Skip to main content

ఆహార సూత్రాలు.

తాతయ్య ఒక కథ చెప్పావా ? అని అడిగింది చిట్టి. రోజూ కథ ఎందుకు చెప్పాలి, ఈ రోజు నీకు ఒక మంచి విషయం చెప్తాను చిట్టీ అని చెప్పాడు.సరే తాతయ్య ఏదో ఒకటి చెప్పు నేర్చుకుంట అన్నది. అవును ఏ మంచి విషయం చెప్తావు తాత అన్నది .
అదే తినడం గురించి, అంటే తాతయ్య?మనం ఏం తింటున్నాం ఎలా తింటున్నాం అన్న విషయం.సరే తాత ఇదేదో విచిత్రంగా ఉంది రోజు తినే అన్నం తినడానికి కూడా పద్ధతులు ఉన్నాయా? .
హితంగా తినాలి,మితంగా తినాలి,ఋతు అనుగుణంగా తినాలి అంటారు పెద్దలు.ఏం తినాలో,ఎంత తినాలో,ఎప్పుడూ తినాలో చూసుకొని తినాలి.ఆహారం ఎలా తినాలో తెలిస్తే ఆరోగ్యంగా మారుతుంది అమృతంగా బతికిస్తుంది.
 వైశ్వనర విద్యగా పిలిచే ఈ విధానాన్ని  మన పూర్వీకులు ఓ యజ్ఞంలాగ ఆచరించారు.ఇప్పుడు మాత్రం నూటికి 90 మంది ఆహార సూత్రాల విషయంలో అలసత్వం వహిస్తున్నారు.
      అవునా తాతా భోజనం చేయడం ఓ యజ్ఞమా ? అవును చిట్టి భోజనం చేయడం ఒక యజ్ఞం.
మన ఋషులు మోక్ష సాధన గురించే కాక ఇహ లోకంలో సుఖ సంతోషాలతో ఉండాలంటే ఏం చేయాలో చెప్పారు.మనం తినే ఆహారం త్రాగే నీరు స్వచ్చంగా ఉండాలి.మనకు వచ్చే ఎక్కువ రోగాలలో అత్యధిక శాతం జీర్ణ వ్యవస్థకు చెందినవే అయి ఉంటాయి. పూర్వం మనం ఆహారం కింద కూర్చొని అరిటాకులో తినేవాళ్ళమూ,ఏదైనా ఫంక్షన్ జరిగినా కూడా బంతిలో అందరూ వరుసగా కూర్చొని అరిటాకులో కలిసి భోజనం చేసేవారు.  కానీ ఇప్పుడు అందరూ నిలబడి బఫెలో  తింటున్నారు.కనీసం కూర్చొని తినే అలవాటు కూడా పోయింది . ఎందుకు తాత అలా? నిలబడి తింటే ఏమవుతుంది. ఆహారం సరిగ్గా  జీర్ణం అవదు .   అరటి ఆకులో తినడం అనేది కేవలం సంప్రదాయం మాత్రమే కాదు ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి.అరటాకులో పాలిఫెనల్స్,యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.వేడి వేడి  ఆహారాన్ని ఆకులో వడ్డించినపుడు ఆకులోనీ పోషకాలు ఆహారంతో కలిసి మన శరీరానికి అందుతాయి.ఇది రోగనిరోధక శక్తిని పెంచి, హానికారక బాక్టీరియాను ఇవి నశింపచేస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది,ఇప్పుడు వస్తున్న ప్లాస్టిక్ , థెర్మకోల్ ప్లేట్ లతో పోలిస్తే అరటి ఆకులు సురక్షితం అయినవి,విషపూరితం కావు.పర్యావరణం హితంగా ఉంటాయి. సరే తాత నేను కూడా ఇప్పటి నుండి అరిటాకులో తింటాను.
ఆహారంలో నమిలేవి,కొరికేవి చీకేవి,తాగేవి ఇలా రకరకాలుగా ఉంటాయి. తినేవి ఎప్పుడైనా ఆరోగ్యం పెంచేవిగా ఉండాలి. మనం తినే ఆహారంలో ఆకుకూరలు,  కూరగాయలు, పండ్లు, చిక్కుళ్ళు,తృణధాన్యాలు,గింజలు మరియు విత్తనాలు,విటమిన్లు మరియు ఖనిజాలు మనం ఆహారంగా  తీసుకోవాలి.రోజుకు కనీసం 400 గ్రా పండ్లు మరియు కూరగాయలు తినాలి. చక్కెర తక్కువ తీసుకోవాలి,ఉప్పు తగ్గించాలి, క్రమం తప్పకుండా నీరు త్రాగాలి. ఆహారంపై శ్రద్ధ పెట్టీ మరీ తినాలి,ప్రశాంతమైన వాతావరణంలో మౌనంగా తినాలి టీవీ చూసుకుంటూ మొబైల్ చూస్తూ తింటూవుంటే మనం ఏం తింటున్నామో కూడా తెలియదు. ఆహారాన్ని బాగా ఆస్వాదిస్తూ తినాలి. Kuku with jathiratnalu show లో  ఆశిష్ విద్యార్థి  తినే విధాన్ని చూస్తే  తినాలి అనిపిస్తుంది. చాలా తక్కువ మంది ఆహారాన్ని ఆస్వాదిస్తూ  తింటారు.   ఆహారాన్ని బాగా నమిలి తినాలి దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.ఆహారంలో  షడ్రసోపేత రుచులు ఉండాలి.
 మనకు బాగా ఆకలి వేసినపుడే తినాలి, ఎపుడు పడితే అపుడు తినొద్దు  సమయానికి తినాలి  ఆహారానికి గౌరవం  ఇవ్వాలి. ఎందుకంటే  ఒక కిలో బియ్యాన్ని పండించడానికి 5000 lit  నీరు అవసరం అవుతుంది .ఎంత అవసరమో అంతే పెట్టుకొని తగినంత పరిమాణం తినాలి . రెండు వంతుల అన్నం ,ఒక వంతు నీరు ఉంటేట్లు చూసుకోవాలి .ఒక భాగం ఖాళీ ఉంటే త్వరగా జీర్ణం అవుతుంది, ఎప్పుడైనా అలాగే తినాలి.   డైటింగ్ వంటి చేష్టలు  చేయకూడదు మంచిగా తినుకుంటూ  ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి  . ఇప్పుడు అర్థం అయిందా చిట్టి ఆహారం ఎలా తినాలో ,ఏం తినాలో  ,ఎందుకు తినాలో .అవును తాతయ్య ఇప్పటి నుండి నేను కూడా ఆహారాన్ని ఆస్వాదిస్తూ, గౌరవిస్తూ,తింటా.
   






Comments

Post a Comment

Popular posts from this blog

రైతు కథ..

ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు  డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి  తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా  ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి  దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా! ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా. కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా. మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల  లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి  ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా.     అనగనగా ఒక ఊర...

చిలుక జింక స్నేహం నీతి కథ (True Friendship Story in Telugu)

అనగనగా ఒక అందమైన అడవిలో ఓ చురుకైన చిలుక, ఒక అమాయక జింక ఉండేవి. ఆ ఇద్దరూ ఎంతో మంచి స్నేహితులు. ప్రతిరోజూ కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ, దూరంగా వెళ్లి తిండి వెతుక్కొని వచ్చేవి. ఒకరోజు చిలుకకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. “మనకు ప్రతిసారి తిండి కోసం తిరగాల్సి వస్తోంది. మనమే ఒక చిన్న తోట పెంచుకుంటే ఎలా ఉంటుంది?” అని జింకను అడిగింది. జింకకు ఆ ఆలోచన చాలా నచ్చింది. “అవును! మనమే పండ్లు పెంచుకుంటే ఎప్పుడైనా తినవచ్చు” అని ఆనందంగా చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రదేశాన్ని ఎంచుకుని గింజలు వేశారు. చిలుక ప్రతిరోజూ వచ్చి చూసేది కానీ పని మాత్రం చేయకుండా తప్పించుకునేది. జింక మాత్రం ఎంతో కష్టపడి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ, మొక్కలను జాగ్రత్తగా పెంచింది. కొన్ని రోజుల తర్వాత మొక్కలు పెద్దవై అందమైన పండ్లతో నిండిపోయాయి. అప్పుడు చిలుక వచ్చి, “ఇది మన ఇద్దరి తోట కదా! పండ్లు ఇద్దరం పంచుకుందాం” అని చెప్పింది. జింక కొంచెం కోపంగా నవ్వుతూ, “పని చేసేప్పుడు కనిపించలేదు, కానీ తినేప్పుడు మాత్రం వచ్చావు! స్నేహం అంటే మాటల్లో కాదు… పని చేసినప్పుడు కూడా కలిసి ఉండాలి” అని చెప్పింది. చిలుక తన తప్పు అర్థం చేసుకుంది. “ఇక మీదట...

ఐకమత్యమే మహాబలం.

ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ఆస్తిపరుడు. అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు, వారు అంత పిల్లపాపాలతో సుఖంగా జీవించేవారు.కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య ఆరోగ్యం చెడిపోయింది తన తర్వాత ఆస్తిని చూసుకోవడానికి తన కొడుకులకు అప్పజెప్పాలని అనుకుంటాడు. వారంతా ఎవరికి వారు నాకే దక్కాలని ప్రయత్నాలు చేసారు.ఈ ఆస్తి అంత ఒక్కదగ్గరే ఉండాలని దాన్ని ముక్కలు చేయవద్దు అని రాఘవయ్య భావించాడు.అలా కొడుకులకు చెప్పాడు అయినా వాళ్ళు వినలేదు.రాఘవయ్య కొడుకులకు బుద్ది చెప్పాలని ఒకరోజు కొడుకులకు నాలుగు కట్టెలు తెమ్మన్నాడు .అందరిని నిలబెట్టాడు, ఒక్కొక్కరిని ఆ కట్టెలు విరగగొట్టమన్నాడు.అందరూ విరిచేశారు.తర్వాత అందరి చేతుల నుండి కట్టెలు తీసుకొని ఒక కట్టలాగా కట్టాడు.దానిని విరవమన్నాడు,అందరూ ప్రయత్నించారు.ఒక్కరు కూడా విరవలేక పోయారు.అప్పుడు రాఘవయ్య చూసారా మీరు ఒక్కొక్కరుగా ఉంటే మీకు నష్టం కలుగుతుంది మిమ్మలను ఎవరు విడదీయగలుగుతారు,అదే మీరు ఉమ్మడిగా ఉంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అందుకే కలిసి ఉంటే కలదు సుఖం , ఐకమత్యమే మహాబలం .