Skip to main content

గోదా కల్యాణం

గోదాదేవి వచ్చెనమ్మా మన ఆండాళ్ వచ్చెనమ్మా
శ్రీ విల్లిపుత్తూర్ నుండి గోదాదేవి వచ్చెనమ్మా మన కృష్ణుణ్ణి పెళ్లాడ  వచ్చెనమ్మా. 
ఈ పాట నిజంగా వినని వారు ఉండరు అంటే అతిశయోక్తి లేదు. ఎందుకు అంటే ఈ పాట అందరికి తెలుసు .మన గోదాదేవి కల్యాణం పాట కాబట్టి .
ఈ రోజు మన కథ గోదా కల్యాణం కథ.ఆమె ఎవరు ?ఆమె కృష్ణుడిని ఎందుకు పెళ్లి చేసుకుంది ? అని ఆమెని గురించి తెలుసుకుందాం.
శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తుడు అనే విష్ణు భక్తుడు ఉండేవాడు.అతని చిత్తం ఎల్లప్పుడూ విష్ణువు మీదనే ఉండడం వల్ల అతనికి విష్ణుచిత్తుడు అనే పేరు వచ్చింది ఇతను ఆళ్వార్ లలో ఒకరు మరియు పెద్ద ఆళ్వార్ . విష్ణుచిత్తుడు ఒక తోట పెంచేవాడు ఆ తోటలో మొక్కలకు పాదులు తీసే సమయంలో తులసి మొక్కల దగ్గర ఒక చిన్న పాప దొరికింది. ఆమెకు కోదై అనే పేరు పెట్టాడు  కోదై అంటే పూలమాల అని అర్థం అది  క్రమంగా గోద గా మారింది.
  ఆమెను విష్ణుచిత్తుడు అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.గోదకు ప్రతిరోజు చిన్ని కృష్ణుడి లీలలు చెప్పేవాడు ఆమె ఎంతో శ్రద్ధతో వినేది .ఆమె కృష్ణుడి కథ లేకుండా నిద్రపోయేది కాదు .అలా అలా పెరిగి పెద్దది అయింది .చిన్నతనం నుండి కృష్ణుని గురించి వినడం వల్ల ఆమె ఎలా అయినా కృష్ణుని పొందాలని భావించింది.దానికోసం ఆమె గోపికలు చేసిన కాత్యాయని వ్రతం చేయాలని అనుకుంది.కాత్యాయని వ్రతం చాలా కఠినంగా ఉంటుంది కాబట్టి ఆమె తనతో పాటు తన స్నేహితురాళ్లను కూడా ఈ వ్రతానికి ప్రోత్సహించింది.తన స్నేహితురాళ్లను నిద్ర లేపడానికి ప్రతిరోజు పాటలు పాడేది కృష్ణుడి పైన తన భక్తినంత పాట రూపంలో తెలియ జేసింది ఇవి అన్ని 30 పాశురాలుగా ప్రసిద్ధి చెందాయి.వాటిని తిరుప్పావై అంటారు.
ఆమె భూదేవి అంశ కాబట్టి ఒక తల్లి పిల్లలకు ఎలా చెప్పాలో అన్ని విషయాలు తను ముప్పై పాశురాలలో వివరించింది.అలా చేసిన వ్రతానికి కృషుడు లొంగిపోయాడు .భగవంతుడు ఎప్పుడూ భక్తుడికి , భక్తికి దాసోహం అవుతాడు ఎందుకంటే ఆ భక్తి అచంచలమైనది అనిర్వచనీయమైనది.
ఆమె కట్టిన పూల మాలలు ముందుగా తాను ధరించి అద్దంలో చూసుకుని మురిసేది అవే కృష్ణుడికి అర్పించేది.ఒకరోజు విష్ణుచిత్తుడు ఆ మాలలు తీసుకొని వెళుతుంటే గోదా అమ్మవారి వెంట్రుక కనిపించింది .అలా ఎందుకు జరిగింది అపచారం అని భావించి ఆ మాలలు పక్కన పెట్టారు తర్వాత విష్ణుచిత్తుడికి కలలో స్వామి కనిపించి నాకు ఆ మాలలు వేయాలని చెప్పాడు.ఆ కల గురించి ఆ ఆలయ పూజారులకు చెప్పాడు వారు నమ్మలేదు.స్వామి ప్రత్యక్షమై గోదా అమ్మవారిని నేను పెళ్లి చేసుకుంటాను ఆమెను తీసుకొని శ్రీరంగం రమ్మని విష్ణుచిత్తుడుకి  చెప్పారు అంట. శ్రీరంగంలో పూజారులు ముందుగానే విషయం తెలుసుకుని వారి కోసం అన్ని ఏర్పాట్లు చేశారు, అందరూ కూడా  వచ్చారు.గోదాదేవి అందరూ చూస్తుండగానే రంగనాథుడిలో ఐక్యం అయింది.ఆ చిత్రానికి అందరూ ఆశ్చర్యం పొందారు. ఇది భోగినాడు జరిగింది కాబట్టి ప్రతి వైష్ణవ ఆలయంలో భోగి రోజు గోదా కల్యాణం జరిపిస్తారు.ఆమె పాశురాలని తిరుప్పావై గా చదువుతారు.















Comments

Post a Comment

Popular posts from this blog

రైతు కథ..

ఒక చోట పెళ్లి జరుగుతుంది చాలా గ్రాండ్ గా అందులో నృత్యం చేస్తున్న ఒక పెద్దావిడ, ఆమె కొడుకు  డాన్స్ మద్యలో నాకు ఆకలి వేస్తుంది పద తిందాం అన్నది ఆ పెద్దావిడ .ఆమె ,ఆమె కొడుకు ఇద్దరు కలిసి తినడానికి వెళతారు అక్కడ భోజనాలు వడ్డించే వారు చేతులు జోడించి  తినడానికి ఏమి లేవు క్షమించండి అంటారు అది చూసి వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకు అని అడుగుతారు వాళ్ళు ఇవాళ రైతు సెలవులో వున్నాడు అన్నారు అది ఎలా కుదురుతుంది అంటారు వాళ్ళు.అవును నిజంగా రైతు సెలవులో ఉన్నాడు ఇది ఇంతవరకు ఎప్పుడైనా జరిగిందా ,జరిగితే నిజంగా  ఎలా ఉంటుంది ,ఎంత కష్టం కదా! అది కేవలం గ్రోమోర్ యాడ్ మాత్రమే.మనకు తిండి  దొరకని రోజు ఒకసారి ఊహిస్తే భయంకరంగా ఉంటుంది కదా! ఎవరు ఎంత కష్టపడినా భోజనం కోసమే కదా. కూటికోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు. అవును తినడానికేగా ఎన్ని పనులు చేసినా. మీకు తెలుసా ఒక కిలో వరిని పండించడానికి సుమారు అయిదు వేల  లీటర్ల నీరు అవసరం అవుతుంది తెలుసా? అందుకే భోజనాన్ని ఎప్పుడు వృధా చేయవద్దు .అలాంటి  ఆహారాన్ని పండించే ఒక రైతు కథ ఇది అందరి రైతుల కథ దాదాపుగా.     అనగనగా ఒక ఊర...

చిలుక జింక స్నేహం నీతి కథ (True Friendship Story in Telugu)

అనగనగా ఒక అందమైన అడవిలో ఓ చురుకైన చిలుక, ఒక అమాయక జింక ఉండేవి. ఆ ఇద్దరూ ఎంతో మంచి స్నేహితులు. ప్రతిరోజూ కలిసి తిరుగుతూ, ఆడుకుంటూ, దూరంగా వెళ్లి తిండి వెతుక్కొని వచ్చేవి. ఒకరోజు చిలుకకు ఒక కొత్త ఆలోచన వచ్చింది. “మనకు ప్రతిసారి తిండి కోసం తిరగాల్సి వస్తోంది. మనమే ఒక చిన్న తోట పెంచుకుంటే ఎలా ఉంటుంది?” అని జింకను అడిగింది. జింకకు ఆ ఆలోచన చాలా నచ్చింది. “అవును! మనమే పండ్లు పెంచుకుంటే ఎప్పుడైనా తినవచ్చు” అని ఆనందంగా చెప్పింది. ఇద్దరూ కలిసి ఒక చిన్న ప్రదేశాన్ని ఎంచుకుని గింజలు వేశారు. చిలుక ప్రతిరోజూ వచ్చి చూసేది కానీ పని మాత్రం చేయకుండా తప్పించుకునేది. జింక మాత్రం ఎంతో కష్టపడి ప్రతిరోజూ నీళ్లు పోస్తూ, మొక్కలను జాగ్రత్తగా పెంచింది. కొన్ని రోజుల తర్వాత మొక్కలు పెద్దవై అందమైన పండ్లతో నిండిపోయాయి. అప్పుడు చిలుక వచ్చి, “ఇది మన ఇద్దరి తోట కదా! పండ్లు ఇద్దరం పంచుకుందాం” అని చెప్పింది. జింక కొంచెం కోపంగా నవ్వుతూ, “పని చేసేప్పుడు కనిపించలేదు, కానీ తినేప్పుడు మాత్రం వచ్చావు! స్నేహం అంటే మాటల్లో కాదు… పని చేసినప్పుడు కూడా కలిసి ఉండాలి” అని చెప్పింది. చిలుక తన తప్పు అర్థం చేసుకుంది. “ఇక మీదట...

ఐకమత్యమే మహాబలం.

ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా ఆస్తిపరుడు. అతనికి నలుగురు కొడుకులు ఉండేవారు, వారు అంత పిల్లపాపాలతో సుఖంగా జీవించేవారు.కొన్ని రోజుల తర్వాత రాఘవయ్య ఆరోగ్యం చెడిపోయింది తన తర్వాత ఆస్తిని చూసుకోవడానికి తన కొడుకులకు అప్పజెప్పాలని అనుకుంటాడు. వారంతా ఎవరికి వారు నాకే దక్కాలని ప్రయత్నాలు చేసారు.ఈ ఆస్తి అంత ఒక్కదగ్గరే ఉండాలని దాన్ని ముక్కలు చేయవద్దు అని రాఘవయ్య భావించాడు.అలా కొడుకులకు చెప్పాడు అయినా వాళ్ళు వినలేదు.రాఘవయ్య కొడుకులకు బుద్ది చెప్పాలని ఒకరోజు కొడుకులకు నాలుగు కట్టెలు తెమ్మన్నాడు .అందరిని నిలబెట్టాడు, ఒక్కొక్కరిని ఆ కట్టెలు విరగగొట్టమన్నాడు.అందరూ విరిచేశారు.తర్వాత అందరి చేతుల నుండి కట్టెలు తీసుకొని ఒక కట్టలాగా కట్టాడు.దానిని విరవమన్నాడు,అందరూ ప్రయత్నించారు.ఒక్కరు కూడా విరవలేక పోయారు.అప్పుడు రాఘవయ్య చూసారా మీరు ఒక్కొక్కరుగా ఉంటే మీకు నష్టం కలుగుతుంది మిమ్మలను ఎవరు విడదీయగలుగుతారు,అదే మీరు ఉమ్మడిగా ఉంటే మిమ్మల్ని ఎవరు విడదీయలేరు అందుకే కలిసి ఉంటే కలదు సుఖం , ఐకమత్యమే మహాబలం .