ఫిబ్రవరి 21 రోజు అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం అని ఎంతమందికి తెలుసు . మాతృభాష అంటే మనము మాట్లాడే భాష కానీ మనం ఎంతవరకు ఆ తల్లి భాషకు దగ్గరగా ఉన్నాము ఎవరికి తెలియదు, తెలిసినా కూడా దానిని పట్టించుకోరు. భాష అనేది భావ వ్యక్తీకరణ ప్రక్రియ , మనము మన మనసులో వున్న భావాలను ఎదుటి వారికి అర్థం అయ్యేలా చెప్పడం . ప్రపంచవ్యాప్తంగా రకరకాల భాషలు అందుబాటులో ఉన్నాయి ఓ ఇంగ్లీష్ అనే భాష ప్రపంచ భాషగా ప్రసిద్ధి చెందింది ఇంగ్లీష్ , హిందీ , తర్వాత అత్యధిక సంఖ్యలో మాట్లాడే భాష తెలుగు . మాతృభాషలో మాట్లాడితే వచ్చే ఆనందం గురించి ఒక చిన్న ఉదాహరణ. మా అమ్మమ్మ తాత వాళ్ళు మహారాష్ట్రలో రైల్వే ఉద్యోగం చేసేవాళ్ళు ప్రతి సంవత్సరం సెలవులకు నేను అక్కడికి వెళ్లేదాన్ని .అక్కడ మార్కెట్ కి గాని, గుడికి గానీ వెళ్ళినప్పుడు అక్కడ మన భాష మాట్లాడే వాళ్ళు ఒక్కరు కనిపించినా మనకు చాలా సంతోషంగా దగ్గరకు వెళ్ళి కొద్ది సేపు మాట్లాడి వచ్చేది.నిజంగా వేరే ప్రాంతానికి వెళ్లినపుడు మన బాషలో మాట్లాడితే ఆ ఆనందమే వేరు. మాతృభాష ప్రతి చిన్న భావాన్ని చాలా స్పష్టంగా వ్యక్తపరచగలిగే సాధనం. ప...
“చిన్న నీతి కథలు” బ్లాగ్లో పిల్లల కోసం సరదాగా చదవడానికి తెలుగు నీతి కథలు, జంతువుల కథలు, స్నేహం కథలు మరియు ప్రేరణాత్మక కథలు అందుబాటులో ఉంటాయి. ప్రతి కథలో ఒక మంచి నీతి ఉంటుంది, ఇది పిల్లలకి మంచి అలవాట్లు నేర్పుతుంది. Discover the best Telugu moral stories, short stories for kids, and inspirational stories in Telugu.