దీపావళి కథ...
దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం .ఈ పండగను భారతదేశం అంతటా పిల్లలు పెద్దలు టపాసులు,మిఠాయిలు, పిండివంటలతో చాలా సంతోషంగా జరుపుకుంటారు.
దీపావళి జరుపుకోవడానికి రకరకాల కధలు ప్రచారంలో ఉన్నాయి.పూర్వ కాలంలో నరకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు.అతను భూదేవి వరహస్వామికి అసుర సమయంలో జన్మించాడు.ఇతను రాక్షస ప్రవృత్తి చేత మరణించబడతాడు అని బాధ పడిన భూదేవి విష్ణుమూర్తిని ఒక వరం అడిగింది.అతనికి చావు లేకుండా చేయమని అన్నది, అలా జరగదు కాబట్టి తల్లి చేత మాత్రమే చంపబడతాడు అనే వరాన్ని పొంది ఉన్నాడు. తన తల్లి నేను నా కొడుకును చంపలేను కాబట్టి సరే అంది భూదేవి.ఆమె తన కొడుకు మంచి లక్షణాలు పొందడానికి జనక మహారాజుకి అప్పగించి వెళ్ళింది.జనక మహారాజు దగ్గర విద్య నేర్చుకొని అతను మంచి బుద్ధులు అలవాటు చేసుకున్నాడు.అతను కామాఖ్య అమ్మవారిని చాలా నిష్ఠగా పూజ చేసేవాడు. కొన్ని రోజులకు అతను పక్క రాజ్యం రాజైన బాణాసురుడుతో స్నేహం చేసాడు. అతను స్త్రీలను కేవలం భోగ వస్తువుగా మాత్రమే చూసేవాడు. అతని ప్రభావం చేత నరకాసురుడు కూడా మారిపోయాడు.స్త్రీలను ఆటబొమ్మలుగా చూడడం మొదలు పెట్టాడు,క్రమంగా పూజ చేయడం మానేశాడు.నరకాసురుడు పూర్తిగా రాక్షస లక్షణాలు అలవర్చుకున్నాడు.వరగర్వంతో ముల్లోకాలను పట్టి పీడించేవాడు.మునులను, గంధర్వులను ,స్త్రీలను ఇబ్బంది పెట్టేవాడు.వివిధ రాజ్యాల నుండి 16000 మంది స్త్రీలను చెర పట్టాడు.
నరకాసురుడి బాధలు తాళలేక అందరూ కలిసి శ్రీహరికి విన్నవించుకోవడానికి వెళ్లారు .విష్ణువు నేను ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడుగా అవతరించి మీ బాధలు తీరుస్తాను అని మాట ఇచ్చాడు. విష్ణువు కృష్ణుడుగా పుట్టాడు ,నరకాసురుడు ప్రజలను పెడుతున్న బాధలను తెలుసుకున్నాడు ,నరకాసురుడు తమ్ముడు ముర అనే రాక్షసుడిని కృష్ణుడు చంపాడు .కోపంతో నరకాసురుడు కృష్ణుడుపైకి యుద్ధానికి వెళ్ళాడు .ఆ యుద్ధంలో బాణం తగిలి శ్రీకృష్ణుడు మూర్ఛపోయాడు వెంటనే సత్యభామ యుద్ధంలో దిగి నరకాసురుడుతో భయంకరమైన యుద్ధం చేసి అతనిని హతమార్చుతుంది.16000 వేల మంది గోపికలను కృష్ణుడు విడిపించాడు .నరకాసురుడు మరణం తర్వాత అందరూ దీపాలను వెలిగించి సంబరాలు చేసుకున్నారు అందుకే మన యొక్క వ్యక్తిత్వాన్ని ఇతరులు ఎప్పుడు ప్రభావితం చేయరాదు.మనకంటూ ఒక స్పష్టమైన ఆలోచన ఉండాలి చెడు సావసాలు చేయవద్దు.
Super Happy Diwali sister
ReplyDeleteThankyou so muchsis
DeleteNice ❤️😍Bujjamm
ReplyDeleteosm kannamma ❤️😍😘💕
ReplyDelete