Skip to main content

సమ్మక్క - సారలమ్మ జాతర

 తెలంగాణ కుంభమేళా 

ప్రస్తుతం తెలంగాణలో ఎవరి నోటా విన్నా ఒకటే మాట ,దారులన్నీ ఒకటే బాట అదే మన 
సమ్మక్క సారక్క జాతర . సమ్మక్క సారక్క జాతర రెండేళ్ళ ఒకసారి వస్తుంది మాఘమాసంలో పౌర్ణమి కి నాలుగు రోజుల ముందు అవుతుంది .ఈ జాతరలో నడిపించేది అంత ఒగ్గు పూజారులు .వాళ్ళే చేయాల్సిన అన్ని కార్యక్రమాలు చేస్తారు.4 రోజుల జాతర.  బెల్లమే బంగారగా  సమర్పించి  ఇక్కడ  అమ్మవారిని   కొలుస్తూ  ఉంటారు  ఇది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర.గిరిజన సంస్కృతి సంప్రదాయాలకు సామూహిక భక్తికి ప్రతీక .ఈ సమ్మక్క సారలమ్మ జాతరలో వెదురు కర్రలు,కుంకుమ బరినలు వనదేవతల ప్రతిరూపాలు.పెద్ద హంగు ఆర్భాటాలు లేని గోపురం గోడలు లేని గుడి మన సమ్మక్క సారలమ్మ లది.ఆదివాసీల విశ్వాసాల ఆలంబనగా వర్ధిల్లుతుంది ఈ జాతర.పెద్ద నైవేద్యం కూడా లేదు బెల్లం కేవలం బెల్లం మాత్రమే ప్రసాదంగా అదే బంగారగా , నిలువెత్తు బరువుగా ఇక్కడ అమ్మవార్లకు సమర్పిస్తారు.
  జాతరలో మొదటిగా కన్నెపల్లి నుండి సారలమ్మ వస్తుంది,తర్వాత పులిగొండ్ల నుండి పగిడిద్దరాజు,కొండాయి నుండి గోవిందరాజుల  ప్రతిరూపాలు మేడారం గద్దెల మీదకు తీసుకొని వస్తారు.రెండవ రోజు మందిరసారే పేరుతో చిలకలగుట్ట నుండి సమ్మక్క రూపాన్ని ప్రధాన పీఠానికి తెస్తారు. మండేమాలిగ పేరిట సమ్మక్కకు మొదటి పూజలు చేస్తారు.మూడోరోజు భక్తులు మొక్కుబడులు సమర్పిస్తారు.నాలుగోరోజు సాయంత్రం వనదేవతలను అరణ్యానికి సాగనంపుతారు. ఆహ్వానం,ఆగమనం,ఆరాధనం,నిష్క్రమణం అనే నాలుగు అంశాల ఆధారంగా ఈ జాతర జరుగుతుంది.
ఈ  జాతరకు సంబంధించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి .దండకారణ్యంలో మేడారం పరిగణ కు మేడరాజు సామంత పాలకుడు.ఆయన వేటకు వెళ్లినపుడు పులుల మధ్య సంచరిస్తున్న దివ్యాంశతో కూడిన బాలిక కనిపించిందట .జగన్మాత  వరప్రసాదంగా భావించి సమ్మక్క అని పేరు పెట్టుకున్నాడు.కాలక్రమంలో మేడరాజు తన మేనల్లుడైన పగిడిద్దరాజుతో సమ్మక్క వివాహం జరిపించాడు.వారికి కలిగిన సారలమ్మ,జంపన్న. కాకతీయ రాజులకు సామంతులైన కోయరాజులు కరువు కాటకాల వల్ల కొన్నేళ్లు కప్పం చెల్లించక పోవడంతో ఆగ్రహంతో ప్రతాపరుద్రుడు వారిపై దండెత్తాడు .యుద్ధంలో పగిడిద్దరాజు, నాగులమ్మ, సారలమ్మ అల్లుడు గోవిందరాజులు వీరమరణం పొందారు. ఆనాడు జంపన్న ఆత్మార్పణం చేసుకున్న సంపెంగ వాగు నేడు జంపన్న వాగుగా మారిపోయింది.బిడ్డల మరణవార్త విని అపరకాలికగా కాకతీయ సైన్యంపై విరుచుకుపడిన సమ్మక్కను కాకతీయ సైన్యం వెన్నుపోటు పొడిచింది.
తీవ్రంగా గాయపడిన సమ్మక్క రక్తసిక్త దేహంతో ,చిలకలగుట్ట పైకి వెళ్ళి తన రక్తమే కుంకుమ భరణి రూపంగా మారి వెదురు కర్రగా ఆకృతిగా దాల్చిందంటారు.సమ్మక్క  ధైర్య సాహసాలను ప్రత్యక్షంగా చూసిన ప్రతాపరుద్రుడు ఆమెను వనదేవతగా భావించి భక్తుడిగా మారి జాతరను ప్రారంభించాడంటారు.అదే సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది.
ఈ జాతర ఒక మహిళ యొక్క వీరత్వానికి,పరాక్రమానికి నిదర్శనం.జనం మధ్యలో తిరిగి జనానికి ధైర్యం ఇచ్చి ఆమె దేవతగా రూపొందిన కథ మన సమ్మక్క సారలమ్మలది.
ఆదివాసి మహిళా పోరాట పటిమకు రాజు కట్టిన పట్టం ,ఆయన మొదలుపెట్టిన ఘట్టం ఈ జాతర.ఈ జాతరకు ప్రజలు  దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వస్తారు.ఇసుకేస్తే రాలనంత జనంతో ఉంటుంది.





Comments

Post a Comment

Popular posts from this blog

రైతు కథ..

ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు  డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి  తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా  ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి  దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా! ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా. కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా. మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల  లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి  ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా.     అనగనగా ఒక ఊర...

చిలుక జింక స్నేహం నీతి కథ (True Friendship Story in Telugu)

అనగనగా ఒక అందమైన అడవిలో ఓ చురుకైన చిలుక, ఒక అమాయక జింక ఉండేవి. ఆ ఇద్దరూ ఎంతో మంచి స్నేహితులు. ప్రతిరోజూ కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ, దూరంగా వెళ్లి తిండి వెతుక్కొని వచ్చేవి. ఒకరోజు చిలుకకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. “మనకు ప్రతిసారి తిండి కోసం తిరగాల్సి వస్తోంది. మనమే ఒక చిన్న తోట పెంచుకుంటే ఎలా ఉంటుంది?” అని జింకను అడిగింది. జింకకు ఆ ఆలోచన చాలా నచ్చింది. “అవును! మనమే పండ్లు పెంచుకుంటే ఎప్పుడైనా తినవచ్చు” అని ఆనందంగా చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రదేశాన్ని ఎంచుకుని గింజలు వేశారు. చిలుక ప్రతిరోజూ వచ్చి చూసేది కానీ పని మాత్రం చేయకుండా తప్పించుకునేది. జింక మాత్రం ఎంతో కష్టపడి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ, మొక్కలను జాగ్రత్తగా పెంచింది. కొన్ని రోజుల తర్వాత మొక్కలు పెద్దవై అందమైన పండ్లతో నిండిపోయాయి. అప్పుడు చిలుక వచ్చి, “ఇది మన ఇద్దరి తోట కదా! పండ్లు ఇద్దరం పంచుకుందాం” అని చెప్పింది. జింక కొంచెం కోపంగా నవ్వుతూ, “పని చేసేప్పుడు కనిపించలేదు, కానీ తినేప్పుడు మాత్రం వచ్చావు! స్నేహం అంటే మాటల్లో కాదు… పని చేసినప్పుడు కూడా కలిసి ఉండాలి” అని చెప్పింది. చిలుక తన తప్పు అర్థం చేసుకుంది. “ఇక మీదట...

ఐకమత్యమే మహాబలం.

ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ఆస్తిపరుడు. అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు, వారు అంత పిల్లపాపాలతో సుఖంగా జీవించేవారు.కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య ఆరోగ్యం చెడిపోయింది తన తర్వాత ఆస్తిని చూసుకోవడానికి తన కొడుకులకు అప్పజెప్పాలని అనుకుంటాడు. వారంతా ఎవరికి వారు నాకే దక్కాలని ప్రయత్నాలు చేసారు.ఈ ఆస్తి అంత ఒక్కదగ్గరే ఉండాలని దాన్ని ముక్కలు చేయవద్దు అని రాఘవయ్య భావించాడు.అలా కొడుకులకు చెప్పాడు అయినా వాళ్ళు వినలేదు.రాఘవయ్య కొడుకులకు బుద్ది చెప్పాలని ఒకరోజు కొడుకులకు నాలుగు కట్టెలు తెమ్మన్నాడు .అందరిని నిలబెట్టాడు, ఒక్కొక్కరిని ఆ కట్టెలు విరగగొట్టమన్నాడు.అందరూ విరిచేశారు.తర్వాత అందరి చేతుల నుండి కట్టెలు తీసుకొని ఒక కట్టలాగా కట్టాడు.దానిని విరవమన్నాడు,అందరూ ప్రయత్నించారు.ఒక్కరు కూడా విరవలేక పోయారు.అప్పుడు రాఘవయ్య చూసారా మీరు ఒక్కొక్కరుగా ఉంటే మీకు నష్టం కలుగుతుంది మిమ్మలను ఎవరు విడదీయగలుగుతారు,అదే మీరు ఉమ్మడిగా ఉంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అందుకే కలిసి ఉంటే కలదు సుఖం , ఐకమత్యమే మహాబలం .