Posts

పర్యావరణం-జంతువులు.

Image
అమ్మా ఇక్కడ నీళ్లు ఏంటి ఇలా ఉన్నాయి చాలా మురికిగా ఎలా తాగాలి అని అడిగింది పిల్లకోతి ,ఎం చేస్తాం బిడ్డా దాహం వేసినప్పుడు ఏదో ఒకటి తాగి మన దాహాన్ని తీర్చుకోవాలి అన్నది .ఎందుకమ్మా ఇలా ? మన తాత ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు పచ్చని చెట్లు , చల్లని గాలి ,సెలయర్ల గలగలలు ,పక్షుల కీలకిలలు ,కోయిల కూని రాగాలు, చెట్ల నిండా పండ్లు, ఫలాలు,కూరగాయలు ఇలా ఒక్కటేమిటి అన్ని అంటుండేవాడు . ఎవమ్మా ఇప్పుడు అవన్నీ అన్నది మాకు కనపడవా?.   పాపం ఆ తల్లి కోతికి కూడా బాగా బాధ అనిపించింది.అవునమ్మా ఒకప్పుడు ఈ పర్యావరణం అలాగే ఉండేది.కానీ ఇప్పుడు అలా లేదు అంటుంటే కుందేలు వచ్చింది, ఎందుకు కోతి బావా అలా అంటున్నావు అన్నది, సరే విను చెప్తా అని చెప్పడం మొదలుపెట్టింది .ఒక్కొక్కటిగా అన్ని జంతువులు అక్కడ గుమి గుడాయి.  ప్రకృతి అంటే గాలి, నీరు ,నింగి,నేల,నిప్పు ఇవన్నీ  పంచభూతాలు . భూమి మీద మనుషులు ,జంతువులు జీవిస్తాయి జంతువులు అన్నీ అడవులలోనే జీవనం సాగించేవి ,మనుషులు పరిణామ క్రమంలో మొదట అడవుల నుండి క్రమంగా నీరు ఉన్న ప్రదేశాలలలో ఆవాసాలు  ఏర్పరచుకున్నారు.నీటి చుట్టూ వున్న ఆవాసాలు మెల్లిగా గ...

కచుడు -దేవయాని కథ..

Image
మా కళాశాలలో తెలుగు ఉపాధ్యాయుడు పాఠం చెప్తూ మహాభారతంలో లేనిది లోకం లో లేదు లోకంలో ఉన్నది అంత మహాభారతంలో  ఉంటుంది అన్నారు కానీ నాకు అర్థం కాలేదు .కానీ నిజంగా ఒక్కొక్క కథ చదువుతుంటే అప్పుడప్పుడు నిజమే అనిపిస్తుంది. ఈ కథ మహాభారతంలో ఒక ప్రేమకథ, కానీ ఇద్దరు ప్రేమించుకోలేదు ఒక్కరు మాత్రమే ప్రేమించారు ,అసలు ఏంటో ఈ కథ తెలుసుకుందాం.             హిందూ పురాణాల ప్రకారం దేవతలకు,రాక్షసులకు యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో దేవతలు రాక్షసులని ఎంతమందిని చంపినా రాక్షసులు చనిపోకుండా  మళ్ళీ మృత సంజీవని విద్య ద్వారా  బ్రతుకుతున్నారు.ఈ విద్య కేవలం రాక్షసుల గురువైన శుక్రాచార్యుడుకి మాత్రమే తెలుసు. దేవతలు అంతా కూర్చొని ఆలోచించసాగారు.      దేవతల గురువు బృహస్పతి అతని కుమారుడు కచుడు, దేవతలు అందరూ కచుడిని శుక్రాచార్యుడి  దగ్గరకు శిష్యరికానికి పంపించారు. కచుడు శుక్రాచార్యుడికి జరిగిన విషయం చెప్పి అతని దగ్గర శిష్యుడిగా చేరాడు .కచుడు మంచి ప్రవర్తనతో అతని మనసు గెలుచుకున్నాడు, శిష్యులందరిలో ఉత్తముడిగా పేరు సంపాదించాడు. శుక్రాచార్యుడుకి దేవయాని...

పీత-కొంగ కథ .🦀🦢.

Image
ఈ రోజు పంచతంత్రం కథలలో పీత-కొంగ   కథ తెలుసుకుందాం. అనగనగా ఒక కొలను ఆ కొలనులో ఒక పీత నివాసం ఉంటుంది. ఒకసారి ఆ కొలను దగ్గరకు ఒక కొంగ వచ్చింది.అది ఆ కొలనులో దిగి ఒంటి కాలు మీద తపస్సు చేస్తున్నట్టు నటించుతుంది రోజు ! అది రోజూ పీత, కొలనులో చేపలు చూస్తున్నాయి.అయితే ఆ చేపలు కానీ పీత కానీ కొంగది దొంగ జపం అని గుర్తించ లేకపోయినాయి.ఒకరోజు పీత కొంగ దగ్గరకు వచ్చి మహాత్మా! ఇక్కడ ఇన్ని చేపలు మీ కళ్ళ ముందు తిరుగుతున్న కూడా మీరు వాటిని పట్టి తినకుండా ఇలా జపం చేసుకుంటున్నారు దీనికి కారణం ఏమిటి అన్నది. అప్పుడు ఆ కొంగ మరింత ధ్యానంలో ఉన్నట్టు నటించింది.కొంగగారు మిమ్మల్ని నేను అడుగుతున్న అయిన సమాధానం చెప్పడం లేదు కారణం ఏమైనా ఉందా అని అడిగింది మళ్లి పీత. కొంగ మెల్లిగా కళ్ళు తెరిచి మీరు భక్తి శ్రద్ధలతో అడిగారు కాబట్టి చెబుతున్న విను,నువ్వు చెప్పినట్టు ఆ మధ్యదాక  నేను కూడా చేపలనే కాదు భగవంతుడు మాకు ఇచ్చిన నేను తినదగిన అన్ని జంతువులను తినేవాడిని.ఆ మధ్య కాలంలో నేను నివసించే చెట్టు కిందకు ఒక యోగి వచ్చాడు.ఆయనతో చాలా మంది శిష్యులు కూడా ఉన్నారు.ఆ శిష్యులకు ఉపదేశం చేసేటపుడు నేను ఆ చెట్టు పైన...

లాభమా? -నష్టమా?

Image
అనగనగా ఒక పెద్ద అడవి దాని పేరు సుందరవనము.అది అతి సుందరంగా వుండడం చేతదానిని సుందరవనము అంటారు.ప్రతి అడవికి రాజు సింహమే కదా ఇక్కడ కూడా సింహమే రాజు ,కుందేలు మాత్రం మంత్రి . అడవిలో అన్నీ జంతువులు చాలా సంతోషంగా జీవనం సాగిస్తున్నాయి.ఒకరోజు సింహం వేటకు వెళ్ళింది అక్క కొన్ని వృద్ధ జంతువులు కూర్చొని తమ తమ సమస్యల గురుంచి మాట్లాడుకుంటున్నాయి.        దూరం నుంచి ఆ మాటలు వింటుంది సింహం వారికి కనపడకుండా .ఆ జంతువులు మనము ఇప్పుడు ముసలి వాళ్ళము మనకు వేటాడే శక్తి లేదు కాబట్టి మన పిల్లలను బాధ పెట్టకుండా మనలో మనం ఆహారం ఐపోయి చనిపోదాం అని అంటున్నాయి.ఆ మాట విన్న సింహం కళ్ళలో నీళ్ళు తిరిగాయి. సింహం తన స్థావరనికి వచ్చి కుందేలును పిలిచి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది .జంతువులు అన్ని భయం భయంగా వచ్చాయి.అప్పుడు అక్కడ ఉన్న జంతువులను ఉద్దేశించి మన అడవిలో ఎవరికైనా అత్యవసరంగా సాయం చేయవలసి ఉందా అని అడిగింది, అన్ని ఆలోచించసాగాయి.కుందేలు టక్కున లేచి సాయం కోసం ఎదురు చూసేది కేవలం వృద్ధ ప్రాణులే అంది కుందేలు.ఐతే మీరందరు వృద్ధ జంతువుల సంరక్షణ కోసం సలహాలు,సూచనలు చేయవలసిందిగా ఆదేశించింది. రాజా మన...

పాజిటివ్ థింకింగ్.

Image
  సెప్టెంబర్ నెలలో 13 వ తేదీని పాజిటివ్ థింకింగ్ డే గా నిర్వహిస్తారు.సానుకూల ఆలోచనలు మనిషిని మంచి మార్గం వైపుకు మళ్లిస్తాయి.ఒక వ్యక్తి ఎంత బాధలో ఉన్నా తనయొక్క ఆలోచనలు నియంత్రించుకోకపోతే అవి వ్యతిరేక ఆలోచనలుగా మారతాయి,దానివల్ల మనం లేక ఇతరులు భాదపడవలసి వస్తుంది.సానుకూల ఆలోచనలు మన మెదడును ప్రభావితం చేస్తాయి.మనం చేసే ప్రతి పని ఒక పద్దతిలో చేయాలి,ప్రతికూల ఆలోచనల ధోరణిని విడిచిపెట్టాలి.కాదు అని అనుకున్న పనులు కూడా మన ప్రయత్నంతో పూర్తి అవుతాయి.ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు ప్రణాళిక రచన చాలా ప్రధానం,ప్రణాలికను చక్కగా ఆచరణలో పెడితే తొంబై శాతం పూర్తి అవుతుంది.మిగిలిన 10 శాతం పని చేయడం వల్ల ఐపోతుంది.సానుకూల ఆలోచనల వల్ల మెదడు ప్రశాంతంగా ఉంటుంది,సృజనాత్మకత బయట పడుతుంది. ప్రతికూల ఆలోచనల వల్ల అనవసరంగా ఆరోగ్యం పాడవుతుంది.రక్తపోటు, ఆందోళన,డిప్రెషన్ వంటివి చేరతాయి.ఆటగ్యాన్ని దెబ్బతీసే ప్రతికూల ఆలోచనలు చేయవద్దు. ఒక విషయాన్ని ఎంత ఆలోచించిన మారదు, కాన్ని దాని నుండి బయట పడే మార్గాన్ని వెతికితే సులువుగా ఆ పని మనం చేయవచ్చు. మీకు పాజిటివ్ థింకింగ్ గురించి ఒక కథ చెప్తాను.రామాపురంలో సుగుణమ్మ అనే ఒక ముసలి అవ్...

సజ్జన సాంగత్యం

Image
అది వర్షాకాలం గౌతమ బుద్ధుడు తన శిష్యులతో కురు దేశంలో వున్నాడు .వర్షాల కారణంగా ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్లడం కష్టం కాబట్టి ఆ నాలుగు నెలలు అక్కడే వున్నారు.ఒకరోజు ఆనందుడు బిక్షాటనకు బయలుదేరాడు .అతను అనుకోకుండా అవంతిక అనే వేశ్య ఇంటికి బిక్షకు వెళ్ళాడు.ఆమె అతనికి భిక్ష వేసి వర్షాల కారణంగా మీరు ఇబ్బంది పడుతున్నారని విన్నాను మీకు అభ్యంతరం లేకపోతే మీరు నా ఇంట్లో ఉండొచ్చు అంది . దానికి ఆనందుడు బిక్షువులు ఎక్కడ ఉండాలో తధగతుడు నిర్ణయిస్తాడు అని వారిని అడిగి చెబుతానన్నాడు.అది విన్న బుద్దుడు ఆమెనే ఆహ్వానించినపుడు నువ్వు ఆ ఇంట్లో విడది  చేయడంలో తప్పులేదు నువ్వు అక్కడికి మకాం మార్చుకో అన్నాడు.   అలా ఆనందుడు వేశ్య ఇంటికి వెళ్ళాడు.అవంతిక చక్కటి అతిధి మర్యాదలతో స్వాగతం పలికి ఆహ్వానించింది.అతనికి చినిగిపోయిన బట్టలు చూసి కొత్తవి కుట్టించింది.ఆనందుడికి చలి నుండి రక్షణ కలిగింది.అవంతిక వేళకు అతనికి వేడి వేడి భోజనం అందిస్తూ ఆనందుడు చెప్పే హితోక్తులు శ్రద్ధగా వినేది. ఆ మాటల ప్రభావం చేత అవంతిక కొద్దిరోజుల్లోనే అతడి శిష్యురాలు అయింది .అయితే ఒక బిక్షువు వేశ్య ఇంట్లో ఉండడం తోటివార...

పులి-బాటసారి కథ

Image
పంచతంత్ర కథలు చాలా గొప్ప నీతిని కలిగి ఉంటాయి, వీటిని విష్ణుశర్మ గారు రచించారు.అందులో ఒకటి పులి -బాటసారి కథ . అనగనగా ఒక ఊరు, ఆ ఊరికి అవతల చెరువు ఒడ్డుకు ఒక పులి నివాసం ఉంది అది చాలా ముసలి పులి.అయితే దాని దగ్గర ఒక బంగారు కంకణం ఉంది .ఒకరోజు అటుగా వెళుతున్న బాటసారిని చూసి దగ్గరగా వెళ్లి ఓ బ్రహ్మణోత్తమా!నువు చూడడానికి చాలా పుణ్యాత్ముడి లాగా కనిపిస్తున్నావు.నా దగ్గర ఒక బంగారు కంకణం ఉంది దీనిని నేను ఎవరైనా పుణ్యాత్ముడికి దానం చేయాలని ఎంతోకాలంగా ఎదురు చూస్తున్నా.నువ్వు కనిపించావు ఇదిగో  ఒకసారి ఆ చెరువులో స్నానం చేసి వచ్చి ఈ  కంకణం తీసుకో అన్నది పులి .      సరే కానీ నువ్వు క్రూర జంతువువు నేను నిన్ను ఎలా నమ్మాలి అని భయంతో కూడిన ధైర్యంతో ప్రశ్నించాడు. దానికి ఆ ముసలి పులి చూడు నాయనా నన్ను చూస్తే కనబడుత లేదా నేను ఎంత ముసలి దానినో, నా గోర్లు అన్ని మొద్దుబారినవి ,పళ్ళు మొత్తం ఉడిపోయినవి చేతులు కాళ్లు లేవడం లేదు ఎన్నో రోజుల నుండి చాలా మంది ప్రాణాలు తీసిన తప్పుకు పరిహారంగా ఈ దానం చేద్దాం అనుకుంటున్నా అన్నది పులి.పులి చాలా నమ్మకంగా చెప్పే సరికి అతను స్నానం చేయడానికి చెరువులోకి ద...