Skip to main content

Posts

Showing posts with the label పురాణ కథలు

భీష్మ ప్రతిజ్ఞ వెనుక ఉన్న కారణం ఏమిటి?

భీష్ముడి కథ మహాభారతంలో చాలా మంది గొప్పవారు ఉన్నారు కానీ , తండ్రి   సంతోషం కోసం   రాజ్యాన్ని, సింహాసనాన్ని, చివరకు తన వివాహ జీవితాన్ని కూడా త్యాగం చేసిన మహానుభావుడు భీష్ముడు . అందుకే ఆయనను భీష్మ పితామహుడు అని గౌరవంగా పిలుస్తారు. ఏదైనా త్యాగం చేస్తే దానివల్ల వచ్చే లాభ నష్టాలను కూడా బేరీజు వేసుకోగలగాలి .  తండ్రి  కోసం ఆజన్మ బ్రహ్మచారిగా మారి పోయాడు భీష్ముడు. భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారిగా వుండాల్సిన అవసరం ఏమొచ్చింది అని   ఈ కథ ద్వారా  వివరంగా తెలుసుకుందాం. పూర్వం హస్తినాపురాన్ని శంతన మహారాజు పరిపాలించేవారు. ఒకరోజు ఆయన గంగానది తీరంలో అందమైన స్త్రీని చూశారు. ఆమె గంగాదేవి. ఆమె అందానికి ముగ్ధుడైన శంతనుడు వివాహం చేసుకోవాలని కోరాడు. అప్పుడు గంగాదేవి ఒక షరతు పెట్టింది. "మహారాజా! నేను చేసే ఏ పనినీ మీరు ప్రశ్నించకూడదు. నన్ను ఎప్పుడూ అడ్డుకోకూడదు" అని చెప్పింది. అప్పుడు ఆమెను వివాహం చేసుకోవడానికి  శంతనుడు అందుకు అంగీకరించాడు.  గంగా శంతనులు  సంతోషంగా ఉన్నారు వారికి ఒక్కొక్కరుగా    ఏడుగురు పిల్లలు పుట్టారు. కానీ గంగాదేవి ప్రతి బ...