Skip to main content

శిఖండి కథ

ఆడవారు ఎంత ప్రేమగా అమ్మలా ఉంటారో అదేవిధంగా తనకు అన్యాయం జరిగితే అదే అమ్మ కాళికా మాత అవతారంతో తన ప్రతీకారం తీర్చుకుంటారు.అలాంటి ఒక ప్రేమ ,ఆప్యాయత,ప్రతీకారం కి సంబంధించిన కథ మన మహాభారతంలోని శిఖండిని కథ.
అనగనగా కాశీ దేశానికి ఒక రాజు ఉండేవాడు. అతనికి ముగ్గురు అందమైన కుమార్తెలు  అంబ, అంబిక, అంబాలికలు ఉండేవారు.వారిని రాజు అల్లారుముద్దుగా పెంచుకున్నాడు.కొంతకాలం తర్వాత వారికి స్వయంవరం ఏర్పాటు చేశాడు. స్వయంవరానికి అన్ని దిక్కుల నుండి రాజులు వచ్చారు. విషయం తెలుసుకున్న భీష్ముడు తన సోదరుడు విచిత్రవీర్యుడి వివాహం జరిపించాలని ఆ స్వయంవరానికి వచ్చాడు.
ఇక్కడికి వచ్చిన వారందరిలో ఎవరు బలవంతులైతే వారికి నా కూతుర్లును ఇచ్చి వివాహం చేస్తాను అని కాశి రాజు ప్రకటించాడు.అక్కడికి వచ్చిన వారందరిని ఒంటిచేత్తో భీష్ముడు ఓడించాడు అందులో సాళ్వుడు అనే యువరాజు కూడా ఉన్నాడు.
భీష్ముడు అంబ,అంబికా,అంబాలికలను తీసుకొని వాయువేగంతో హస్తినాపురానికి చేరాడు.వెళ్ళే మార్గంలో అంబ తను సాల్వుడినీ ప్రేమిస్తున్న విషయం చెప్పింది ,  భీష్ముడు అంబను గౌరవంగా  పంపించాడు.
అంబ శాల్వుడి దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పింది. కానీ శాల్వుడు ఇలా అన్నాడు:
“నిన్ను భీష్ముడు గెలిచి తీసుకెళ్లాడు. ఇప్పుడు నేను నిన్ను అంగీకరించలేను.”
అంబ తీవ్రంగా బాధపడింది. ఆమె నా వివాహ జీవితం నాశనం అయిపోయింది. అని
తర్వాత ఆమె తిరిగి భీష్ముడి దగ్గరకు వచ్చి:
“నువ్వే నన్ను పెళ్లి చేసుకో”
అని అడిగింది.
కానీ భీష్ముడు తన బ్రహ్మచర్య ప్రతిజ్ఞ  గురించి ఆమెకు తెలియ చెప్పాడు ,
అంబకు  న్యాయం అనిపించలేదు . ఆమె కోపంతో మండిపోయింది.
అంబ మహా ఋషి పరశురాముడి దగ్గరకు వెళ్లి తన బాధ చెప్పింది.
పరశురాముడు భీష్ముడిని పిలిచి: నేను నీ గురువుగా చెప్తున్నా 
“అంబను వివాహం చేసుకో”
అని చెప్పాడు.
కానీ భీష్ముడు తన ప్రతిజ్ఞను విడిచిపెట్టలేదు.
దాంతో పరశురాముడికి కోపం వచ్చింది  భీష్ముడు  , పరశురాముడి మధ్య  భయంకరమైన యుద్ధం జరిగింది. ఎన్నో రోజులు యుద్ధం జరిగినా ఎవ్వరూ గెలవలేదు.
చివరికి దేవతలు వచ్చి యుద్ధాన్ని ఆపించారు.
అంబ మాత్రం తన ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంది.
అంబ అడవికి వెళ్లి శివుడి కోసం కఠిన తపస్సు చేసింది.
శివుడు ప్రత్యక్షమై ఇలా అన్నాడు:
“ఈ జన్మలో కాదు… వచ్చే జన్మలో నువ్వు భీష్ముడి మరణానికి కారణం అవుతావు.”
అంబ సంతోషించింది. వెంటనే అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేసింది.
కొంతకాలానికి పాంచాల రాజు ద్రుపదునికి ఒక శిశువు జన్మించింది. అదే శిఖండి.
శివుడి వరం వల్ల ఆమె పూర్వజన్మలో అంబ.
ద్రుపదుడు ఈ శిశువు ప్రత్యేకమని తెలుసుకొని రహస్యంగా పెంచాడు.
 శిఖండి మొదట స్త్రీగా జన్మించింది. తర్వాత యక్షుడి సహాయంతో పురుషుడిగా మారింది.
అందువల్ల శిఖండి జీవితం చాలా విచిత్రంగా మారింది. తండ్రితో పాటు అనేక యుద్ధాల్లో పాల్గొనేది.ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది.
 మహాభారత యుద్ధం ప్రారంభమైంది.
అర్జునుడు మరియు పాండవులు భీష్ముడిని ఓడించలేకపోయారు. ఎందుకంటే భీష్ముడు అపారమైన యోధుడు.
అప్పుడు కృష్ణుడు ఒక రహస్యం చెప్పాడు:
“భీష్ముడు స్త్రీపై ఆయుధం ఎత్తడు. శిఖండి పూర్వజన్మలో అంబ. కాబట్టి శిఖండిని ముందుంచి యుద్ధం చేయండి.”
మరుసటి రోజు అర్జునుడు శిఖండిని రథం ముందు నిలబెట్టాడు.
భీష్ముడు శిఖండిని చూసి ఆయుధాలు వదిలేశాడు.
ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని అర్జునుడు అనేక బాణాలు వదిలాడు.
భీష్ముడు బాణాల మంచంపై పడిపోయాడు. శిఖండి ఎన్నో అవమానాలు పడింది చివరకు 
ఇలా  తన ప్రతీకారం తీర్చుకుంది.
అవమానం మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తుంది.
ప్రతిజ్ఞలు కొన్ని సార్లు జీవితాలను నాశనం చేస్తాయి.
ధర్మం, అధర్మం మధ్య గీత చాలా సున్నితమైనది.
ఒకరి బాధను తక్కువగా చూడకూడదు.

Comments

Post a Comment

Popular posts from this blog

రైతు కథ..

ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు  డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి  తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా  ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి  దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా! ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా. కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా. మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల  లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి  ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా.     అనగనగా ఒక ఊర...

చిలుక జింక స్నేహం నీతి కథ (True Friendship Story in Telugu)

అనగనగా ఒక అందమైన అడవిలో ఓ చురుకైన చిలుక, ఒక అమాయక జింక ఉండేవి. ఆ ఇద్దరూ ఎంతో మంచి స్నేహితులు. ప్రతిరోజూ కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ, దూరంగా వెళ్లి తిండి వెతుక్కొని వచ్చేవి. ఒకరోజు చిలుకకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. “మనకు ప్రతిసారి తిండి కోసం తిరగాల్సి వస్తోంది. మనమే ఒక చిన్న తోట పెంచుకుంటే ఎలా ఉంటుంది?” అని జింకను అడిగింది. జింకకు ఆ ఆలోచన చాలా నచ్చింది. “అవును! మనమే పండ్లు పెంచుకుంటే ఎప్పుడైనా తినవచ్చు” అని ఆనందంగా చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రదేశాన్ని ఎంచుకుని గింజలు వేశారు. చిలుక ప్రతిరోజూ వచ్చి చూసేది కానీ పని మాత్రం చేయకుండా తప్పించుకునేది. జింక మాత్రం ఎంతో కష్టపడి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ, మొక్కలను జాగ్రత్తగా పెంచింది. కొన్ని రోజుల తర్వాత మొక్కలు పెద్దవై అందమైన పండ్లతో నిండిపోయాయి. అప్పుడు చిలుక వచ్చి, “ఇది మన ఇద్దరి తోట కదా! పండ్లు ఇద్దరం పంచుకుందాం” అని చెప్పింది. జింక కొంచెం కోపంగా నవ్వుతూ, “పని చేసేప్పుడు కనిపించలేదు, కానీ తినేప్పుడు మాత్రం వచ్చావు! స్నేహం అంటే మాటల్లో కాదు… పని చేసినప్పుడు కూడా కలిసి ఉండాలి” అని చెప్పింది. చిలుక తన తప్పు అర్థం చేసుకుంది. “ఇక మీదట...

ఐకమత్యమే మహాబలం.

ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ఆస్తిపరుడు. అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు, వారు అంత పిల్లపాపాలతో సుఖంగా జీవించేవారు.కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య ఆరోగ్యం చెడిపోయింది తన తర్వాత ఆస్తిని చూసుకోవడానికి తన కొడుకులకు అప్పజెప్పాలని అనుకుంటాడు. వారంతా ఎవరికి వారు నాకే దక్కాలని ప్రయత్నాలు చేసారు.ఈ ఆస్తి అంత ఒక్కదగ్గరే ఉండాలని దాన్ని ముక్కలు చేయవద్దు అని రాఘవయ్య భావించాడు.అలా కొడుకులకు చెప్పాడు అయినా వాళ్ళు వినలేదు.రాఘవయ్య కొడుకులకు బుద్ది చెప్పాలని ఒకరోజు కొడుకులకు నాలుగు కట్టెలు తెమ్మన్నాడు .అందరిని నిలబెట్టాడు, ఒక్కొక్కరిని ఆ కట్టెలు విరగగొట్టమన్నాడు.అందరూ విరిచేశారు.తర్వాత అందరి చేతుల నుండి కట్టెలు తీసుకొని ఒక కట్టలాగా కట్టాడు.దానిని విరవమన్నాడు,అందరూ ప్రయత్నించారు.ఒక్కరు కూడా విరవలేక పోయారు.అప్పుడు రాఘవయ్య చూసారా మీరు ఒక్కొక్కరుగా ఉంటే మీకు నష్టం కలుగుతుంది మిమ్మలను ఎవరు విడదీయగలుగుతారు,అదే మీరు ఉమ్మడిగా ఉంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అందుకే కలిసి ఉంటే కలదు సుఖం , ఐకమత్యమే మహాబలం .