Skip to main content

తండ్రి కొడుకు గాడిద కథ(telugu moral story)

అనగనగా ఒక ఊరిలో  చంద్రయ్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు .అతనికి రుద్ర అనే కొడుకు ఉండేవాడు  . వాళ్ళు  ఒకరోజు బజారుకు వెళ్ళి ఒక గాడిదను కొన్నారు దానిని తీసుకొని నడుచుకుంటూ వెళుతున్నారు . అలా వెళ్తుండగా అతనికి తెలిసినవాళ్ళు వచ్చి చిన్న పిల్లాడిని ఎందుకు  నడిపిస్తున్నావు , గాడిద మీద ఎక్కించి తీసుకెళ్ళవచ్చు కదా ! అని అన్నారు . ఆ మాటలు విన్న చంద్రయ్య రుద్రను ఎక్కించి నడుచుకుంటూ వెళుతున్నారు. అలా కొంత సేపటికి మరల ఒక వ్యక్తి కనిపించి అరేయ్ రుద్రా నువ్వు దిగు  మీ నాన్నకు కాళ్ళు నొప్పులు వస్తాయి , నువ్వు చిన్న పిల్లాడివి  నీకు ఏం కాదు అన్నాడు. అప్పుడు రుద్ర దిగి తండ్రి చంద్రయ్య ను ఎక్కించాడు. కొంత దూరం వెళ్ళాక   రమణయ్య అనే పాత స్నేహితుడు కలిసి పిల్లాడిని నడిపించి నువ్వు హాయిగా కూర్చున్నావు అని అన్నాడు  చంద్రయ్య ఆలోచించి రుద్రను కూడా పైకి ఎక్కించాడు . కొద్దిసేపటికి బ్రాహ్మణుల గుంపు ఎదురయింది వారు ,గాడిదపైన ఇద్దరు కూర్చున్నారు ఎలా వెళ్తదీ అది  మీరు జీవహింస చేస్తున్నారు అని అన్నారు.అప్పుడు బ్రాహ్మణుల మాటలు విన్న చంద్రయ్య, రుద్ర ఇద్దరూ గాడిద మీద నుంచి దిగిపోయారు.
“ఇలా చేస్తే గాడిదకు బాధ ఉండదు” అని అనుకుని, వారు ఒక కర్ర తీసుకొని గాడిద కాళ్లను కట్టి, ఆ కర్రకు వేలాడదీసి ఇద్దరూ మోస్తూ వెళ్లడం మొదలుపెట్టారు.
అలా వెళ్లుతూ ఉండగా, దారిలో ఉన్న వాళ్ళంతా వారిని చూసి నవ్వసాగారు.
“ఏమిట్రా ఇది! గాడిద మీద ఎక్కాల్సింది పోయి, దానినే మోస్తున్నారు!” అని అందరూ వెక్కిరించారు.
ఆ నవ్వుల వల్ల చంద్రయ్యకు కోపం వచ్చి, గందరగోళంలో గాడిదను వదిలేశారు.
అది వెంటనే పారిపోయింది.
చివరికి చంద్రయ్య, రుద్ర ఇద్దరూ ఖాళీ చేతులతో ఇంటికి తిరిగి వెళ్లాల్సి వచ్చింది.
“ప్రతి ఒక్కరి మాట వినడం వల్ల మనమే నష్టపోతాం. మనకు సరైనదేంటి అనేది మనమే ఆలోచించాలి.”








Comments

Popular posts from this blog

రైతు కథ..

ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు  డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి  తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా  ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి  దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా! ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా. కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా. మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల  లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి  ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా.     అనగనగా ఒక ఊర...

చిలుక జింక స్నేహం నీతి కథ (True Friendship Story in Telugu)

అనగనగా ఒక అందమైన అడవిలో ఓ చురుకైన చిలుక, ఒక అమాయక జింక ఉండేవి. ఆ ఇద్దరూ ఎంతో మంచి స్నేహితులు. ప్రతిరోజూ కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ, దూరంగా వెళ్లి తిండి వెతుక్కొని వచ్చేవి. ఒకరోజు చిలుకకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. “మనకు ప్రతిసారి తిండి కోసం తిరగాల్సి వస్తోంది. మనమే ఒక చిన్న తోట పెంచుకుంటే ఎలా ఉంటుంది?” అని జింకను అడిగింది. జింకకు ఆ ఆలోచన చాలా నచ్చింది. “అవును! మనమే పండ్లు పెంచుకుంటే ఎప్పుడైనా తినవచ్చు” అని ఆనందంగా చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రదేశాన్ని ఎంచుకుని గింజలు వేశారు. చిలుక ప్రతిరోజూ వచ్చి చూసేది కానీ పని మాత్రం చేయకుండా తప్పించుకునేది. జింక మాత్రం ఎంతో కష్టపడి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ, మొక్కలను జాగ్రత్తగా పెంచింది. కొన్ని రోజుల తర్వాత మొక్కలు పెద్దవై అందమైన పండ్లతో నిండిపోయాయి. అప్పుడు చిలుక వచ్చి, “ఇది మన ఇద్దరి తోట కదా! పండ్లు ఇద్దరం పంచుకుందాం” అని చెప్పింది. జింక కొంచెం కోపంగా నవ్వుతూ, “పని చేసేప్పుడు కనిపించలేదు, కానీ తినేప్పుడు మాత్రం వచ్చావు! స్నేహం అంటే మాటల్లో కాదు… పని చేసినప్పుడు కూడా కలిసి ఉండాలి” అని చెప్పింది. చిలుక తన తప్పు అర్థం చేసుకుంది. “ఇక మీదట...

ఐకమత్యమే మహాబలం.

ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ఆస్తిపరుడు. అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు, వారు అంత పిల్లపాపాలతో సుఖంగా జీవించేవారు.కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య ఆరోగ్యం చెడిపోయింది తన తర్వాత ఆస్తిని చూసుకోవడానికి తన కొడుకులకు అప్పజెప్పాలని అనుకుంటాడు. వారంతా ఎవరికి వారు నాకే దక్కాలని ప్రయత్నాలు చేసారు.ఈ ఆస్తి అంత ఒక్కదగ్గరే ఉండాలని దాన్ని ముక్కలు చేయవద్దు అని రాఘవయ్య భావించాడు.అలా కొడుకులకు చెప్పాడు అయినా వాళ్ళు వినలేదు.రాఘవయ్య కొడుకులకు బుద్ది చెప్పాలని ఒకరోజు కొడుకులకు నాలుగు కట్టెలు తెమ్మన్నాడు .అందరిని నిలబెట్టాడు, ఒక్కొక్కరిని ఆ కట్టెలు విరగగొట్టమన్నాడు.అందరూ విరిచేశారు.తర్వాత అందరి చేతుల నుండి కట్టెలు తీసుకొని ఒక కట్టలాగా కట్టాడు.దానిని విరవమన్నాడు,అందరూ ప్రయత్నించారు.ఒక్కరు కూడా విరవలేక పోయారు.అప్పుడు రాఘవయ్య చూసారా మీరు ఒక్కొక్కరుగా ఉంటే మీకు నష్టం కలుగుతుంది మిమ్మలను ఎవరు విడదీయగలుగుతారు,అదే మీరు ఉమ్మడిగా ఉంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అందుకే కలిసి ఉంటే కలదు సుఖం , ఐకమత్యమే మహాబలం .