Skip to main content

శని - శివ - హనుమంతుడు కథ

ఒకరోజు పరమశివుడికి ఉదయాన్నే ఒక కల వచ్చింది. ఆ కలలో శని భగవానుడు నేను నిన్ను ముప్ప తిప్పలు పెడతా   ఈ  రోజు సాయంత్రం వరకు కనీసం 4 నుండి 5 గంటలు అని చెప్పాడు . శని భగవానుడు ఎంతటి వారినైనా ముప్ప తిప్పలు పెడతారు అని తెలిసిన మహా శివుడు ఎలాగైనా తప్పించుకోవాలని అనుకున్నాడు . ఆ రోజు తొందరగా స్నానం చేసి కూర్చొని ఆలోచించసాగాడు ఎలాగైనా శని నుండి  తప్పించుకోవాలి అని , సమయం గడుస్తుంది . వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది , శివుడు పార్వతిని వాళ్ళ బంధువుల ఇంటికి , పిల్లలను స్నేహితులతో ఆడుకోవడానికి పంపించి వేశాడు.
ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు అతను కూడా అలా కూర్చోకుండా ఒక గుంత తీసి దానిలో కూర్చుని మూత పెట్టుకున్నాడు.ఆ గుంతలో మొత్తం తడిగా ఉండి  ఒకటే వాసన  అయినా కూడా  ఆ గుంతలోనే సాయంత్రం వరకు కూర్చున్నాడు . సాయంత్రం 6 దాటింది అని నిర్ధారించుకున్న తర్వాత బయటికి  వచ్చాడు .బయటకు వచ్చి హమ్మయ్య శనికి నేను దొరకలేదు అతడు నన్ను పట్టుకోలేదు అని తనకు తానే గర్వంగా కూర్చున్నాడు.అతనికి ఎదురుగా శని దేవుడు కూర్చొని ఉండడం చూసి , మహాశివుడు గట్టిగా నవ్వాడు ఏమయ్యా  శని నన్ను పట్టి పీడిస్తా అన్నావు నువ్వు రానే రాలేదు సమయం ఐపోయింది కదా అన్నాడు. అయ్యో శివా నువ్వు ఎంత అమాయకుడివి నేను నిన్ను ఎక్కడ పట్టుకుంట అని నువ్వే  నీ భార్యాబిడ్డలనూ బయటకు పంపావు , నువ్వేమో ఎంత కంపు కొట్టినా కూడా  ఆ గుంతలో కూర్చున్నావు ఇంతసేపు, ఇది నా ప్రభావమే అని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు అన్నాడు.శివుడు తెల్లబోయాడు, తేరుకొని నువ్వు అసాధ్యుడివి  శని అన్నాడు. 
శివుడిని కూడా పీడించానని గర్వంతో శనిదేవుడు విర్రవీగుతున్నాడు  , అతని గర్వాన్ని అణచాలని నారదుడు అనుకున్నాడు .ఒకరోజు శని దగ్గరకు వెళ్ళి నువ్వు ఎవరితోనైనా తలపాడు కానీ హనుమంతుడితో మాత్రం వద్దు అన్నాడు .శని అసలే విజయ గర్వంతో ఉన్నాడు ఎలాగైనా హనుమంతుడిని పట్టి శని ప్రభావం చూపిస్తే అందరి కన్నా నేను గొప్పవాడిని  అవుతాను అనుకున్నాడు.హనుమంతుడు సేతు ప్రదక్షిణం చేస్తున్నాడు ఆయనను చూసి నేను నిన్ను పట్టుకుంటాను అన్నాడు శనీశ్వరుడు. హనుమ , ఇప్పుడు నేను రామకార్యంలో ఉన్నా ఇది సరిఅయిన సమయం కాదు తర్వాత పట్టుకుందువులే అన్నాడు. 
దాంతో శనీశ్వరుడుకి మరింత పట్టుదల పెరిగింది  మరల హనుమను విసిగించసాగాడు.ఎన్నిసార్లు హెచ్చరించినా వినకుండా అలాగే ప్రవర్తిస్తుండటంతో ఆగ్రహించాడు హనుమంతుడు . సేతు ప్రదక్షిణం చేస్తూనే తన తోకతో  శనిని బంధించి రాళ్ళురప్పలకేసి తిప్పి తిప్పి కొడుతూ ముప్పతిప్పలు పెట్టసాగాడు . దాంతో శనీశ్వరుడికి ఒళ్ళంతా గాయలవుతున్నాయి ఆ బాధ భరించలేక ఆంజనేయా ! మహాప్రభూ ! నన్ను వదిలిపెట్టు  మరెప్పుడూ నీ జోలికి రాను అని శనీశ్వరుడు బతిమిలాడాడు.కానీ ఆంజనేయుడు తన తోకతో హింసించసాగాడు.శనీశ్వరుడు మళ్ళీ మళ్ళీ ప్రాధేయపడగా హనుమంతుడు నువ్వు నా జోలికి గానీ నా భక్తుల జోలికి గాని రానని  , ఎవరిని ఈ విధంగా ఇబ్బంది పెట్టనని నాకు మాట ఇస్తేనే వదిలి పెడతా అన్నాడు,  సరే అన్నాడు శనీశ్వరుడు.అందువల్ల శని ప్రభావం వున్నప్పటికీ ఆంజనేయ స్వామిని ఆరాధించేవారికి సమస్యలు ఎదురవవు.శనీశ్వరుడు తన గాయాలకు నువ్వుల నూనె రాసుకొని ఉపశమనం పొందాడు .ఆ కారణంగా శనీశ్వర శాంతి కోసం నువ్వులనూనెతో అభిషేకం చేస్తారు. 
తాడినీ తన్నేవాడు ఒకడు అయితే వాడి తల తన్నేవాడు ఒకడు ఉంటాడు అంటారు పెద్దలు . మనకు బలం అధికారం ఉన్నాయి కదా అని ఒకరిని ఇబ్బంది పెడితే మనకు అదే పరిస్థితి ఎదురు అవ్వొచు జాగ్రత్త.





Comments

Post a Comment

Popular posts from this blog

రైతు కథ..

ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు  డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి  తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా  ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి  దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా! ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా. కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా. మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల  లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి  ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా.     అనగనగా ఒక ఊర...

చిలుక జింక స్నేహం నీతి కథ (True Friendship Story in Telugu)

అనగనగా ఒక అందమైన అడవిలో ఓ చురుకైన చిలుక, ఒక అమాయక జింక ఉండేవి. ఆ ఇద్దరూ ఎంతో మంచి స్నేహితులు. ప్రతిరోజూ కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ, దూరంగా వెళ్లి తిండి వెతుక్కొని వచ్చేవి. ఒకరోజు చిలుకకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. “మనకు ప్రతిసారి తిండి కోసం తిరగాల్సి వస్తోంది. మనమే ఒక చిన్న తోట పెంచుకుంటే ఎలా ఉంటుంది?” అని జింకను అడిగింది. జింకకు ఆ ఆలోచన చాలా నచ్చింది. “అవును! మనమే పండ్లు పెంచుకుంటే ఎప్పుడైనా తినవచ్చు” అని ఆనందంగా చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రదేశాన్ని ఎంచుకుని గింజలు వేశారు. చిలుక ప్రతిరోజూ వచ్చి చూసేది కానీ పని మాత్రం చేయకుండా తప్పించుకునేది. జింక మాత్రం ఎంతో కష్టపడి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ, మొక్కలను జాగ్రత్తగా పెంచింది. కొన్ని రోజుల తర్వాత మొక్కలు పెద్దవై అందమైన పండ్లతో నిండిపోయాయి. అప్పుడు చిలుక వచ్చి, “ఇది మన ఇద్దరి తోట కదా! పండ్లు ఇద్దరం పంచుకుందాం” అని చెప్పింది. జింక కొంచెం కోపంగా నవ్వుతూ, “పని చేసేప్పుడు కనిపించలేదు, కానీ తినేప్పుడు మాత్రం వచ్చావు! స్నేహం అంటే మాటల్లో కాదు… పని చేసినప్పుడు కూడా కలిసి ఉండాలి” అని చెప్పింది. చిలుక తన తప్పు అర్థం చేసుకుంది. “ఇక మీదట...

ఐకమత్యమే మహాబలం.

ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ఆస్తిపరుడు. అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు, వారు అంత పిల్లపాపాలతో సుఖంగా జీవించేవారు.కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య ఆరోగ్యం చెడిపోయింది తన తర్వాత ఆస్తిని చూసుకోవడానికి తన కొడుకులకు అప్పజెప్పాలని అనుకుంటాడు. వారంతా ఎవరికి వారు నాకే దక్కాలని ప్రయత్నాలు చేసారు.ఈ ఆస్తి అంత ఒక్కదగ్గరే ఉండాలని దాన్ని ముక్కలు చేయవద్దు అని రాఘవయ్య భావించాడు.అలా కొడుకులకు చెప్పాడు అయినా వాళ్ళు వినలేదు.రాఘవయ్య కొడుకులకు బుద్ది చెప్పాలని ఒకరోజు కొడుకులకు నాలుగు కట్టెలు తెమ్మన్నాడు .అందరిని నిలబెట్టాడు, ఒక్కొక్కరిని ఆ కట్టెలు విరగగొట్టమన్నాడు.అందరూ విరిచేశారు.తర్వాత అందరి చేతుల నుండి కట్టెలు తీసుకొని ఒక కట్టలాగా కట్టాడు.దానిని విరవమన్నాడు,అందరూ ప్రయత్నించారు.ఒక్కరు కూడా విరవలేక పోయారు.అప్పుడు రాఘవయ్య చూసారా మీరు ఒక్కొక్కరుగా ఉంటే మీకు నష్టం కలుగుతుంది మిమ్మలను ఎవరు విడదీయగలుగుతారు,అదే మీరు ఉమ్మడిగా ఉంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అందుకే కలిసి ఉంటే కలదు సుఖం , ఐకమత్యమే మహాబలం .