Skip to main content

Posts

Showing posts from July, 2026

మహాభారతంలో ధర్మవ్యాధుని కథ

సాధారణంగా మనం సినిమాల్లో హీరో వేషం వేసిన వారు అందరూ హీరోలలాగా , విలన్ గా చేసినవారిని విలన్ లాగా అనుకుంటాం కానీ అందరూ అలాగే ఉండరు కొంతమంది హీరోలగా చేసినా విలన్ క్యారెక్టర్ చూపిస్తారు.మీకు అందరికీ తెలిసిన ఒక యదార్థ సంఘటన చెప్తా , సోనూసూద్ గారు కరోనా వచ్చినప్పుడు ఎంతో మందికి సహాయం చేసి తన యొక్క మానవత్వాన్ని నిరూపించాడు. అతను తెలుగు సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలే చేశాడు  కానీ అతను చేసిన పని చూసి చాలా మందికి గౌరవం కలిగింది . ఎవరైనా ఎలాంటి వారు అన్నది ఇంట్లో ఉండి అయినా చూడాలి లేదా వెంట వెళ్ళి అయినా చూడాలి అంటారు పెద్దలు అప్పుడే వాళ్ళ ప్రవర్తన మనకు పూర్తిగా అర్థం అవుతుంది.     చేసే పనికి మనిషి వ్యక్తిత్వానికి సంబంధం లేదు అని చెప్పే ఒక కథ తెలుసుకుందాం . మహాభారతంలో    ధర్మవ్యాధుడు అని ఒకతను ఉండేవాడు అతని కథను చదివితే మీకే అర్థం అవుతుంది చేసే పనికి మనిషి వ్యక్తిత్వానికి సంబంధం లేదు అని. పూర్వం కౌశికుడు అనే ఒక మహర్షి ఉండేవాడు అతడు అన్ని విద్యలలో ఆరి తేరిన వాడు,సర్వ ఙ్ఞానం కలిగినవాడు. ఒకరోజు చెట్టు కింద కూర్చొని శిష్యులకు వేదాలు నేర్పుతుండగా ఒక కొంగ అతనిపై రెట్ట వేసింది అద...

భృగు మహర్షి బ్రహ్మజ్ఞానం పొందిన కథ – ఆనందమే బ్రహ్మం

భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక గొప్ప సత్యాన్ని బోధించాడు. అదేంటంటే, ఆధ్యాత్మిక సాధనలో చేసే ఏ ప్రయత్నమూ ఎప్పటికీ వృథా కాదు. మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ తమ తమ విధంగా ప్రయత్నిస్తారు. కొందరికి సత్యాన్ని గ్రహించడానికి ఎక్కువ సమయం పడుతుంది, మరికొందరు త్వరగా తెలుసుకుంటారు. ఇది వారి శ్రద్ధ, పట్టుదల, సాధనపై ఆధారపడి ఉంటుంది. అందుకే గీతలో "శ్రద్ధావాన్ లభతే జ్ఞానం" అని చెప్పబడింది. సత్యాన్ని తెలుసుకోవాలనే తపన ఉన్నవాడు తన ఇంద్రియాలను నియంత్రణలో ఉంచుకుంటాడని గీత బోధిస్తుంది. అలాంటి సత్యాన్వేషణలో భాగంగా బ్రహ్మజ్ఞానాన్ని పొందిన మహర్షే భృగు మహర్షి.   భృగు మహర్షి బ్రహ్మదేవుని మానస పుత్రుడు. ఒకరోజు ఆయన తన తండ్రిని అడిగాడు: "దేవుడు ఎవరు? ఆయనను ఎలా తెలుసుకోవాలి?" అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా చెప్పాడు: "తపస్సు ద్వారా బ్రహ్మాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయి. బ్రహ్మం మాటలకు అందదు, మనసుకు పూర్తిగా అర్థం కాదు. అనుభవం ద్వారానే దానిని తెలుసుకోవాలి." తండ్రి మాటలలోని లోతైన అర్థాన్ని గ్రహించిన భృగు మహర్షి అరణ్యానికి వెళ్లి కఠోర తపస్సు ప్రారంభించాడు. దీర్ఘకాల ధ్యానం, ...