Skip to main content

మహాభారతంలో ధర్మవ్యాధుని కథ

సాధారణంగా మనం సినిమాల్లో హీరో వేషం వేసిన వారు అందరూ హీరోలలాగా , విలన్ గా చేసినవారిని విలన్ లాగా అనుకుంటాం కానీ అందరూ అలాగే ఉండరు కొంతమంది హీరోలగా చేసినా విలన్ క్యారెక్టర్ చూపిస్తారు.మీకు అందరికీ తెలిసిన ఒక యదార్థ సంఘటన చెప్తా , సోనూసూద్ గారు కరోనా వచ్చినప్పుడు ఎంతో మందికి సహాయం చేసి తన యొక్క మానవత్వాన్ని నిరూపించాడు. అతను తెలుగు సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలే చేశాడు  కానీ అతను చేసిన పని చూసి చాలా మందికి గౌరవం కలిగింది . ఎవరైనా ఎలాంటి వారు అన్నది ఇంట్లో ఉండి అయినా చూడాలి లేదా వెంట వెళ్ళి అయినా చూడాలి అంటారు పెద్దలు అప్పుడే వాళ్ళ ప్రవర్తన మనకు పూర్తిగా అర్థం అవుతుంది.
    చేసే పనికి మనిషి వ్యక్తిత్వానికి సంబంధం లేదు అని చెప్పే ఒక కథ తెలుసుకుందాం . మహాభారతంలో  ధర్మవ్యాధుడు అని ఒకతను ఉండేవాడు అతని కథను చదివితే మీకే అర్థం అవుతుంది చేసే పనికి మనిషి వ్యక్తిత్వానికి సంబంధం లేదు అని.
పూర్వం కౌశికుడు అనే ఒక మహర్షి ఉండేవాడు అతడు అన్ని విద్యలలో ఆరి తేరిన వాడు,సర్వ ఙ్ఞానం కలిగినవాడు. ఒకరోజు చెట్టు కింద కూర్చొని శిష్యులకు వేదాలు నేర్పుతుండగా ఒక కొంగ అతనిపై రెట్ట వేసింది అది చూసి చిన్న పిల్లలు కదా నవ్వారు వెంటనే కౌశికుడికి కోపం వచ్చింది కొంగ వైపుకి కోపంగా  ఒక చిన్న చూపు చూశారు అంతే అది భస్మం అయిపోయింది .
మరుసటి రోజు భిక్షాటనకు వెళ్ళాడు  ఒక ఇంటి దగ్గర ఆగి భవతి బిక్షం దేహి అన్నాడు ,లోపలనుండి ఒక స్త్రీ వస్తున్నాను ఉండండి అన్నది .అప్పుడే బోజనానికి కూర్చున్న భర్త పిలవడంతో అతడికి వడ్డించి బయటకు వెళ్ళింది .కౌశికుడికి కోపం వచ్చింది  ఎంతసేపు ఎదురుచూడాలి అని కోపంగా అన్నాడు. ఆమె చిరునవ్వుతో నేనేం కొంగని కాదు శపిస్తే భస్మం అవడానికి అన్నది మహర్షి ఆశ్చర్యంతో నీకెలా తెలుసు అన్నాడు. ఆమె మహా పతివ్రత, చేసిన పూజలు పూర్వ జన్మ కారణంగా అన్ని తెలుసుకోగలిగే ఙ్ఞానం ఉంది . అమ్మా క్షమించు ! అని అన్నాడు.మీరు నాకు  జ్ఞానబోధ చేయగలరా? అని కౌశికుడు అడిగాడు .
ఆమె నేను కాదు మిథిలా నగరంలో ఒక మాంస వ్యాపారి ధర్మ వ్యాధుడు  ఉన్నాడు అతడిని వెళ్ళి కలువు అని చెప్పింది .అతడికి నచ్చలేదు కానీ సరే చెప్పింది కదా ఒకసారి వెళ్ళి చూద్దాం అని వెళ్ళాడు కౌశికుడు.
 కౌశికుడు  మిథిలా నగరానికి వెళ్ళి  అతడిని  చూసాడు  ధర్మవ్యాధుడు మాంసం ముక్కలు కొడుతున్నాడు కౌశికుడికి అసహ్యం వేసి ఇతడి దగ్గరా నేను ఙ్ఞానం నేర్చుకోవలసింది అని అనుకున్నాడు ,కానీ ఏం చేస్తాం మనకు తెలియనిది ఎవరు చెప్పినా వినాలి అని అతడిని కలిసి జరిగింది చెప్పాడు , ధర్మవ్యాధుడు  గురువర్యా ! మీరు గొప్ప గొప్ప వేదాలు నేర్చుకున్న పండితులు నేను మీకు ఙ్ఞాన బోధ చేసేంతటి వాడిని కాదు అని అన్నాడు . అయినప్పటికీ  నాకు తెలిసినంత వరకు ధర్మం అంటే ఏమిటో చెప్తాను అలాగే చూపిస్తా అని కౌశికుడిని  తీసుకొని ఇంటికి  వెళ్ళాడు .
ఆ ఇల్లు ఎంతో అందంగా ఉంది అక్కడ ధర్మవ్యాధుడి తల్లి తండ్రి ఎంతో సంతోషంగా ఉన్నారు ఆ ఇల్లు పిల్లల ఆటపాటలతో ఎంతో సందడిగా ఉంది. కౌశికుడు ఆ ఇల్లు చూసి చాలా మురిసి పోయాడు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి యోగ క్షేమాలు అడిగాడు వాళ్ళు చెప్పిన మాట విని కౌశికుడికి నోట మాట రాలేదు. నా కొడుకు మాకు ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటున్నాడు అతని పిల్లలు , భార్య మాకు ఎల్లవేళలా సేవలు చేస్తూ ఉంటారు మాకు కావాల్సింది క్షణాల్లో  మా ముందు ఉంచుతారు ఈ వయసులో మాకు ఇంతకన్నా ఏం కావాలి మలిదశలో తల్లిదండ్రుల ఆలనా పాలనా చూసేవారు ఏవరుంటారు.నాకొడుకు కారణ జన్ముడు అతడి నీడలో మేము సంతోషంగా ఉన్నాం అన్నారు.  
నేను నా తల్లిదండ్రులను నిత్యం సేవిస్తూ ఉంటూ జ్ఞానాన్ని సంపాదించాను వారి పాద సేవనే నాకు నోము ,వ్రతం లాంటిది మహర్షి . ఙ్ఞానం  మనం ఎక్కడికో వెళ్ళి సంపాదించేది కాదు.  మన  వారితో ఉంటూ నేర్చుకునేది. ముల్లోకాలను చుట్టి రావాలని శివుడు వినాయకుడికి,కుమారస్వామికి చెప్తే,వినాయకుడు తెలివిగా ఆలోచించి తల్లితండ్రుల సేవనే ఉత్తమ మార్గంగా ఎంచుకున్నాడు . అలాగే మనం కూడా మొదట తల్లితండ్రుల సేవకు ప్రాధాన్యం ఇవ్వాలి అని ధర్మవ్యాధుడు చెప్పాడు.
ఇదే బ్రహ్మజ్ఞానం అంటారు గురువర్యా అన్నాడు ధర్మవ్యాధుడు . నువ్వు వృద్ధాప్యంలో వున్న నీ తల్లితండ్రులను వదిలి ఙ్ఞానం సంపాదించడానికి వెళ్ళవు కానీ ఆ ముసలి తల్లిదండ్రులకు నీ అవసరం చాలా ఉంది అని తెలుసుకోలేకపోయావు.వాళ్ళకు నువ్వే ఆధారం అలాంటి వారిని వదిలి నీ అంతటా నువ్వు వచ్చావు అక్కడ వాళ్ళు నీ మీద బెంగతో బాధపడుతూ  వాళ్ళు గుడ్డివాళ్ళు అయ్యారు ఇది కూడా నువ్వు తెలుసుకోలేదు.
నిజం గ్రహించిన కౌశికుడు నేను తప్పుచేసాను, నన్ను క్షమించు. ఇన్నాళ్ళు నేనే పండితుడిని అని గర్వపడ్డాను వెళ్ళి నా తల్లిదండ్రుల సేవ చేసుకుంటాను అని అన్నాడు .
ఇంత జ్ఞానం నేర్పించిన నిన్ను చూస్తుంటే వింతగా ఉంది మూడు కాలాలు తెలిసిన వాడివి నీ గత జన్మ రహస్యం ఏమిటో చెప్పగలరా అన్నారు కౌశికుడు .అప్పుడు ధర్మవ్యాధుడు నేను పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడిని, నేను రాజకుమారుడు తో స్నేహం చేసి అతనితో పాటు అన్ని విద్యలను నేర్చుకున్నాను. విలువిద్య నేర్చుకున్న నేను ఒకరోజు అడవికి వెళ్లి చాలా జంతువులని వేటాడము ఆ సమయంలో నా బాణము వెళ్ళి  ఒక మహర్షికి గుచ్చుకుంది  అతడికి గాయం  అయింది నొప్పితో విలవిల్లాడదు అతని దగ్గరకు వెళ్లి క్షమించండి మహర్షి అని వేడుకున్నాను . అతడు నువ్వు బ్రాహ్మణ కులంలో పుట్టి హింస చేశారు కాబట్టి ఇచ్చే జన్మలో నువ్వు శూద్ర కులంలో  పుట్టి జంతువులను వధించి బతుకుదెరువు తో బతుకుతావు అని శాపించాడు.మెల్లిగా అతడికి గుచ్చుకున్న బాణాన్ని తీశాను వైద్యం చేసి ప్రాణాపాయం నుండి తప్పించాను.అతడు శాపాన్ని మాత్రం వెనక్కి తీసుకోలేదు నువ్వు శూద్రుడివి అయినను మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకుంటావు తల్లిదండ్రుల సేవలో తరిస్తావు అని చెప్పాడు.   ఇప్పటికీ నేను నా జన్మ సార్థకం చేసుకున్నాను. ఈ కథ వల్ల నీతి ఏమిటో అర్థం అయిందా  కసాయి పని చేసాడు ఎప్పుడూ కసాయి వాడు కాదు అది వృత్తి మాత్రమే .కేవలం వృత్తినే ఆధారంగా చేసుకొని మనుషులను అంచనా వేయొద్దు. మనిషి యొక్క ప్రవర్తన వల్ల వారికి గుర్తింపు వస్తుంది తప్ప పని వల్ల కాదు😀













Comments

Popular posts from this blog

రైతు కథ..

ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు  డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి  తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా  ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి  దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా! ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా. కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా. మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల  లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి  ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా.     అనగనగా ఒక ఊర...

చిలుక జింక స్నేహం నీతి కథ (True Friendship Story in Telugu)

అనగనగా ఒక అందమైన అడవిలో ఓ చురుకైన చిలుక, ఒక అమాయక జింక ఉండేవి. ఆ ఇద్దరూ ఎంతో మంచి స్నేహితులు. ప్రతిరోజూ కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ, దూరంగా వెళ్లి తిండి వెతుక్కొని వచ్చేవి. ఒకరోజు చిలుకకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. “మనకు ప్రతిసారి తిండి కోసం తిరగాల్సి వస్తోంది. మనమే ఒక చిన్న తోట పెంచుకుంటే ఎలా ఉంటుంది?” అని జింకను అడిగింది. జింకకు ఆ ఆలోచన చాలా నచ్చింది. “అవును! మనమే పండ్లు పెంచుకుంటే ఎప్పుడైనా తినవచ్చు” అని ఆనందంగా చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రదేశాన్ని ఎంచుకుని గింజలు వేశారు. చిలుక ప్రతిరోజూ వచ్చి చూసేది కానీ పని మాత్రం చేయకుండా తప్పించుకునేది. జింక మాత్రం ఎంతో కష్టపడి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ, మొక్కలను జాగ్రత్తగా పెంచింది. కొన్ని రోజుల తర్వాత మొక్కలు పెద్దవై అందమైన పండ్లతో నిండిపోయాయి. అప్పుడు చిలుక వచ్చి, “ఇది మన ఇద్దరి తోట కదా! పండ్లు ఇద్దరం పంచుకుందాం” అని చెప్పింది. జింక కొంచెం కోపంగా నవ్వుతూ, “పని చేసేప్పుడు కనిపించలేదు, కానీ తినేప్పుడు మాత్రం వచ్చావు! స్నేహం అంటే మాటల్లో కాదు… పని చేసినప్పుడు కూడా కలిసి ఉండాలి” అని చెప్పింది. చిలుక తన తప్పు అర్థం చేసుకుంది. “ఇక మీదట...

ఐకమత్యమే మహాబలం.

ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ఆస్తిపరుడు. అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు, వారు అంత పిల్లపాపాలతో సుఖంగా జీవించేవారు.కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య ఆరోగ్యం చెడిపోయింది తన తర్వాత ఆస్తిని చూసుకోవడానికి తన కొడుకులకు అప్పజెప్పాలని అనుకుంటాడు. వారంతా ఎవరికి వారు నాకే దక్కాలని ప్రయత్నాలు చేసారు.ఈ ఆస్తి అంత ఒక్కదగ్గరే ఉండాలని దాన్ని ముక్కలు చేయవద్దు అని రాఘవయ్య భావించాడు.అలా కొడుకులకు చెప్పాడు అయినా వాళ్ళు వినలేదు.రాఘవయ్య కొడుకులకు బుద్ది చెప్పాలని ఒకరోజు కొడుకులకు నాలుగు కట్టెలు తెమ్మన్నాడు .అందరిని నిలబెట్టాడు, ఒక్కొక్కరిని ఆ కట్టెలు విరగగొట్టమన్నాడు.అందరూ విరిచేశారు.తర్వాత అందరి చేతుల నుండి కట్టెలు తీసుకొని ఒక కట్టలాగా కట్టాడు.దానిని విరవమన్నాడు,అందరూ ప్రయత్నించారు.ఒక్కరు కూడా విరవలేక పోయారు.అప్పుడు రాఘవయ్య చూసారా మీరు ఒక్కొక్కరుగా ఉంటే మీకు నష్టం కలుగుతుంది మిమ్మలను ఎవరు విడదీయగలుగుతారు,అదే మీరు ఉమ్మడిగా ఉంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అందుకే కలిసి ఉంటే కలదు సుఖం , ఐకమత్యమే మహాబలం .