valentine's day❤️❤️❤️
Valentine's day అనగానే ముందు మనకు గుర్తుకు వచ్చే విషయం ఏంటి. ? అదే ఏంటి అని ఆలోచిస్తున్నారా! చెప్తా ఉండండి అసలు విషయం భజరంగ్ దళ వాళ్ళు . అవును కొన్ని రోజుల క్రితం వరకు వాళ్ళు వాలెంటైన్ డే రోజు రోడ్డు మీద ఎవరైనా ప్రేమికులు లేదా జంటగా కనబడినా కూడా వాళ్ళ చేతికి బలవంతంగా తాళి ఇచ్చి కట్టమనేవారు .అందులో కొందరు ఇష్టం ఉండి ,ఇష్టం లేక ,కొందరైతే స్నేహితులుగా ఉండేవాళ్ళు కూడా ఉండేది .కానీ ఇప్పుడు పరిస్థితి మారింది లెండి.ఇది మాకు ఎందుకు అనుకోకండి రీడర్స్ valentine's day special blog.
Valentine's day ఎలా మొదలైంది అంటే , మూడవ శతాబ్దంలో రోమ్ ను పరిపాలిస్తున్న చక్రవర్తి క్లాడియాస్ 2 తన నగరంలో ప్రేమ వివాహాలను నిషేధించాడు ,పెద్దల మాట వినకుండా చేసుకున్న పెళ్ళిళ్ళ వల్ల వారు జీవితంలో నష్ట పోతారు అని భావించి అతను అలా చేశాడు.కానీ తాడిని తన్నేవాడు ఒకడైతే వాడి తల తన్నేవాడు ఇంకొకడు వుంటారు అని అంటారు కదా! అలా ఈయన నిషేధిస్తే మనం ఎందుకు పాటించాలి అనుకున్న సెయింట్ వాలెంటైన్ అనే వ్యక్తి అదే ప్రేమ వివాహాలకు మద్దతు తెలిపాడు .అతన్ని చక్రవర్తి ఎన్నో సార్లు మందలించాడు కానీ అతను వినలేదు.దీనికి తోడు చక్రవర్తి కుమార్తె కూడా క్లాడియస్ కి వ్యతిరేకంగా తయారు అయింది. వాలెంటైన్ ను జైలులో వేసి చిత్ర హింసలు చేశారు అయిన పద్ధతులు మార్చుకోలేదు ,చివరగా అతన్ని ఊరి తీసి చంపారు.అది February 14 న జరిగింది కనుక అప్పటి నుండి అతని జ్ఞాపకార్థం వాలెంటైన్స్ డే ను సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.
ప్రేమించుకునే వాళ్లకు ఇదొక అద్భుతమైన రోజు ,
కానీ వాళ్లకు మాత్రమే కాదు.ప్రేమ అంటే ఒకరి మీద ఇంకొకరు చూపించేది అది తల్లితండ్రుల మీద ,మన తోడబుట్టిన వాళ్ళ మీద ,మన చుట్టుపక్కల మనుషుల మీద జంతువుల మీద మనకు నచ్చిన వస్తువుల మీద కూడా ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్క రోజు సరిపోదు మనం ప్రేమించడానికి .
మన జీవితంలో వాలెంటైన్స్ డే ను ఎలా అన్వయించుకోవాలో చూద్దాం!.
Rose day - ఎవరికో ఒక రోజా పువ్వు ఇచ్చి వాళ్ళను ఆనంద పెట్టేందుకు ప్రయత్నిచేకంటే మనకు మనమే ప్రతిరోజూ విరబూసిన రోజా పువ్వు లాగా ఉండాలి.అదే నిజమైన రోస్ డే.
Prapose day - self love is more important than loving other's , సో మనకు మనమే ప్రపోజ్ చేసుకొని ఆనందంగా ఉండాలి. మన చుట్టూ ఉన్నవాళ్ళని మనం ఇబ్బంది పెట్టకుండా ఉండాలి.
Choclate day - మనకు నచ్చిన ఫుడ్ తినాలి అది కూడా ఆస్వాదిస్తూ చాలా ఇష్టపడి తినాలి.ఏదో తిన్నాం అంటే తిన్నాం అని తినకుండా మంచిగా తినండి , కూటి కోసం కోటి విద్యలు అని ఊరికే అనలేదు పెద్దలు.
Teddy day - మన సంపాదనలో కొంత భాగాన్ని దాచుకొని మిగిలిన అవసరాలు తీరాక నచ్చిన బహుమతులు కొనుక్కోవాలి మనకు ఇష్టమైన వారికి ఇవ్వాలి . ఒక్కోసారి కొన్ని వస్తువులు చూస్తే
Promise day - మనం మనకు ప్రామిస్ చేసుకోవాలి మన లైఫ్ లో అనుకున్నవి అనుకున్నట్టు జరగవు కానీ ఒక గమ్యంతో పని చేయాలి. ప్రతి ఒక్కరి జీవితంలో మలుపులు ఊహించని రీతిలో ఉంటాయి.కాబట్టి ప్రతీదీ మన సొంతం అవుతుందని ఆశ పడకుండా ముందుకు వెళ్ళాలి.
Hug day - మనకు నచ్చిన వాళ్ళని ఒక రెండు నిముషాల పాటు హత్తుకోవడం వల్ల మన మనసుకు చాలా సంతోషంగా ఉంటుందని శాస్త్రవేత్తల అభిప్రాయం.ఒక్కసారి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి వారితో ప్రేమగా ఉండండి.
Kiss day - ఒక్క సారి అద్దంలో చూసుకొని మిమ్మల్ని మీరు ముద్దు పెట్టుకోండి ఎంత కాన్ఫిడెంట్ పెరుగుతుందో.మనకు మనమే అందగాళ్ళమని ఫీల్ అవ్వాలి.
Valentines day - మనల్ని మనం ప్రేమించినపుడు ప్రతిరోజూ వాలెంటైన్స్ డే నే.
మనల్ని మనం ప్రేమించినపుడు ఎదుటి వాళ్లను కూడా ప్రేమతో స్వీకరించ గలము.ప్రతి పనికి స్వీయ నియత్రణ ఉండాలి అప్పుడు ప్రతిదీ ప్రేమమయం.ఎవరినో ప్రేమించి వాళ్ళ నుండి తిరిగి ప్రేమను పొందలేక బాధ పడడం కంటే మనని మనమే ప్రేమించుకొని , జీవితంలో ప్రతి పనిని ఇష్టంతో చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి .ఈ రోజు నచ్చింది రేపు నచ్చక పోవచ్చు అది మనుషులైన వస్తువులైన అందుకే ఎవరి మీద ఎక్కువ ఆధార పడవద్దు.
చివరగా అసలు ప్రేమ అంటే మనుషులపైన నమ్మకం , ఎదుటి వారి అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడం.ఎవరిని నొప్పించకుండా ఉండడం , వాళ్ళ రక్షణ (care ) కోసం మనం ఉన్నామన్న భరోసా ఇవ్వడం .అది ఒక అమ్మాయి అబ్బాయి ల మీద కాదు అందరి మీద మనకు జన్మ ఇచ్చిన తల్లితండ్రుల మీద ,మన తోడబుట్టిన వాళ్ళ మీద మన స్నేహితుల మీద ,మనకు నచ్చిన వాళ్ళ మీద ఎవరిమీద అయిన సరే.
Love is nothing but trust ,care, respect.
Nice 💐
ReplyDelete