సాధారణంగా మనం సినిమాల్లో హీరో వేషం వేసిన వారు అందరూ హీరోలలాగా , విలన్ గా చేసినవారిని విలన్ లాగా అనుకుంటాం కానీ అందరూ అలాగే ఉండరు కొంతమంది హీరోలగా చేసినా విలన్ క్యారెక్టర్ చూపిస్తారు.మీకు అందరికీ తెలిసిన ఒక యదార్థ సంఘటన చెప్తా , సోనూసూద్ గారు కరోనా వచ్చినప్పుడు ఎంతో మందికి సహాయం చేసి తన యొక్క మానవత్వాన్ని నిరూపించాడు. అతను తెలుగు సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలే చేశాడు కానీ అతను చేసిన పని చూసి చాలా మందికి గౌరవం కలిగింది . ఎవరైనా ఎలాంటి వారు అన్నది ఇంట్లో ఉండి అయినా చూడాలి లేదా వెంట వెళ్ళి అయినా చూడాలి అంటారు పెద్దలు అప్పుడే వాళ్ళ ప్రవర్తన మనకు పూర్తిగా అర్థం అవుతుంది. చేసే పనికి మనిషి వ్యక్తిత్వానికి సంబంధం లేదు అని చెప్పే ఒక కథ తెలుసుకుందాం . మహాభారతంలో ధర్మవ్యాధుడు అని ఒకతను ఉండేవాడు అతని కథను చదివితే మీకే అర్థం అవుతుంది చేసే పనికి మనిషి వ్యక్తిత్వానికి సంబంధం లేదు అని. పూర్వం కౌశికుడు అనే ఒక మహర్షి ఉండేవాడు అతడు అన్ని విద్యలలో ఆరి తేరిన వాడు,సర్వ ఙ్ఞానం కలిగినవాడు. ఒకరోజు చెట్టు కింద కూర్చొని శిష్యులకు వేదాలు నేర్పుతుండగా ఒక కొంగ అతనిపై రెట్ట వేసింది అద...
“చిన్న నీతి కథలు” బ్లాగ్లో పిల్లల కోసం సరదాగా చదవడానికి తెలుగు నీతి కథలు, జంతువుల కథలు, స్నేహం కథలు మరియు ప్రేరణాత్మక కథలు అందుబాటులో ఉంటాయి. ప్రతి కథలో ఒక మంచి నీతి ఉంటుంది, ఇది పిల్లలకి మంచి అలవాట్లు నేర్పుతుంది. Discover the best Telugu moral stories, short stories for kids, and inspirational stories in Telugu.