Skip to main content

వాతాపి జీర్ణం కథ..

 చిన్న పిల్లలకు అన్నం తినిపించిన వెంటనే జీర్ణం జీర్ణం  వాతాపి జీర్ణం అని ఎందుకు అంటారో తెలుసా? అయితే ఈ కథ చదవండి. వాతాపి జీర్ణం కథ పురాణాలలో ప్రసిద్ధమైన ఒక ఆసక్తికరమైన కథ.
ఒకప్పుడు వాతాపి, ఇల్వల అనే ఇద్దరు రాక్షస సోదరులు ఉండేవారు.  వీరు బలవంతులు మరియు మాయలమారులు  .  వారు తమ తెలివితేటలను మంచికి కాకుండా దుర్మార్గానికి ఉపయోగించేవారు.ఋషులను మోసం చేసి చంపడం తమ అలవాటుగా చేసుకున్నారు.
ఇల్వల బ్రాహ్మణ వేషం వేసుకొని  అతిధి సత్కారం పేరుతో అడవులలో తిరిగే ఋషులను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించేవాడు. వాతాపి అనే తన తమ్ముడిని మాయశక్తితో మేకగా మార్చి, ఆ మేకను వండి అతిథులకు భోజనంగా పెట్టేవాడు. అది మామూలు ఆహారం అని భావించి వారు భోజనం చేసేవారు.
ఋషులు ఆ మాంసం తిన్న తర్వాత, ఇల్వల “వాతాపి! బయటకు రా!” అని పిలిచేవాడు. అప్పుడు వాతాపి మళ్లీ తన అసలు రూపంలోకి వచ్చి, ఋషుల పొట్టను చీల్చుకొని బయటకు వచ్చేవాడు. ఇలా అనేకమంది ఋషులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత వారు ఋషులను తినేవారు.
ఈ విషయం ఆనోటా ఈ నోటా అగస్త్యుడికి తెలిసింది. సరే ఎలాగైనా వీరికి బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. అసలే సముద్రాన్నే కడుపులో దాచుకున్న మహర్షి .
ఒక రోజు అగస్త్య మహర్షి వారి ఇంటికి వచ్చాడు. అతనికి కూడా అదే విధంగా భోజనం పెట్టారు ఆ సోదరులు . అగస్త్యుడు అన్నీ తెలిసి కూడా ప్రశాంతంగా భోజనం చేశాడు.
భోజనం అయ్యాక ఇల్వల “వాతాపి! బయటకు రా!” అని పిలిచాడు.
అప్పుడు అగస్త్య మహర్షి చిరునవ్వుతో ఇలా అన్నాడు: “వాతాపి జీర్ణం!”
అంటే — “వాతాపి నా కడుపులోనే జీర్ణమైపోయాడు” అని అర్థం.
అతని తపస్సు శక్తితో వాతాపి పూర్తిగా జీర్ణమైపోయాడు, బయటకు రావడానికి అవకాశం లేకపోయింది.
దాంతో ఇల్వల తన తమ్ముడిని కోల్పోయి, అగస్త్యుడి శక్తికి భయపడి పారిపోయాడు.
దుర్మార్గానికి చివరికి శిక్ష తప్పదు
జ్ఞానం మరియు తపస్సు శక్తి ఎంత గొప్పదో తెలియజేసే కథ ఇది.

Comments

Popular posts from this blog

రైతు కథ..

ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు  డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి  తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా  ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి  దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా! ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా. కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా. మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల  లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి  ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా.     అనగనగా ఒక ఊర...

చిలుక జింక స్నేహం నీతి కథ (True Friendship Story in Telugu)

అనగనగా ఒక అందమైన అడవిలో ఓ చురుకైన చిలుక, ఒక అమాయక జింక ఉండేవి. ఆ ఇద్దరూ ఎంతో మంచి స్నేహితులు. ప్రతిరోజూ కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ, దూరంగా వెళ్లి తిండి వెతుక్కొని వచ్చేవి. ఒకరోజు చిలుకకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. “మనకు ప్రతిసారి తిండి కోసం తిరగాల్సి వస్తోంది. మనమే ఒక చిన్న తోట పెంచుకుంటే ఎలా ఉంటుంది?” అని జింకను అడిగింది. జింకకు ఆ ఆలోచన చాలా నచ్చింది. “అవును! మనమే పండ్లు పెంచుకుంటే ఎప్పుడైనా తినవచ్చు” అని ఆనందంగా చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రదేశాన్ని ఎంచుకుని గింజలు వేశారు. చిలుక ప్రతిరోజూ వచ్చి చూసేది కానీ పని మాత్రం చేయకుండా తప్పించుకునేది. జింక మాత్రం ఎంతో కష్టపడి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ, మొక్కలను జాగ్రత్తగా పెంచింది. కొన్ని రోజుల తర్వాత మొక్కలు పెద్దవై అందమైన పండ్లతో నిండిపోయాయి. అప్పుడు చిలుక వచ్చి, “ఇది మన ఇద్దరి తోట కదా! పండ్లు ఇద్దరం పంచుకుందాం” అని చెప్పింది. జింక కొంచెం కోపంగా నవ్వుతూ, “పని చేసేప్పుడు కనిపించలేదు, కానీ తినేప్పుడు మాత్రం వచ్చావు! స్నేహం అంటే మాటల్లో కాదు… పని చేసినప్పుడు కూడా కలిసి ఉండాలి” అని చెప్పింది. చిలుక తన తప్పు అర్థం చేసుకుంది. “ఇక మీదట...

ఐకమత్యమే మహాబలం.

ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ఆస్తిపరుడు. అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు, వారు అంత పిల్లపాపాలతో సుఖంగా జీవించేవారు.కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య ఆరోగ్యం చెడిపోయింది తన తర్వాత ఆస్తిని చూసుకోవడానికి తన కొడుకులకు అప్పజెప్పాలని అనుకుంటాడు. వారంతా ఎవరికి వారు నాకే దక్కాలని ప్రయత్నాలు చేసారు.ఈ ఆస్తి అంత ఒక్కదగ్గరే ఉండాలని దాన్ని ముక్కలు చేయవద్దు అని రాఘవయ్య భావించాడు.అలా కొడుకులకు చెప్పాడు అయినా వాళ్ళు వినలేదు.రాఘవయ్య కొడుకులకు బుద్ది చెప్పాలని ఒకరోజు కొడుకులకు నాలుగు కట్టెలు తెమ్మన్నాడు .అందరిని నిలబెట్టాడు, ఒక్కొక్కరిని ఆ కట్టెలు విరగగొట్టమన్నాడు.అందరూ విరిచేశారు.తర్వాత అందరి చేతుల నుండి కట్టెలు తీసుకొని ఒక కట్టలాగా కట్టాడు.దానిని విరవమన్నాడు,అందరూ ప్రయత్నించారు.ఒక్కరు కూడా విరవలేక పోయారు.అప్పుడు రాఘవయ్య చూసారా మీరు ఒక్కొక్కరుగా ఉంటే మీకు నష్టం కలుగుతుంది మిమ్మలను ఎవరు విడదీయగలుగుతారు,అదే మీరు ఉమ్మడిగా ఉంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అందుకే కలిసి ఉంటే కలదు సుఖం , ఐకమత్యమే మహాబలం .