Skip to main content

భీష్మ ప్రతిజ్ఞ వెనుక ఉన్న కారణం ఏమిటి?

భీష్ముడి కథ

మహాభారతంలో చాలా మంది గొప్పవారు ఉన్నారు కానీ , తండ్రి 
 సంతోషం కోసం  రాజ్యాన్ని, సింహాసనాన్ని, చివరకు తన వివాహ జీవితాన్ని కూడా త్యాగం చేసిన మహానుభావుడు భీష్ముడు . అందుకే ఆయనను భీష్మ పితామహుడు అని గౌరవంగా పిలుస్తారు. ఏదైనా త్యాగం చేస్తే దానివల్ల వచ్చే లాభ నష్టాలను కూడా బేరీజు వేసుకోగలగాలి .  తండ్రి  కోసం ఆజన్మ బ్రహ్మచారిగా మారి పోయాడు భీష్ముడు.

భీష్ముడు ఆజన్మ బ్రహ్మచారిగా వుండాల్సిన అవసరం ఏమొచ్చింది అని   ఈ కథ ద్వారా  వివరంగా తెలుసుకుందాం.

పూర్వం హస్తినాపురాన్ని శంతన మహారాజు పరిపాలించేవారు. ఒకరోజు ఆయన గంగానది తీరంలో అందమైన స్త్రీని చూశారు. ఆమె గంగాదేవి.

ఆమె అందానికి ముగ్ధుడైన శంతనుడు వివాహం చేసుకోవాలని కోరాడు.

అప్పుడు గంగాదేవి ఒక షరతు పెట్టింది.

"మహారాజా! నేను చేసే ఏ పనినీ మీరు ప్రశ్నించకూడదు. నన్ను ఎప్పుడూ అడ్డుకోకూడదు" అని చెప్పింది. అప్పుడు ఆమెను వివాహం చేసుకోవడానికి శంతనుడు అందుకు అంగీకరించాడు.

 గంగా శంతనులు  సంతోషంగా ఉన్నారు వారికి ఒక్కొక్కరుగా    ఏడుగురు పిల్లలు పుట్టారు. కానీ గంగాదేవి ప్రతి బిడ్డ పుట్టిన వెంటనే గంగానదిలో విడిచిపెట్టేది.

శంతనుడు తన మాటకు కట్టుబడి మౌనంగా ఉండిపోయాడు.

ఎనిమిదవ బిడ్డ పుట్టినప్పుడు మాత్రం ఆయన తట్టుకోలేక గంగాదేవిని ప్రశ్నించాడు.ఆమెకు కోపం వచ్చింది వాళ్ళు అష్ట వసువులు శాప విమోచనం కోసం అందర్నీ అలా చేశాను అని చెప్పి
 ఆ బాలుడిని తీసుకొని వెళ్లిపోయింది.
 ఒకరోజు గంగా నది ఒడ్డున కూర్చోని విచారిస్తున్న శంతను దగ్గరికి గంగ వచ్చి దేవవ్రతుడిని అప్పగించింది.ఆమె వెళ్ళిపోయింది .
ఇతడే భవిష్యత్తులో భీష్ముడిగా ప్రసిద్ధి చెందాడు.

ఒకరోజు శంతన మహారాజు   వేటకు వెళ్ళాడు  . అక్కడ చేపల చెరువు ఉంది కానీ మంచి గంధపు వాసన అతడిని ఆకర్షించింది ,అలా వెళ్ళి చూడగా    సత్యవతి అనే యువతి ఉంది .   ఆమెను వివాహం చేసుకోవాలని అనుకున్నాడు. వెళ్ళి అడిగాడు ఆమె తన తండ్రి దాశరాజు ను అడగమని చెప్పింది.
కానీ సత్యవతి తండ్రి ఒక షరతు పెట్టాడు.

"నా కుమార్తెకు పుట్టే పిల్లలే హస్తినాపురానికి రాజులు కావాలి" అని కోరాడు. అది విని నా కొడుకుకి అన్యాయం జరుగుతుందని శంతనుడు తిరిగి వచ్చాడు. 


  ఈ విషయం తెలుసుకున్న     దేవవ్రతుడు సత్యవతి తండ్రి దగ్గరకు వెళ్లి, తనకు రాజ్యంపై ఎలాంటి ఆశ లేదని, సత్యవతి కుమారులే రాజులు అవుతారని మాట ఇచ్చాడు.

అయినా సత్యవతి తండ్రికి ఒక సందేహం మిగిలింది.

"నీకు పిల్లలు పుడితే వారు భవిష్యత్తులో రాజ్యాన్ని కోరుకోరా?" అని అడిగాడు.

అప్పుడు దేవవ్రతుడు అందరి ముందు ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు.

"నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాను. ఎప్పటికీ వివాహం చేసుకోను. నాకు సంతానం కలగదు" అని ప్రతిజ్ఞ చేశాడు.

దేవతలు సైతం ఆశ్చర్యపోయేలా చేసిన ఆ ప్రతిజ్ఞకు మెచ్చి ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది.

ఆ భయంకరమైన ప్రతిజ్ఞ చేసిన కారణంగా దేవవ్రతుడు భీష్ముడు అనే పేరు పొందాడు.

 భీష్ముడికి లభించిన వరం

తన కుమారుడు తన కోసం ఇంతటి గొప్ప త్యాగం చేయడం చూసి శంతన మహారాజు ఎంతో బాధపడ్డాడు. అదే సమయంలో కుమారుడి త్యాగానికి ముగ్ధుడయ్యాడు.తన కుమారుడికి ఒక గొప్ప వరం ఇచ్చాడు.

"నీకు ఎప్పుడు మరణం రావాలో నువ్వే నిర్ణయించుకోగలవు" అని వరమిచ్చాడు.
దీనినే ఇచ్ఛా మరణం అంటారు.
  
ఇప్పటిదాకా అంతా మంచే జరిగింది కానీ ఇప్పుడు మొదలైంది అసలు కథ.సత్యవతికి ఇద్దరూ  కుమారులు కలిగారు వారు చిత్రాంగదుడు , విచిత్రవీర్యుడు.
చిత్రాంగదుడి కి వివాహం కాలేదు అతడు ఒక గంధర్వ రాజుతో యుద్ధంలో పాల్గొని వీరమరణం చెందాడు.
విచిత్రవీర్యుడు భోగాలలసుడు అతడు చిత్రాంగదుడు తర్వాత రాజు అయ్యాడు. కానీ పాలన అంత భీష్ముడు , సత్యవతి చూసుకునేవాళ్ళు.
ఎలాగైనా సత్యవతి  చిత్రాంగదుడికి పెళ్లి చేయాలని అని అనుకుంది . కాశి రాజు కుమార్తెలకు స్వయంవరం అని హస్తినాపురానికి ఆహ్వానం వచ్చింది.
సత్యవతి భీష్ముడిని హస్తినాపురం తరపున వెళ్ళమని ఆదేశించింది.
భీష్ముడు స్వయంవరంలో అంబ,అంబికా, అంబాలికలను గెలుచుకున్నాడు.అంబ వేరే రాజుని ప్రేమించింది అది తెలియకుండా భీష్ముడు ఆమెను హస్తినాపురానికి తీసుకొని వచ్చాడు.అంబికా అంబాలికలను విచిత్రవీర్యుడుకి  ఇచ్చి వివాహం జరిపించారు.
అంబ ను మళ్ళీ తిరిగి తను ప్రేమించిన రాజు దగ్గరికి పంపించాడు భీష్ముడు ,కానీ అతడు నువ్వు గెలుచుకున్న దానిని నేను చేసుకొను అని పంపించి వేశాడు.అంబ భీష్ముడిని నా జీవితం ఇలా అవడానికి నువ్వే కారణం కాబట్టి నువ్వే చేసుకో అని అడిగింది, తన ప్రతిజ్ఞ గురించి చెప్పాడు ఆమె అయినా పర్లేదు చేసుకో అన్నది కానీ భీష్ముడు వినలేదు .ఆమె తన జీవితాన్ని నాశనం చేసినందుకు గాను భీష్ముడి మీద కోపంతో తీవ్రమైన తపస్సు చేసింది.శివుడు ప్రత్యక్షమై వరం కోరుకో అన్నాడు , భీష్ముడి మీద పగ తీర్చుకోవడానికి నాకు వరం కావాలి అన్నది కానీ శివుడు అతడికి  స్వచ్ఛంద
 మరణం ఉంది కాబట్టి అతడు కోరుకున్నపుడే మరణిస్తాడు.అంబ ఇంకొక జన్మలో ద్రుపద రాజుకి  శిఖండి అనే కూతురుగా జన్మించింది. 
కాలం గడిచింది, అంబ ,అంబాలిక లకు పాండురాజు,ధృత రాష్ట్రుడు జన్మించారు. వారిరువురి మధ్య ఆధిపత్య పోరు మొదలైంది దృతరాష్ట్రుడు పెద్దవాడైన కూడా గుడ్డివాడు అవడం వల్ల అతనికి రాజ్యాధికారం దక్కలేదు. ధృతరాష్ట్రుడి పెళ్లి గాంధారి తో జరిగింది  ఆ విషయం గాంధార రాజుకి నచ్చలేదు. హస్తినాపురానికి వచ్చి అన్నదమ్ముల మధ్య వివాదం రాజేశాడు.ఆ వివాదం ఒక స్త్రీ కి ఘోర అవమానంగా మారింది అలాంటి సమయంలో కూడా భీష్ముడు ఎవరిని ఏం చేయలేకపోయాడు.

 పాండవులు, కౌరవుల మధ్య రాజ్యవివాదం పెరిగి చివరకు కురుక్షేత్ర యుద్ధానికి దారితీసింది.

భీష్ముడు కౌరవుల సైన్యానికి సేనాధిపతిగా బాధ్యతలు చేపట్టాడు.

అయితే ఆయనకు పాండవులంటే ఎంతో ప్రేమ. వారిని చంపాలని ఆయన మనసులో లేదు.

కానీ హస్తినాపుర సింహాసనానికి చేసిన ప్రతిజ్ఞ కారణంగా కౌరవుల పక్షాన యుద్ధం చేయాల్సి వచ్చింది.

భీష్ముడి పరాక్రమానికి పాండవ సైన్యం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది.

చివరకు శ్రీకృష్ణుడి సలహాతో అర్జునుడు శిఖండిని ముందుంచుకుని భీష్ముడిపై బాణాలు సంధించాడు.

భీష్ముడు శిఖండిపై ఆయుధాలు ప్రయోగించలేదు. అర్జునుడి బాణాలకు గాయపడి నేలపై పడిపోయాడు.

కానీ ఆయన శరీరం నేలను తాకలేదు. వేలాది బాణాలపై పడుకున్నాడు.

దీనినే అంపశయ్య అంటారు.
భీష్ముడికి ఇచ్ఛా మరణం వరం ఉండటంతో వెంటనే ప్రాణాలు విడిచిపెట్టలేదు.

ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు అంపశయ్యపైనే ఉన్నాడు.

ఆ సమయంలో శ్రీకృష్ణుడు, పాండవులు ఆయనను దర్శించడానికి వచ్చారు.

యుధిష్ఠిరుడికి రాజధర్మం, నీతి ధర్మం, జీవిత సత్యాలు వంటి ఎన్నో విషయాలను బోధించాడు.

భీష్ముడు చెప్పిన ఈ ధర్మబోధలే మహాభారతంలోని శాంతిపర్వం, అనుశాసన పర్వాల్లో ముఖ్యమైన భాగంగా ఉన్నాయి.

చివరకు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చినప్పుడు శ్రీకృష్ణుడిని స్మరిస్తూ తన ప్రాణాలను విడిచిపెట్టాడు.

 నీతి.

భీష్ముడి జీవితం మనకు ఎన్నో విషయాలను నేర్పిస్తుంది.

* తల్లిదండ్రుల పట్ల ప్రేమ, గౌరవం కలిగి ఉండాలి.

* ఇచ్చిన మాటకు విలువ ఇవ్వాలి.

* త్యాగం గొప్ప లక్షణం.

* ఎంతటి గొప్పవారైనా ధర్మాన్ని అనుసరించడం ముఖ్యం.

* మన నిర్ణయాలు భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో ఆలోచించాలి.

భీష్ముడి జీవితం త్యాగానికి ప్రతీక అయినప్పటికీ, ఆయన కథ మనకు మరో ముఖ్యమైన పాఠాన్ని కూడా నేర్పిస్తుంది. మనం ఇచ్చే మాట ఎంత గొప్పదైనా, అది ధర్మానికి అనుగుణంగా ఉందా లేదా అని ఆలోచించడం చాలా అవసరం.



Comments

Popular posts from this blog

రైతు కథ..

ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు  డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి  తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా  ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి  దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా! ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా. కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా. మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల  లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి  ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా.     అనగనగా ఒక ఊర...

చిలుక జింక స్నేహం నీతి కథ (True Friendship Story in Telugu)

అనగనగా ఒక అందమైన అడవిలో ఓ చురుకైన చిలుక, ఒక అమాయక జింక ఉండేవి. ఆ ఇద్దరూ ఎంతో మంచి స్నేహితులు. ప్రతిరోజూ కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ, దూరంగా వెళ్లి తిండి వెతుక్కొని వచ్చేవి. ఒకరోజు చిలుకకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. “మనకు ప్రతిసారి తిండి కోసం తిరగాల్సి వస్తోంది. మనమే ఒక చిన్న తోట పెంచుకుంటే ఎలా ఉంటుంది?” అని జింకను అడిగింది. జింకకు ఆ ఆలోచన చాలా నచ్చింది. “అవును! మనమే పండ్లు పెంచుకుంటే ఎప్పుడైనా తినవచ్చు” అని ఆనందంగా చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రదేశాన్ని ఎంచుకుని గింజలు వేశారు. చిలుక ప్రతిరోజూ వచ్చి చూసేది కానీ పని మాత్రం చేయకుండా తప్పించుకునేది. జింక మాత్రం ఎంతో కష్టపడి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ, మొక్కలను జాగ్రత్తగా పెంచింది. కొన్ని రోజుల తర్వాత మొక్కలు పెద్దవై అందమైన పండ్లతో నిండిపోయాయి. అప్పుడు చిలుక వచ్చి, “ఇది మన ఇద్దరి తోట కదా! పండ్లు ఇద్దరం పంచుకుందాం” అని చెప్పింది. జింక కొంచెం కోపంగా నవ్వుతూ, “పని చేసేప్పుడు కనిపించలేదు, కానీ తినేప్పుడు మాత్రం వచ్చావు! స్నేహం అంటే మాటల్లో కాదు… పని చేసినప్పుడు కూడా కలిసి ఉండాలి” అని చెప్పింది. చిలుక తన తప్పు అర్థం చేసుకుంది. “ఇక మీదట...

ఐకమత్యమే మహాబలం.

ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ఆస్తిపరుడు. అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు, వారు అంత పిల్లపాపాలతో సుఖంగా జీవించేవారు.కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య ఆరోగ్యం చెడిపోయింది తన తర్వాత ఆస్తిని చూసుకోవడానికి తన కొడుకులకు అప్పజెప్పాలని అనుకుంటాడు. వారంతా ఎవరికి వారు నాకే దక్కాలని ప్రయత్నాలు చేసారు.ఈ ఆస్తి అంత ఒక్కదగ్గరే ఉండాలని దాన్ని ముక్కలు చేయవద్దు అని రాఘవయ్య భావించాడు.అలా కొడుకులకు చెప్పాడు అయినా వాళ్ళు వినలేదు.రాఘవయ్య కొడుకులకు బుద్ది చెప్పాలని ఒకరోజు కొడుకులకు నాలుగు కట్టెలు తెమ్మన్నాడు .అందరిని నిలబెట్టాడు, ఒక్కొక్కరిని ఆ కట్టెలు విరగగొట్టమన్నాడు.అందరూ విరిచేశారు.తర్వాత అందరి చేతుల నుండి కట్టెలు తీసుకొని ఒక కట్టలాగా కట్టాడు.దానిని విరవమన్నాడు,అందరూ ప్రయత్నించారు.ఒక్కరు కూడా విరవలేక పోయారు.అప్పుడు రాఘవయ్య చూసారా మీరు ఒక్కొక్కరుగా ఉంటే మీకు నష్టం కలుగుతుంది మిమ్మలను ఎవరు విడదీయగలుగుతారు,అదే మీరు ఉమ్మడిగా ఉంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అందుకే కలిసి ఉంటే కలదు సుఖం , ఐకమత్యమే మహాబలం .