గౌరవం సమాజంలో స్త్రీల పట్ల ఉండాలి అని పురాణాలు చాటి చెప్పాయి.ఎక్కడో ఉన్న గుడిలోని దేవతమూర్తికి వంగి వంగి దండాలు పెడతాం ,అమ్మా కాపాడు అని ప్రార్దిస్తాం కానీ ఇంట్లో ఉన్న లక్ష్మీ ,సరస్వతి, పార్వతిని మాత్రం చులకనగా చూస్తాం.స్త్రీలు అన్ని రంగాలలో ముందుకు దూసుకొని పోతున్నారు.స్త్రీల యొక్క ప్రయాణం ఎన్నో అవరోధాలను కలిగి ఉంటుంది.అయినా వారు అన్ని ఆటంకాలను సమర్థంగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతారు.ప్రయాణం ముఖ్యం కాదు గమ్యస్థాననికి చేరుకోవడం ప్రధానం అంటారు పెద్దలు.స్త్రీల పట్ల దయ ,జాలి ,కరుణ ఉండాల్సిన అవసరం లేదు కానీ వారి హక్కులను నియంత్రించకుండా ఉంటే సరిపోతుంది.కాలం మారింది కానీ సనాతన సంప్రదాయాలు,కట్టుబాట్లు కొన్ని మారడం లేదు.అరవింద సమేత సినిమా లో ఆడవాళ్లకు రాజకీయలా అంటే పాలిచ్చే తల్లులకు పరిపాలించడం ఒక లెక్కనా అంటుంది .మనందరి జీవితంలో తల్లి యొక్క పాత్ర అమోఘం.అలా అని పురుషుడు గొప్ప కదా అని ప్రశ్న పుడుతుంది మనసులో, స్త్రీ, పురుషులు ఇరువురూ ప్రధానమే కానీ పురుషాహంకార ధోరణి మాత్రం సరైనది కాదు అనేది ఈ వ్యాఖ్య యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
సమాజంలో స్త్రీలు ఒక్కో కాలానికి ఒక్కో రకంగా పరివర్తన చెందుతున్నారు. పూర్వకాలంలో వేద విద్యలు నేర్చుకున్న లోపముద్ర,గార్గి, రచనలు చేసిన కవయిత్రి మొల్ల,దేశాన్ని పరిపాలించిన మొదటి ముస్లిం మహిళ రాజియా సుల్తానా ,రాణి రుద్రమదేవి,ఝాన్సీ లక్ష్మీభాయ్, చరిత్రలో నిలిచిపోయారు.ఈ తరానికి కాస్తూర్భా గాంధీ,విజయలక్ష్మీ పండిట్,సరోజిని నాయుడు,ఆనంది బెన్ పటేల్(మొదటి మహిళ వైద్యురాలు) ,వీరనారి చాకలి ఐలమ్మ ఇంక ఎందరో ఉన్నారు.స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు ఉషా మెహతా స్వతంత్ర పోరాటంలో ఏకంగా ఒక రేడియో ను నిర్వహించేది.ఇప్పుడు పి.టి ఉష కరణం మల్లేశ్వరి క్రీడలు, ఇందిరాగాంధీ,సుష్మాస్వరాజ్ రాజకీయాలు, మిథాలి రాజ్ మొట్టమొదటి మహిళ క్రికెటర్ ,సునీత విలియుమ్స్ ,కల్పన చావ్లా మొదలగువారు వున్నారు.సినిమాలు ,రాజకీయాలు, క్రీడలు వంటి అనేక రంగాల్లో స్త్రీలు తమ పాత్ర పోషిస్తూ దేశ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు .మహిళామణులు గతాన్ని గుర్తు చేసుకుంటూభవిష్యత్తును మీకు నచ్చినట్టుగా తీర్చిదిద్దుకోండి.ప్రతి స్త్రీ ఒక ఆదిశక్తే...
Comments
Post a Comment