గాడిద తెలివి

అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు.అతను ఒక కుక్కను,గాడిదను పెంచుకున్నాడు.కుక్కను కాపలాగా ఉంచి గాడిదను పట్నానికి తీసుకోని వెళ్ళాడు అక్కడ నుండి సరుకులు అన్ని తెచుకునేవాడు.ఇలా రోజులు గడిచిపోతున్నాయి.,గాడిదకు కుక్క మీద ఎక్కువ అసూయ పెంచుకుంటుంది.ఒకరోజు ఇంట్లో వాళ్ళు అందరూ నిద్రిస్తుండగా దొంగలు వచ్చారు వారిని చూసి కుక్క మొరిగింది, అందరూ లేచి దొంగలను తరిమికొట్టారు. గాడిదకు కోపం వచ్చింది దానిని మెచ్చుకొని ఇంకా గారబం చేశారు.గాడిద అరిచింది ఈ సారి దానిని కొట్టాడు రైతు రామయ్య.
కోపం తెచ్చుకొని ఎలాగైనా వీరికి బుద్ది చెప్పాలని నిర్ణయించుకుంది.పట్నానికి సరుకులు తేవడానికి వెళ్ళేటప్పుడు నదిని దాటాలి,అప్పుడు నేను పడిపోయినట్టు నటిస్తాను అన్ని సరుకులు పడిపోతాయి అనుకుంది.సరుకులు తీసుకొని వస్తుండగా నదిలో పడిపోయింది దానిలో సరుకులు పాడైపోయాయి.ఉప్పు బస్తా మొత్తం కరిగిపోయింది గాడిదకు ఇది ఎదో మాయనదివలె ఉంది అని భావించి ఏ రోజు కి ఏ పని లేదు అని సంతోషంగా ఇంటికి వెళ్ళింది .రైతు మాత్రం గాడిదకు ఏమైనా దెబ్బలు తగిలాయి అని అనుకోని డాక్టర్ ని తెచ్చాడు మందులు ఇచ్చాడు .రెండు రోజులు ఏ పని చెప్పలేదు అది మాత్రం బాధ లేకుండా ఉంది .కొన్ని రోజుల తర్వాత గాడిదను మళ్ళీ పట్నానికి తెలుకెళ్లాడు,వచ్చేటప్పుడు పఫైపోయినట్టు నటించింది.సరుకులు పాడైపోయాయి. రైతు ఆలోచించాడు ఇది కావాలనే చేసింది,దీనికి గుణపాఠం చెప్పాలని తెల్లారి పట్నానికి తీసుకెళ్లి దూది బస్తాలు కొన్నాడు.ఎప్పటిలాగే నది మధ్యలోకి రాగానే పడిపోయినట్టు నటించింది. నీటిని పీల్చి దూది మరింత బరువెక్కింది,కుయ్యో మొర్రో అనుకుంటూ నదిని దాటి ఇంటికి చేరింది.రైతు ఇంకోసారి చేస్తావా అని అన్నాడు.నువు ఎదుటి వారిని చూసి అసూయ పడి పని తప్పించుకోవాలని చేసావు.అయిన కుక్క రాత్రంతా మేల్కొని ఇంటికి కాపలా కాస్తుంది నువ్వు ఒక్క గంట పని చేస్తే చాలు మిగతా సమయం అంత విశ్రాంతి తీసుకుంటావు అంటాడు.గాడిద తప్పు ఒప్పుకుని ఇంకోసారి చేయను అని అంటుంది.విశ్వాసం లో కుక్కను మించిన వారు ఎవరు లేరు.




Comments

Popular posts from this blog

రామచిలుక కథ

చిన్న చేప కథ

అంతా మన మంచికే...