హోళీ ఎందుకు జరుపుకుంటారు
హోళీ పండుగ శుభాకాంక్షలు మై డియర్ బ్లాగు రీడర్స్ . భారతదేశంలో జరిగే ప్రతి పండగకు ఒక ప్రాధాన్యత ఉంటుంది .హోళీ రంగుల పండగ చిన్న పెద్ద తేడా లేకుండా అందరు ఈ పండగను రంగులు చల్లుకుంటూ , మిఠాయిలు తినిపించుకుంటూ చాలా సంబరాలు చేసుకుంటారు. హోళీ పండగ జరుపుకోవడానికి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రతి పండగలో అంతరార్థం చెడుపై మంచి సాధించిన విజయం లేక ఆధ్యాత్మికత ఇమిడి ఉంటాయి. విష్ణుపురాణం ప్రకారం హిరణ్యకశిపుడు చాలా కాలం తపస్సు చేసి బ్రహ్మ దగ్గర ఒక వరం పొందాడు.అతను ఎలాగైనా చావకుండా ఉండాలని దేవతలతో గానీ,రాక్షసులతో గాని,అస్త్రము,శస్త్రము లతో గానీ ,పగలు కానీ , రాత్రి కానీ, నేలమీద కానీ ఆకాశం మీద కానీ ,ఇంటిలోపల ,బయట కానీ జంతువులతో కానీ ,మనుషులతో కానీ ఇలా ఎవరి వల్ల చావులేకుండా వరాన్ని పొందాడు.ఈ వర గర్వంతో హిరణ్యకశిపుడు లోకాలను బాధపెట్ట సాగాడు. అతనికి ఒక కొడుకు పుట్టాడు ఆ బాలుడికి ప్రహ్లాదుడు అని పేరు పెట్టారు.అతను గురుకులంలో చదువుకుంటున్నప్పుడు విష్ణువు మీద భక్తి కలిగింది శ్రీ మహావిష్ణువు లీలలు తెలుసుకున్న ప్రహ్లాదుడు విష్ణువు తప్ప ఎవరు గొప్ప కాదు అని అంటుండేవ...