నిబద్ధత

అనగనగా ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు రమణ, వామన వుండేవారు.రమణ ఎప్పుడు ఎదో ఒక పని చేసుకుంటూఉండేవాడు వామన మాత్రం ఏ పని చేయకుండా కాలక్షేపం చేస్తూ ఉండేవాడు.
వారిద్దరూ ప్రాణ స్నేహితులు అవడంతో రమణ,వామనను వెనకేసుకొని వచ్చేవాడు తర్వాత మందలించేవాడు. ఆ ఊరులో పనులు దొరకక పోవడంతో వేరే ప్రాంతానికి వలస వెళ్ళవలసి వచ్చింది. అక్కడ ఒక తోటలో పనికి కుదిరారు ఇద్దరు.తోట యజమాని ఇద్దర్నీ పిలిచి ఒకరు కాపలా పని ,ఇంకొకరు కాయలు తెంపడం చేయండి అని చెప్పాడు.
బద్ధకస్తుడు అయిన వామన నేను కాపలా ఉంటాను నువ్వు కాయలు తెంపు అన్నాడు,సరే అన్నాడు రమణ .ప్రతిరోజూ వారి వారి పనులు చేస్తూ జీవించ సాగారు.ఒకరోజు తోట యజమాని పని మీద బయటకు వెళ్ళాడు, రమణ కాయలు తెంపి యింటికి వెళ్ళాడు.వామన తోటలో ఎవరు లేరు అని హాయిగా నిద్రపోయాడు ,తోటలో దొంగలు పడి కాయలు ఎత్తుకెళ్లారు.యజమాని వచ్చేసరికి వామన నిద్రపోతుండడం దొంగలు పడడం చూసి అతనిని నిద్ర లేపి తిట్టి పంపించాడు.ఇప్పటిదాకా చేసిన పనికి కూడా డబ్బులు ఇవ్వలేదు .అందుకే ఎవరైనా ఏదైనా పని చెప్తే అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు దానిని నిబద్ధతతో చేయాలి......

Comments

Popular posts from this blog

రామచిలుక కథ

చిన్న చేప కథ

అంతా మన మంచికే...