Skip to main content

Posts

Showing posts from August, 2026

ఓనం పండగ(onam festival)

తెలుగు వారికి ఉగాది నుండి నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది , మహారాష్ట్ర వారికి  గుడి పడవా తో నూతన సంవత్సరం అలాగే కేరళ వాళ్లకు ఓనం అనేది కొత్త సంవత్సరం. ఓనం పండుగను దేవభూమిగా ప్రసిద్ధి గాంచిన కేరళ వాసులు రాజైన బలి చేసిన త్యాగానికి చిహ్నంగా జరుపుకుంటారు. హస్త నక్షత్రం ఆధ్వర్యంలో అవని మాసంలో ఈ పండుగను చితిరాయ్, స్వాతి, విశాకం, అనుసం, కెట్టై, మూలం, పురాదం, ఉత్దానం మరియు తిరువొనం పది నక్షత్రాల పది రోజులపాటు ఎంతో వైభవంగా చేసుకుంటారు. మళయాళీల తోలి పండుగ ఓనం. కేరళ ఘనమైన సంస్కృతి సాంప్రదాయాలకు వారసత్వంగా ఈ పండుగని పది రోజులు నిర్వహిస్తారు. బలి చక్రవర్తి ఆగమనాన్ని పురస్కరించుకొని కేరళ వాసులు ఓనం పండుగని సంబరాల మధ్య జరుపుకుంటారు. మహా బలిచక్రవర్తి ఆ రోజున రసాతలం నుంచి దేవభూమి కేరళలో ఆత్మ రూపిగా వస్తాడని ప్రజల విశ్వాసము. తమ ఇళ్ళలోకి బలి చక్రవర్తిని ఆహ్వానించడానికి ఇంటి ముందు రంగు రంగు పూలతో ముగ్గులు వేసి అలంకరణ చేస్తారు. వీటిని "పుగలం" అంటారు. ఇంక ముగ్గులలో దీపాలు ఉంచి స్త్రీలు, యువతులు తెల్లనివస్త్రాలు బంగారురంగు అంచుతో వున్నవి ధరించి ఆ ముగ్గుల చుట్టూ ఆడి పాడతారు. "కైకుట్...

బోనాల జాతర విశేషాలు

ఆషాఢ మాసం మొదలుకొని శ్రావణ మాసం చివరి ఆది లేక గురువారం వరకు తెలంగాణా అంతటా ఎంతో కన్నుల పండగగా జరిగే పండగ బోనాల పండగ . ఇది తెలంగాణా రాష్ట్ర పండగ. ఈ పండగ   తెలంగాణ రాష్ట్రంలో అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ పండగ ప్రతి ఇంట్లో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది .   ఆషాఢ మాస బోనాలు గోల్కొండ కోటలో వెలసిన జగదాంబిక అమ్మవారితో మొదలవుతాయి . తర్వాత బల్కంపేట ఎల్లమ్మ తల్లికి రెండవ బోనం సమర్పిస్తారు . ఇక్కడ అమ్మవారి కళ్యాణం కూడా కన్నులపండుగగా జరుగుతుంది . ఆ తర్వాత వచ్చే ఆదివారం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి సమర్పిస్తారు, ప్రతి గుడికి బంగారు పాత్రలో బోనాన్ని సమర్పిస్తారు బోనంతో పాటు ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు తీసుకొని వెళ్తారు. భక్తులు కూడా ఆ ప్రాంతానికి చెందిన వారు బోనాలు తీసుకొని వెళ్తారు.ఆషాఢమాసం నాల్గవ వారం హైదరాబాద్ అంతటా ఈ ఉత్సవాలు జరుగుతాయి. శ్రావణమాసం మొదటి వారం నుండి హైదరాబాద్ చుట్టు పక్కల గ్రామాల్లో ఈ ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. ఇది కూడా నాలుగు వారాల పాటు జరుగుతుంది . అసలు ఈ బోనాల పండగకు ఎందుకు ఇంత ప్రాధాన్యం ఉంది అనేది తెలుసుకుందాం. ప్రతి పండగ ...

స్నేహం అంటే ఇదే – శ్రీకృష్ణుడు, కుచేలుడి స్నేహం

ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి ఆదివారం రోజున భారతదేశంలో స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆ రోజు ప్రతి ఒక్కరి వాట్సాప్ స్టేటస్‌లు “స్నేహమేరా జీవితం… స్నేహమేరా శాశ్వతం…” అనే పాటతో మార్మోగిపోతుంటాయి. మనకు మనమే ఉత్తమమైన, ఆదర్శమైన స్నేహితులమని అనుకుంటాం. స్నేహితులంతా ఒకచోట చేరి, తమకు ఇష్టమైన వారితో సరదాగా సమయాన్ని గడుపుతారు. కానీ ప్రపంచంలో స్నేహానికి నిజమైన అర్థాన్ని తెలియజేసే ఎన్నో గొప్ప కథలు ఉన్నాయి. అలాంటి కథల్లో “స్నేహం అంటే ఇదే” అని మనకు తెలియజేసే గొప్ప పురాణ కథ — శ్రీకృష్ణుడు, కుచేలుడి స్నేహం. గురుకులంలో మొదలైన స్నేహం సాందీపని మహర్షి ఆశ్రమంలో శ్రీకృష్ణుడు, కుచేలుడు (సుదాముడు) కలిసి విద్యాభ్యాసం చేశారు. చిన్నప్పటి నుంచే వారిద్దరి మధ్య ఎంతో ఆత్మీయమైన స్నేహం ఏర్పడింది. ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా వారి స్నేహం బలపడింది. కాలం గడిచింది. ఇద్దరూ పెద్దయ్యారు. శ్రీకృష్ణుడు ద్వారకకు రాజయ్యాడు. కుచేలుడు మాత్రం తన గ్రామంలో దొరికిన పని చేసుకుంటూ సాధారణ జీవితాన్ని గడపసాగాడు. అతనికి వివాహం జరిగింది. కొంతకాలానికి పిల్లలు కూడా కలిగారు. కానీ రోజులు గడిచేకొద్దీ కుచేలుడి కుటుంబం తీవ్రమైన ...