Skip to main content

బహుమతి - శిక్ష

తెలుగు కథలలో ముఖ్యంగా తెనాలి రామ కథలు చాలా ప్రత్యేకం.కొన్ని హాస్యాస్పదం మరికొన్ని తెలివి తేటలకు సంబంధించినవి ఉంటాయి.ఇది కూడా అలాంటిదే.
రామకృష్ణుడి స్నేహితుడు ఒకరోజు సభా మందిరాన్ని చూడాలని అనుకున్నాడు అయితే అతడు రేపు రా అని చెప్పాడు . స్నేహితుడు తెల్లారక సభ సమయానికి వచ్చాడు ద్వార పాలకులు అడ్డగించారు లోపలికి వెళ్లనివ్వలేదు.అతను రామలింగని స్నేహితుడిని అని చెప్పినా వినలేదు.మరుసటి రోజు ఆ స్నేహితుడు రామలింగడి ఇంటికి వచ్చి జరిగిన విషయం చెప్పాడు.
సరే ఈ విషయాన్నీ నేను కనిపెడత్తా అని  రామలింగడు మరునాడు సభకు మారువేషంలో వెళ్ళాడు.లోపలికి వెళ్లబోతుంటే ద్వారపాలకులు అడ్డుకున్నారు  , అయితే రామలింగడు తనను తాను ఒక కళాకారుడిగా పరిచయం చేసుకున్నాడు.భటులు ఒకవేళ నీ కళ నచ్చితే రాజుగారు నీకు బహుమతి ఇస్తారు మాకు ఏం లాభం అన్నారు .సరే నాకు ఇచ్చిన బహుమతిలో సగం ఇస్తాను అని అన్నాడు రామలింగడు.ఇలా కొంచెం లోపలికి వెళ్లగానే మళ్లీ ద్వారపాలకులు అడ్డగించారు అలా మొత్తం సభలోకి వెళ్ళడానికి చాలా మంది అడ్డగించారు . రాజు దగ్గరికి వెళ్ళి తన కవిత్వం చెప్పాడు ఆ కవిత్వానికి మెచ్చి  కృష్ణదేవరాయలు ఏమి బహుమతి కావాలో కోరుకో అన్నాడు రామలింగడు తెలివిగా నాకు వంద కొరడా దెబ్బలు కావాలి అని అన్నాడు రాజు విచిత్రంగా చూస్తూ , ఎవరైనా  మంచి మంచి బహుమతులు అడుగుతారు  నువ్వేంటి ? దెబ్బలు అడుగుతున్నావు అన్నాడు .రామలింగడు వేషం తీసి తనను తాను పరిచయం చేసుకున్నాడు అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యం పొందారు .రాజుగారు ఏమైంది రామలింగ ఎందుకు ఇలా చేశావు అని ప్రశ్నించాడు.రామలింగడు  మన రాజభవనానికి రావడానికి లంచం ఇస్తే సరిపోతుంది ఎవరినైనా లోపలికి అనుమతిస్తారు .మొదటి ద్వారం నుండి చివరి ద్వారం వరకు అందరికీ ఈ కొరడా దెబ్బలు పడాలి ఎందుకంటే అందరూ రాజుగారు ఇచ్చిన బహుమతిలో సగం వారికి ఇస్తేనే లోపలికి అనుమతిస్తాం అన్నారు .  మా  సభలో ఇలాంటివి జరగవు అన్నాడు, స్వయంగా నేను వెళ్ళి తెలుసుకున్న అన్నాడు రామలింగడు. రాజుకి కోపం వచ్చి  ద్వార పాలకులందరినీ తొలగించి కొత్త వారిని నియమించారు . మరల ఇలాంటి తప్పిదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటానన్నారు.








Comments

Post a Comment

Popular posts from this blog

రైతు కథ..

ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు  డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి  తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా  ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి  దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా! ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా. కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా. మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల  లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి  ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా.     అనగనగా ఒక ఊర...

చిలుక జింక స్నేహం నీతి కథ (True Friendship Story in Telugu)

అనగనగా ఒక అందమైన అడవిలో ఓ చురుకైన చిలుక, ఒక అమాయక జింక ఉండేవి. ఆ ఇద్దరూ ఎంతో మంచి స్నేహితులు. ప్రతిరోజూ కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ, దూరంగా వెళ్లి తిండి వెతుక్కొని వచ్చేవి. ఒకరోజు చిలుకకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. “మనకు ప్రతిసారి తిండి కోసం తిరగాల్సి వస్తోంది. మనమే ఒక చిన్న తోట పెంచుకుంటే ఎలా ఉంటుంది?” అని జింకను అడిగింది. జింకకు ఆ ఆలోచన చాలా నచ్చింది. “అవును! మనమే పండ్లు పెంచుకుంటే ఎప్పుడైనా తినవచ్చు” అని ఆనందంగా చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రదేశాన్ని ఎంచుకుని గింజలు వేశారు. చిలుక ప్రతిరోజూ వచ్చి చూసేది కానీ పని మాత్రం చేయకుండా తప్పించుకునేది. జింక మాత్రం ఎంతో కష్టపడి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ, మొక్కలను జాగ్రత్తగా పెంచింది. కొన్ని రోజుల తర్వాత మొక్కలు పెద్దవై అందమైన పండ్లతో నిండిపోయాయి. అప్పుడు చిలుక వచ్చి, “ఇది మన ఇద్దరి తోట కదా! పండ్లు ఇద్దరం పంచుకుందాం” అని చెప్పింది. జింక కొంచెం కోపంగా నవ్వుతూ, “పని చేసేప్పుడు కనిపించలేదు, కానీ తినేప్పుడు మాత్రం వచ్చావు! స్నేహం అంటే మాటల్లో కాదు… పని చేసినప్పుడు కూడా కలిసి ఉండాలి” అని చెప్పింది. చిలుక తన తప్పు అర్థం చేసుకుంది. “ఇక మీదట...

ఐకమత్యమే మహాబలం.

ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ఆస్తిపరుడు. అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు, వారు అంత పిల్లపాపాలతో సుఖంగా జీవించేవారు.కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య ఆరోగ్యం చెడిపోయింది తన తర్వాత ఆస్తిని చూసుకోవడానికి తన కొడుకులకు అప్పజెప్పాలని అనుకుంటాడు. వారంతా ఎవరికి వారు నాకే దక్కాలని ప్రయత్నాలు చేసారు.ఈ ఆస్తి అంత ఒక్కదగ్గరే ఉండాలని దాన్ని ముక్కలు చేయవద్దు అని రాఘవయ్య భావించాడు.అలా కొడుకులకు చెప్పాడు అయినా వాళ్ళు వినలేదు.రాఘవయ్య కొడుకులకు బుద్ది చెప్పాలని ఒకరోజు కొడుకులకు నాలుగు కట్టెలు తెమ్మన్నాడు .అందరిని నిలబెట్టాడు, ఒక్కొక్కరిని ఆ కట్టెలు విరగగొట్టమన్నాడు.అందరూ విరిచేశారు.తర్వాత అందరి చేతుల నుండి కట్టెలు తీసుకొని ఒక కట్టలాగా కట్టాడు.దానిని విరవమన్నాడు,అందరూ ప్రయత్నించారు.ఒక్కరు కూడా విరవలేక పోయారు.అప్పుడు రాఘవయ్య చూసారా మీరు ఒక్కొక్కరుగా ఉంటే మీకు నష్టం కలుగుతుంది మిమ్మలను ఎవరు విడదీయగలుగుతారు,అదే మీరు ఉమ్మడిగా ఉంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అందుకే కలిసి ఉంటే కలదు సుఖం , ఐకమత్యమే మహాబలం .